(Source: Poll of Polls)
Adani Group: హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికపై స్పందించిన అదానీ గ్రూప్- భారత్‌పై పక్కా ప్రణాళికతో చేసిన కుట్రగా అభివర్ణన
దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న పెట్టుబడిదారులను పణంగా పెట్టింది. లాభాల కోసం తన షార్ట్ ట్రేడింగ్లను నిర్వహిస్తూ దృష్టి మరల్చడానికి హిండెన్బర్గ్ ఓ నివేదిక సృష్టించిందని అదానీ గ్రూప్ తెలిపింది.
Adani Group: హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ ఆదివారం స్పందించింది. 413 పేజీలతో కూడిన ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. అదానీ గ్రూప్ ప్రతిస్పందన "భారతీయ న్యాయవ్యవస్థ, ఇతర విభాగాలను అనుమతులు, వివరణలను విస్మరించిన హిండెన్బర్గ్ చేసిన ప్రకటన దురుద్దేశాలు, వ్యవహార శైలి ప్రశ్నాత్మకంగా ఉంది. అదానీ గ్రూప్ వివరణాత్మక ప్రతిస్పందన... ఆ సంస్థ పాలనాప్రమాణాలు, ఆధారాలు, ఉత్తమ పద్ధతులు, పారదర్శక ప్రవర్తన, ఆర్థిక, కార్యాచరణ పనితీరు, శ్రేష్ఠతకు నిదర్శనం."
హిండన్బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ ఏం చెప్పిందంటే..
తమ షేర్ హోల్డర్లు, పబ్లిక్ ఇన్వెస్టర్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో హిండెన్ బర్గ్ నివేదిక రూపొందించినట్లు తెలిపారు. ఇది ఒక మానిప్యులేటివ్ డాక్యుమెంట్ అని ఆరోపించారు. మార్కెట్‌లో తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసి మార్కెట్‌లో లాభాలు పొందాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పని చేసిందని భారతీయ చట్టాల ప్రకారం మోసంగా అభిప్రాయపడింది.
88 ప్రశ్నల్లో 68 ప్రశ్నలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి - అదానీ గ్రూప్
హిండెన్ బర్గ్ అడిగిన 88 ప్రశ్నల్లో 68 ప్రశ్నలకు అదానీ గ్రూప్ కంపెనీలు ఎప్పటికప్పుడు మెమోరాండంలు, ఫైనాన్షియల్ స్టేట్ మెంట్లు, స్టాక్ ఎక్సేంజ్ నివేదికలు, తమ వార్షిక నివేదికల్లో వెల్లడించామన్నారు. ఆ కేసులను ప్రస్తావించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 20 ప్రశ్నల్లో 16 పబ్లిక్ షేర్ హోల్డర్లు, వారి నిధుల వనరులకు సంబంధించినవిగా వివరించారు. మిగిలిన నాలుగు నిరాధారమైన ఆరోపణలుగా కొట్టిపారేసింది.
హిండెన్ బర్గ్ షార్ట్ ట్రేడింగ్ నిర్వహిస్తుంది: అదానీ గ్రూప్
ఇన్వెస్టర్ల లాభాల కోసం తను షార్ట్ ట్రేడ్స్ ను నిర్వహిస్తూనే తన టార్గెట్ ఆడియన్స్ దృష్టిని మరల్చడానికి హిండెన్ బర్గ్ ఈ ప్రశ్నలను సృష్టించిందని వేరే చెప్పనవసరం లేదన్నారు. ఈ నివేదిక రెండు సంవత్సరాల దర్యాప్తు, సాక్ష్యాలను వెలికితీసినట్లు పేర్కొంది, కానీ ఇది సంవత్సరాలుగా పబ్లిక్ డొమైన్లో ఉన్న బహిర్గతమైన సమాచారమన్నారు. వాటిలో ఎంపిక చేసిన అంశాలను అసంపూర్ణమైన సారాంశాలే ఇందులో ఉన్నాటి తప్ప మరేదీ లేదన్నారు.
హిండెన్బర్గ్ నివేదిక ప్రణాళికాబద్ధమైన కుట్ర
జనవరి 24న 'మాడోఫ్స్ ఆఫ్ మాన్హాటన్' హిండెన్బర్గ్ రీసెర్చ్ ప్రచురించిన నివేదికను చదివి దిగ్భ్రాంతికి గురయ్యామని, ఇది అబద్ధం తప్ప మరేమీ కాదని అదానీ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డాక్యుమెంట్ ఎంపిక చేసిన తప్పుడు సమాచారమని అదానీ గ్రూప్ తెలిపింది. నిరాధారమైన, పరువునష్టం కలిగించే ఆరోపణలే అని ఖండించింది.
ఇది స్వప్రయోజనాలతో కోసం సృష్టించిన నివేదికగా తెలిపింది. షార్ట్ సెల్లర్ అయిన హిండెన్బర్గ్ తన పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ఆర్థిక లాభాలు కలిగించేందుకే ఈ తప్పుడు సమాచారం సృష్టించిందన్నారు.
ఎలాంటి విశ్వసనీయత, నైతికత లేకుండా వేల మైళ్ల దూరంలో కూర్చున్న ఒక సంస్థ ప్రకటనలు మన పెట్టుబడిదారులపై తీవ్రమైన, అపూర్వమైన ప్రతికూల ప్రభావాన్ని చూపడం చాలా ఆందోళన కలిగించేందన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఆఫరింగ్ ఈక్విటీ షేర్లను అందించే సమయాన్ని బట్టి నివేదికలోని దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. "ఇది ఒక నిర్దిష్ట సంస్థపై చేసిన దాడి కాదు, భారతదేశం, భారతీయ సంస్థల స్వతంత్రత, సమగ్రత, నాణ్యత, భారతదేశ వృద్ధి, ఆశయంపై ప్రణాళికాబద్ధమైన దాడి" అని అదానీ గ్రూప్ తెలిపింది.
షార్ట్ డీల్స్‌కు లబ్ది చేకూర్చేలా హిండెన్ బర్గ్ నివేదిక- అదానీ గ్రూప్
హిండెన్ బర్గ్ ఈ నివేదికను ఎటువంటి దాతృత్వ కారణాల వల్ల కాకుండా పూర్తిగా స్వార్థ ప్రయోజనాల కోసం రూపొందించింది. సెక్యూరిటీలు, విదేశీ మారక చట్టాలను బహిరంగంగా ఉల్లంఘించింది. అసలు విషయం ఏమిటంటే హిండెన్ బర్గ్ ఒక అనైతిక షార్ట్ సెల్లర్. సెక్యూరిటీస్ మార్కెట్‌లో షార్ట్ సెల్లర్ షేరు ధరల తగ్గింపు నుంచి లాభపడాలని చూస్తున్నారు.
హిండెన్ బర్గ్ షేరు ధరను ప్రభావితం చేయడానికి, తప్పుడు విధానాల్లో లాభాలను ఆర్జించడానికి, స్టాక్ ధరను తారుమారు చేయడానికి, మార్కెట్‌ను తప్పుదారి పట్టించేందుకు హిండెన్ బర్గ్ ఒక పత్రాన్ని ప్రచురించింది. వాస్తవాలుగా చూపిన ఆరోపణలు దావానంలా వ్యాపించాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ అంతిమంగా పబ్లిక్ ఇన్వెస్టర్లు నష్టపోతారు. హిండెన్బర్గ్ ఊహించని లాభాలను పొందుతుంది.