Adani Green Energy: షేర్లు తాకట్టు పెట్టి బండి లాగిస్తున్న 9 కంపెనీలు, అదానీ గ్రీన్ కూడా వాటిలో ఒకటి
సాధారణంగా, షేర్ల తనఖాను స్టాక్ మార్కెట్ నెగెటివ్‌గా చూస్తుంది. గత ఏడాది కాలంగా. షేర్ల తాకట్టు పెరిగిన చాలా కంపెనీల స్టాక్స్ ప్రతికూల రాబడి ఇచ్చాయి.
Adani Green Energy: గత ఏడాది కాలంలో కనీసం 9 కంపెనీల ప్రమోటర్లు, తమ షేర్ల తాకట్టు (pledging of shares) సైజ్‌ను పెంచతూ వచ్చారు. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల వద్ద షేర్లను తాకట్టు పెట్టి, రుణాలు తీసుకుని వినియోగించుకుంటున్నారు. కంపెనీలో వృద్ధి కోసం తమ షేర్లను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారా, లేక సొంత అవసరాల కోసం షేర్లను తాకట్టు పెట్టారా అన్న విషయంపై స్పష్టత లేదు.
సాధారణంగా, షేర్ల తనఖాను స్టాక్ మార్కెట్ నెగెటివ్‌గా చూస్తుంది. గత ఏడాది కాలంగా. షేర్ల తాకట్టు పెరిగిన చాలా కంపెనీల స్టాక్స్ ప్రతికూల రాబడి ఇచ్చాయి.
తాకట్టు కొట్లో అదానీ గ్రీన్ షేర్లు
ఈ తొమ్మిది కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) ఒకటి. ఈ కంపెనీ తాకట్టు పెట్టిన షేర్లలో విపరీతమైన పెరుగుదల కనిపించింది. తనఖా పెట్టిన మొత్తం ప్రమోటర్ వాటా 2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి ఉన్న 0.96% నుంచి 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం చివరి నాటికి 4.36% కి పెరిగింది.
జనవరి ప్రారంభం వరకు, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు మంచి రాబడి ఇచ్చాయి, కొంతమంది కోటీశ్వరులను మిలియనీర్లుగా మార్చాయి. అదానీ గ్రూప్‌పై జనవరి చివరిలో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అదానీ గ్రీన్ షేర్లు 74% పైగా క్షీణించాయి, తాజా 52 వారాల కనిష్టానికి చేరాయి. అదానీ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.
అదానీ గ్రీన్ తరహాలోనే, డ్రగ్ మేకర్ వోకార్డ్ (Wockhardt) ప్రమోటర్ కూడా షేర్లను విపరీతంగా తాకట్టు పెట్టారు, ప్లెడ్జింగ్ షేర్ల సైజ్ గత 3 త్రైమాసికాల్లో గణనీయంగా పెరిగింది. మరీ ఘోరమైన విషయం ఏంటంటే.. ఈ కంపెనీ ప్రమోటర్ల దగ్గర ఉండాల్సిన వాటాలో సగానికి పైగా (56%) తనఖాలోనే ఉంది.
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి, వోకార్డ్‌లో ప్రమోటర్ల వాటాలో 43.6% తాకట్టు కొట్టుకు వెళితే, 2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి అది 56% కు చేరింది. గత 1 సంవత్సరంలో దాదాపు 43% పడిపోయిన ఈ స్టాక్, ఫార్మాస్యూటికల్ స్పేస్‌లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న పేరుగా నిలిచింది.
ప్రమోటర్ షేర్లు తాకట్టులో ఉన్న ఇతర కంపెనీలు:
కంపెనీ పేరు: Chambal Fertilisers & Chemicals
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 18.86
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 25.02
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: -27
కంపెనీ పేరు: Share India Securities
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 10.89
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 39.19
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: +7
కంపెనీ పేరు: SMC Global Securities
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 8.65
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 21.37
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: +2
కంపెనీ పేరు: Solara Active Pharma
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 27.51
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 33.73
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: -48
కంపెనీ పేరు: Strides Pharma Science
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 56.67
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 69.44
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: +14
కంపెనీ పేరు: Usha Martin
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 53.59
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 54.66
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: +97
కంపెనీ పేరు: Visaka Industries
2022 మార్చి త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 13.59
2022 డిసెంబర్ త్రైమాసికం చివరి నాటికి తాకట్టు ఉన్న ప్రమోటర్ వాటా: 15.21
గత ఒక ఏడాది కాలంలో స్టాక్ ఇచ్చిన రాబడి: -34
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.