అన్వేషించండి

Aadhar Card: ఉచిత అవకాశానికి ఆఖరి రెండు రోజులు, ఆలస్యం చేస్తే డబ్బులు కట్టాల్సిందే

అక్కడ ఒక్కో సవరణకు అనధికారికంగా రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు.

Aadhar Card Updation News: త్వరపడండి, ఈ ఉచిత అవకాశానికి ఇక మిగిలుంది రెండు రోజులు మాత్రమే. మీ ఆధార్‌ వివరాలు మార్చుకోవాలన్నా, తప్పులు సరి చేసుకోవాలనుకున్నా, అప్‌డేట్‌ చేయాలన్నా ఇప్పుడు ఉచితంగా ‍(Update Aadhar Details For Free) ఆ పని పూర్తి చేయొచ్చు. ఆలోచిస్తూ ఆలస్యం చేస్తే మాత్రం డబ్బులు కట్టి పని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. 

గత పదేళ్లుగా ఆధార్‌లో ఎలాంటి మార్పులు చేయని వ్యక్తుల కోసం ఉడాయ్‌ (UIDAI) ఈ అవకాశం ఇచ్చింది. ఆధార్‌ కార్డులను జారీ చేసే అధీకృత సంస్థ ఉడాయ్‌ (UIDAI), ఆధార్‌ వివరాలను ఉచితంగా మార్చుకునే చివరి తేదీలను ఇప్పటికే రెండు సార్లు పెంచింది. ఈ ఏడాది జూన్‌ 14తోనే ముగిసిన గడువును తొలుత సెప్టెంబరు 14వ తేదీ వరకు, రెండోసారి డిసెంబర్‌ 14, 2023 వరకు ‍‌(Last Date For Update Aadhaar Details For Free) పొడిగించింది. మీ ఆధార్‌ కార్డ్‌లోని వివరాలను ఫ్రీగా మార్చుకునే డెడ్‌లైన్‌ అతి దగ్గరలో ఉంది. ఈ లాస్ట్‌ డేట్‌ను ఉడాయ్‌ మళ్లీ పెంచుతుందో, లేదో ఇప్పటి వరకు స్పష్టత లేదు.

మీ ఆధార్‌ కార్డ్‌లో పుట్టిన తేదీని మార్చాలన్నా, పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ ఉన్నా, మీ జెండర్‌ తప్పుగా ఉన్నా, మీ ఇంటి అడ్రస్‌ మారినా... ఒక్క రూపాయి కూడా కట్టకుండా అప్‌డేట్‌ చేసుకోవడం ఈ నెల 14 వరకే సాధ్యం. ఈ తేదీ దాటిన తర్వాత అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటే కొంత రుసుము చెల్లించాలి. 

ఆఫ్‌లైన్‌/ఆధార్‌ కేంద్రం/CSC కి వెళ్లి ఆధార్‌ సమాచారం అప్‌డేట్‌ చేయాలనుకుంటే మాత్రం రూ.25 ఛార్జీ చెల్లించాలి. కానీ, అక్కడ ఒక్కో సవరణకు అనధికారికంగా రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. 

ఆధార్ కార్డ్‌ వివరాలను ఫ్రీగా ఎలా అప్‌డేట్ చేయాలి? (How Update Aadhar Details For Free?)

ఉడాయ్‌ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి మీ ఆధార్ కార్డ్‌లోని వివరాలను 'ఫ్రీ'గా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయొచ్చు. ఉడాయ్‌ వెబ్‌సైట్ ప్రకారం... ఆధార్ కార్డ్‌లో కచ్చితమైన సమాచారాన్ని ఉంచడం పౌరుడి బాధ్యత. ఆధార్ కార్డ్‌ డిటైల్స్‌ అప్‌డేషన్‌ చేయడానికి తగిన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. మీ ఆధార్‌ వివరాలను నవీకరించడానికి, ముందుగా మీ ఆధార్ నంబర్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ ఉన్న ఫోన్‌, స్కాన్‌ చేసిన ఐడీ ప్రూఫ్‌లు ను దగ్గర పెట్టుకోవాలి. ఈ పోర్టల్‌లో ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌ అయిన తర్వాత, రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా మీ వివరాలను అప్‌డేట్‌ చేయవచ్చు. 

ముందుగా myaadhaar.uidai.gov.in లింక్‌ ద్వారా ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
మీ ఆధార్‌ నంబర్‌తో లాగిన్ అవ్వండి
మీ పేరు/జెండర్‌/పుట్టిన తేదీ, చిరునామా ఆప్షన్స్‌ ఎంచుకోండి
'అప్‌డేట్ ఆధార్' ఆప్షన్‌ ఎంచుకోండి
ఇప్పుడు, ఇంటి చిరునామా లేదా ఇతర సమాచారాన్ని అప్‌డేట్‌ చేయడానికి అక్కడ కనిపించే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఆ తర్వాత, స్కాన్ చేసిన ప్రూఫ్‌ కాపీలను అప్‌లోడ్ చేసి, డెమోగ్రాఫిక్ డేటాను (Demographic data) అప్‌డేట్‌ చేయండి

ఇప్పుడు మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్ (URN) వస్తుంది. ఆ నంబర్‌ను సేవ్‌ చేసుకోండి. ఆధార్‌ అప్‌డేషన్‌ స్టేటస్‌ తనిఖీ చేయడానికి ఆ నంబర్‌ ఉపయోగపడుతుంది. ఈ నంబర్‌ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్‌ అడ్రస్‌కు కూడా వస్తుంది. అప్‌డేట్‌ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత https://ssup.uidai.gov.in/checkSSUPStatus/checkupdatestatus లింక్‌ ద్వారా పోర్టల్‌లోకి వెళ్లి, మీ ఆధార్ కార్డ్ అప్‌డేషన్‌ స్టేటస్‌ను ‍‌(Track Aadhar Updation Status) ట్రాక్ చేయవచ్చు.

డెమోగ్రాఫిక్ డేటాను ఎప్పుడు అప్‌డేట్‌ చేయాలి?
మీ పేరు, పుట్టిన తేదీ, ఇంటి అడ్రెస్‌లో తప్పులు దొర్లినా, మార్పులు చేయాలనుకున్నా ఆధార్ డిటెయిల్స్‌ అప్‌డేట్‌ చేయాలి. మహిళల విషయంలో... మన దేశంలో వివాహానంతరం మహిళ ఇంటి పేరు మారుతుంది. ఇలాంటి సందర్భంలో మార్పులు చేయాలి. అయితే... ఒక మహిళ ఉద్యోగం చేస్తున్నా/చేయాలని అనుకుంటున్నా... 10వ తరగతి మార్కుల లిస్ట్‌లో ఉన్న ఇంటి పేరు ప్రకారమే ఉద్యోగ నియామకం జరుగుతుంది. కాబట్టి, ఆధార్‌ కార్డ్‌లో ఆమె పుట్టింటి పేరునే కంటిన్యూ చేయాలి. ఒకవేళ ఇప్పటికే భర్త ఇంటి పేరును ఆధార్‌లో యాడ్‌ చేసుకుంటే, పదో తరగతి మార్క్స్‌ మెమోను ప్రూఫ్‌గా చూపి, మళ్లీ పుట్టింటి ఇంటి పేరుకు మారవచ్చు.

మరో ఆసక్తికర కథనం: ఐటీ సెక్టార్‌లో అత్యధిక జీతం ఈయనదే, మిగిలిన వాళ్లు దరిదాపుల్లో కూడా లేరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Thandel: సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
సేఫ్ జోన్‌లో 'తండేల్' నిర్మాతలు - 80 కోట్ల బడ్జెట్ మూవీ వాయిదా పడినా నష్టం లేదా?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Embed widget