News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Aadhar: ఆధార్‌లో మార్పులు చేయాలా?, ఫ్రీ ఫ్రీ ఫ్రీ - జూన్‌ 14 వరకు అవకాశం

ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి వివరాలను నవీకరించడానికి గతంలోలాగే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

Aadhar Card Updation: మీ ఆధార్‌లో ఉన్న సమయారంలో ఏమైనా మార్పులు లేదాఅప్‌డేట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఉచితంగా ఆ పని పూర్తి చేయవచ్చు. ఆధార్‌ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ఉచితంగా అందించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, ఉడాయ్‌ (UIDAI) నిర్ణయించింది. యూఐడీఏఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు.

14 జూన్ 2023 వరకు ఫ్రీ                         
డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా UIDAI ఈ నిర్ణయం తీసుకుంది. మైఆధార్‌ (MyAadhaar) పోర్టల్‌ను సందర్శించడం ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్ సౌకర్యాన్ని ఉచితంగా పొందవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ సదుపాయం మూడు నెలలు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అంటే, 15 మార్చి 2023 నుంచి 14 జూన్ 2023 వరకు ఫ్రీ అప్‌డేషన్‌ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల, MyAadhaar పోర్టల్‌లో, ఆన్‌లైన్‌ పద్ధతిలో వివరాలు అప్‌డేట్‌ చేయడానికి ఇప్పుడు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్‌లైన్‌ పద్ధతిలో, అంటే ఆధార్ కేంద్రాలకు స్వయంగా వెళ్లి వివరాలను నవీకరించడానికి గతంలోలాగే 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.              

ఉచిత అప్‌డేషన్‌ సదుపాయం అందరికీ అందుబాటులో ఉన్నా, 10 సంవత్సరాల క్రితం ఆధార్ తీసుకుని ఆ తర్వాత ఎప్పుడూ అప్‌డేట్ చేయని వాళ్లను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఫెలిలిటీని ఉడాయ్‌ తీసుకువచ్చింది. అలాంటి వ్యక్తులు
వివరాలను అప్‌డేట్ చేయడానికి గుర్తింపు రుజువు, చిరునామా రుజువును తిరిగి ధృవీకరించమని UIDAI కోరుతోంది.       

ఆధార్‌ కలిగిన ఏ వ్యక్తి అయినా.. తన పేరు, పుట్టిన తేదీ, చిరునామా సహా ఇతర విషయాలలో మార్పులు చేయాలనుకుంటే, సాధారణ ఆన్‌లైన్ నవీకరణ సేవను ఉపయోగించుకోవచ్చు లేదా సమీపంలోని ఆధార్ కేంద్రాలను సందర్శించడం ద్వారా మార్పులు చేయవచ్చు. దీనికి సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి.            

ఆధార్‌ వివరాలను ఎలా అప్‌డేట్‌ చేయాలి?              
పౌరులు https://myaadhaar.uidai.gov.in సైట్‌కు వెళ్లి తమ ఆధార్ నంబర్‌ ద్వారా లాగిన్ అవ్వాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని సంబంధింత గడిలో నింపి 'ఎంటర్‌' నొక్కాలి. ఇప్పుడు డాక్యుమెంట్ అప్‌డేట్ క్లిక్ చేయాలి. ఇప్పటికే ఉన్న వివరాలు అక్కడ కనిపిస్తాయి. వివరాలను ఆధార్ హోల్డర్ ధృవీకరించాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉంటే, హైపర్‌లింక్‌పై క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్‌లో, డ్రాప్‌డౌన్ జాబితా నుంచి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు ఎంచుకోవాలి, ఆయా పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అప్‌డేషన్‌ పూర్తయి, ఉడాయ్‌ ఆమోదించిన తర్వాత, గుర్తింపు రుజువు చిరునామా రుజువు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి.

ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్‌ అప్‌డేట్ రెగ్యులేషన్ 2016 ప్రకారం, ఆధార్ హోల్డర్‌లు గుర్తింపు రుజువు, చిరునామా రుజువును సమర్పించడం ద్వారా 10 సంవత్సరాల తర్వాత ఒకసారి ఆధార్‌ వివరాలను నవీకరించవచ్చు.

Published at : 25 Mar 2023 12:57 PM (IST) Tags: UIDAI AADHAR Card aadhar Updation Free of cost MyAadhaar portal

ఇవి కూడా చూడండి

Cryptocurrency Prices: జస్ట్‌ పెరిగిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Cryptocurrency Prices: జస్ట్‌ పెరిగిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Stock Market Today: కొనసాగిన అమ్మకాలు! 19,450 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్‌ 286 డౌన్‌

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Credit Card: సిబిల్‌ స్కోర్‌లో మీరు 'పూర్‌' అయినా క్రెడిట్‌ కార్డ్‌ కచ్చితంగా వస్తుంది, బ్యాంకులు పిలిచి మరీ ఇస్తాయి

Sweep Account: స్వీప్‌-ఇన్‌ గురించి తెలుసా?, సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ తీసుకోవచ్చు

Sweep Account: స్వీప్‌-ఇన్‌ గురించి తెలుసా?, సేవింగ్స్‌ అకౌంట్‌ మీద FD వడ్డీ తీసుకోవచ్చు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

YES Bank FD Rates: యెస్‌ బ్యాంక్‌ వడ్డీ ఆదాయాలు మారాయి, కొత్త FD రేట్లు ఈ రోజు నుంచే అమలు

టాప్ స్టోరీస్

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం