By: ABP Desam | Updated at : 04 Apr 2023 01:59 PM (IST)
Edited By: Arunmali
ఆధార్ కూడా ATM కార్డ్ లాంటిదే
Aadhaar Based Payment System: ఆధార్ కార్డ్ అంటే కేవలం ఒక గుర్తింపు పత్రం మాత్రమే కాదు, ATM కార్డ్‌లా కూడా పని చేస్తుంది. ఆధార్ కార్డ్ ద్వారా డబ్బును కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (AePS) ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు.
ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (Aadhaar Enabled Payment System) అంటే... నగదు చెల్లింపుల కోసం ఆధార్ వేలిముద్రల ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించుకునే ఒక రకమైన డిజిటల్ చెల్లింపు మార్గం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్లాట్‌ఫామ్‌పై ఇది ఆధారపడి ఉంటుంది.
ఆధార్ కార్డ్ ద్వారా డబ్బులు ఎలా విత్‌డ్రా చేయవచ్చు?
మైక్రో ATMలు/ కియోస్క్‌లు/ మొబైల్ పరికరాల్లో ఆధార్ ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా, ఏదైనా బ్యాంక్ అధీకృత బిజినెస్ కరస్పాండెంట్ (BC) ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు చేయవచ్చు. బిజినెస్ కరస్పాండెంట్ (బ్యాంక్ అధీకృత) అంటే బ్యాంకుకు ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలు. వీళ్ల దగ్గర మైక్రో ATM పరికరాలు ఉంటాయి. కస్టమర్ లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి బ్యాంకులే వాటిని ఏర్పాటు చేశాయి. మైక్రో ATM ద్వారా ఆధార్ కార్డు ఆధారిత చెల్లింపు సాధ్యం అవుతుంది. అంటే, డబ్బు తీసుకోవడమే కాదు, వేరొకరికి పంపడం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది.
ఈ ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?
ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ (AEBA) హోల్డర్లు మాత్రమే AePS సేవను ఉపయోగించుకోగలరు. అంటే, బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానమై ఉన్న వాళ్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం, చెల్లుబాటు అయ్యే ఆధార్ నంబర్‌ను ఖాతాదారు కలిగి ఉండాలి. ఖాతా కలిగి ఉన్న బ్యాంకుతో AEBAని సెటప్ చేయడం ద్వారా AePS సేవలను పొందవచ్చు.
AePS కింద ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి?
AePS అనేది ఆర్థిక సేవల వేదిక. బ్యాంక్ కస్టమర్, తన ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడం సహా మరికొన్ని రకాల సేవలను దీని ద్వారా పొందవచ్చు.
బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం
నగదు ఉపసంహరణ
నగదు జమ
ఆధార్ నుంచి ఆధార్‌కు నగదు బదిలీ
చెల్లింపు లావాదేవీలకు అనుమతి (C2B, C2G లావాదేవీలు)
AePS లావాదేవీ కోసం కస్టమర్‌కు ఏవి అవసరం?
ఆధార్ సంఖ్య
బ్యాంక్ పేరు
లావాదేవీ సమయంలో వేలిముద్రలు
లావాదేవీ రకం (వర్తిస్తే)
AePS లావాదేవీల కోసం ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలా?
AePS లావాదేవీల కోసం ఆధార్ కార్డును తీసుకెళ్లడం తప్పనిసరి కాదు. అయితే బ్యాంకు ఖాతాతో ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం మాత్రం తప్పనిసరి. అప్పుడే లావాదేవీ విజయవంతంగా సాగుతుంది.
ఇతర ప్రయోజనాలు
బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించడం, కార్డ్‌లను తీసుకెళ్లడం లేదా పిన్‌లు/పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండానే డోర్‌స్టెప్ బ్యాంకింగ్, సాధారణ బ్యాంకింగ్ లావాదేవీలు చేయడానికి ఇది కస్టమర్‌ను అనుమతిస్తుంది. ఈ ప్రయోజనాలతో పాటు.. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ ద్వారా వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి కూడా వీలవుతుంది.
సమస్య ఎదురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
AePS లావాదేవీ సందర్భంలో ఏదైనా సమస్య ఎదురైతే, తన ఖాతా ఉన్న బ్యాంకులో ఖాతాదారు ఫిర్యాదు చేయవచ్చు. NPCI ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ ద్వారా సంబంధిత బ్యాంక్ లావాదేవీపై ఫిర్యాదు చేయవచ్చు.
Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్ ఎఫెక్ట్ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్ సెంటిమెంట్ - బిట్‌కాయిన్ 5వేలు జంప్!
Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్ నెక్లెస్‌కు రిపేర్, దాని రేటు తెలిస్తే షాకవుతారు
Stock Market News: 18,600 కిందకు నిఫ్టీ - సెన్సెక్స్ 223 పాయింట్లు ఫాల్, పెరిగిన రూపాయి
Paytm Shares: పేటీఎం 'కరో.. కరో.. కరో జల్సా'! వారంలో 22% గెయిన్ - 10 నెలల గరిష్ఠానికి షేర్లు!
KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు
Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు
Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !
Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?