By: ABP Desam | Updated at : 21 Mar 2023 09:34 AM (IST)
Edited By: Arunmali
ATMల్లో ₹2000 నోట్లను ఎందుకు ఉంచడం లేదు?
2000 Rupees Currency Notes in ATMs: మీరు చివరిసారిగా ATM నుంచి డబ్బుని విత్‌డ్రా చేయడానికి ఎప్పుడు వెళ్లారో గుర్తుంచుకోండి. డబ్బు విత్‌డ్రా చేసిన తర్వాత మీకు 2000 రూపాయల నోట్లు వచ్చాయా?. పోనీ మార్కెట్‌లో మీరు క్రయవిక్రయాలు చేసినప్పుడు గానీ, ఇతర వ్యక్తుల నుంచి గానీ ఈ పెద్ద నోట్లు మీ చేతికి వచ్చాయా? ఈ ప్రశ్నను వేస్తే చాలా మంది సమాధానం చెప్పడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే, దేశ జనాభాలో పెద్ద వాటా ఉన్న సాధారణ ప్రజలు 2000 రూపాయల నోట్లు చూసి చాలా కాలమైంది. ఈ నోట్లు అరుదుగా మాత్రమే మార్కెట్‌లో కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
2000 రూపాయల నోటును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదు, అది ఇప్పటికీ చట్టబద్ధమైన ద్రవ్యంగా చలామణీలోనే ఉంది. అయినా, పింక్ కలర్ నోటు సాధారణ ప్రజల కళ్లకు కనిపించడం మానేసింది. ఇదే విషయం దేశ పార్లమెంటులో చర్చకు వచ్చింది. 2000 రూపాయల నోట్లను ఏటీఎంల ద్వారా ఇవ్వొద్దని ఆర్‌బీఐ నిర్దేశించిందా అన్న ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది.
ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదట
ఏటీఎంల ద్వారా రూ. 2000 నోట్ల పంపిణీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిషేధిస్తూ బ్యాంకులకు ఉత్తర్వులు జారీ చేసిందా అని లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆర్థిక శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ATMలు) రూ. 2000 నోట్లను నింపడం, నింపకపోవడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని బ్యాంకులకు ఎలాంటి ఆదేశం ఇవ్వలేదని తన సమాధానంలో ఆర్థిక మంత్రి వెల్లడించారు. గత వినియోగం, వినియోగదారుల అవసరాలు, సీజనల్ ట్రెండ్‌లను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంలలో ఉంచాల్సిన మొత్తం, డినామినేషన్‌ను బ్యాంకులే నిర్ణయిస్తాయని వివరించారు.
2000 రూపాయల డినామినేషన్ నోట్ల ముద్రణపై ఆర్‌బీఐ ఎప్పటి నుంచి నిషేధం విధించిందని ఆర్థిక మంత్రిని లోక్‌సభ సభ్యుడు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిస్తూ... ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం, 2019-20 నుంచి రూ. 2000 డినామినేషన్ నోట్ల సరఫరాకు డిమాండ్ లేదని చెప్పారు. అంతకుముందు డిసెంబర్ 2021లో కూడా ఇదే విషయంపై పార్లమెంటులో చర్చ వచ్చింది. 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణకు సంబంధించి ఎలాంటి తాజా ఉత్తర్వులు ఇవ్వలేదని, అందుకే రూ. 2,000 నోట్ల సంఖ్య తగ్గిందని అప్పట్లో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
ఐదేళ్లలో 3 రెట్లు పెరిగిన పెద్ద నోట్లు
కొన్ని రిపోర్టుల ప్రకారం... 9.21 లక్షల కోట్ల రూపాయల విలువైన రూ. 500, రూ. 2000 రూపాయల నోట్లు చెలామణిలో లేవు, ఈ కరెన్సీ నోట్లను నల్లధనంగా మార్చారా? అన్న మరో ప్రశ్నకు ఆర్థిక మంత్రి స్పందించారు. అటువంటి సమాచారం ప్రభుత్వం వద్ద అందుబాటులో లేదని చెప్పారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2017 చివరి నాటికి రూ. 9.512 లక్షల కోట్ల విలువైన రూ. 500, రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయని, 2022 మార్చి నాటికి అది రూ. 27.057 లక్షల కోట్లకు పెరిగిందని నిర్మలమ్మ చెప్పారు.
Banking Services Unavailable: హెచ్డీఎఫ్సీ, కొటక్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! జూన్లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్!
Byjus Loan Default: బైజూస్కు షాక్! రూ.329 కోట్ల వడ్డీ చెల్లించకుంటే లోన్ ఎగ్గొట్టినట్టే!
Stock Market News: మార్కెట్‌లో బుల్ రన్! 18,614 మీదే కొనసాగుతున్న నిఫ్టీ!
Gold-Silver Price Today 05 June 2023: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!
Hyderabad News: భారత్ భవన్కు కేసీఆర్ శంకుస్థాపన, ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఎక్స్లెన్స్, హెచ్ఆర్డీ కేంద్రం
ప్రకాశం జిల్లా నాయుడుపాలెంలో ఉద్రిక్తత- టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు
Minister Errabelli: ఉపాధి హామీ కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి - త్వరలోనే కూలీలకు పలుగు, పార పథకం
TSPSC Paper Leak Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మాజీ ఎంపీటీసీ కుమార్తె పేరు- షాకింగ్ విషయాలు చెబుతున్న డీఈ రమేష్