Auto Stocks to Buy: బడ్జెట్ తర్వాత స్పీడ్ ట్రాక్ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ ఇవి, వీటిలో ఒక్కటైనా మీ దగ్గర ఉందా?
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను టాప్ గేర్‌లో దూసుకెళ్లేలా చేస్తుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు విశ్వసిస్తున్నారు.
Auto Stocks to Buy: 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ. 13.7 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించడంతో, అది దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను టాప్ గేర్‌లో దూసుకెళ్లేలా చేస్తుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు విశ్వసిస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) బ్యాటరీల కోసం ఉపయోగించే లిథియం-అయాన్ సెల్స్‌ను తయారు చేయడానికి అవసరమైన ముడి వస్తువులు, యంత్రాల దిగుమతిపై కస్టమ్స్ సుంకం మినహాయింపును ఈ బడ్జెట్‌లో పొడిగించారు. ఎక్సైడ్, అమరరాజా వంటి బ్యాటరీ స్టాక్స్‌కు ఇది మరింత ప్రయోజనం చేకూరుస్తుంది.
బడ్జెట్ 2023 తర్వాత, స్పీడ్ ట్రాక్ ఎక్కిన 10 ఆటో స్టాక్స్ జాబితా ఇది:
ఈ స్టాక్, తన
ఈ స్టాక్, తన, తన
ఎక్సైడ్ ఇండస్ట్రీస్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ 178
బ్రోకరేజ్ సంస్థ ఏంజెల్ వన్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌పై సానుకూలంగా ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 194 నుంచి 8 శాతం దిగువన ట్రేడవుతోంది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ. 15,109 కోట్లు.
అమర రాజా బ్యాటరీస్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ 588
అమర రాజా బ్యాటరీస్‌ను కూడా ఏంజెల్ వన్ బుల్లిష్‌గా చూస్తోంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 670 నుంచి 12 శాతం డౌన్‌లో ట్రేడవుతోంది. అమర రాజా బ్యాటరీస్ మార్కెట్ క్యాప్ రూ. 10,050 కోట్లు.
అశోక్ లేలాండ్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ 149
అశోక్ లేలాండ్‌పై బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే (Emkay) సానుకూలంగా ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 169 కంటే 12% డిస్కౌంట్‌లో ట్రేడవుతోంది. అశోక్ లేలాండ్ మార్కెట్ క్యాప్ రూ. 43,880 కోట్లు.
టాటా మోటార్స్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ 435
టాటా మోటార్స్‌పైనా ఎమ్కే బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 511 నుంచి 15% దిగువన ట్రేడవుతోంది. టాటా మోటార్స్ మార్కెట్ క్యాప్ రూ. 1,44,560 కోట్లు.
ఐషర్ మోటార్స్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 3,277
ఐషర్ మోటార్స్ మీద ఎమ్కే పాజిటివ్ వ్యూతో ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.3,886 నుంచి 16% దిగువన ట్రేడవుతోంది. ఐషర్ మోటార్స్ మార్కెట్ క్యాప్ 89,619 కోట్లు.
మారుతి సుజుకీ
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 8,755
మారుతి సుజుకీపై బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సానుకూలంగా ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 9,769 నుంచి 10% తక్కువలో ట్రేడవుతోంది. మారుతి సుజుకీ మార్కెట్ క్యాప్ రూ. 2,64,471 కోట్లు.
సంవర్ధన మదర్సన్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ 80
సంవర్ధన మదర్‌సన్‌పైనా మోతీలాల్ ఓస్వాల్ బుల్లిష్ వ్యూ కంటిన్యూ చేస్తోంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 123 నుంచి 35% దిగువన ట్రేడవుతోంది. సంవర్ధన మదర్సన్ మార్కెట్ క్యాప్ రూ. 54,312 కోట్లు.
మహీంద్ర & మహీంద్ర (M&M)
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 1,369
మహీంద్ర & మహీంద్ర మీద బ్రోకరేజ్ సంస్థ విలియం ఓ'నీల్ సానుకూలంగా ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 1,392 నుంచి 2 శాతం దిగువన ట్రేడవుతోంది. మహీంద్ర & మహీంద్ర మార్కెట్ క్యాప్ రూ. 1,70,237 కోట్లు.
ఎస్కార్ట్ కుబోటా
ప్రస్తుత మార్కెట్ ధర: రూ. 2,007
రిలయన్స్ సెక్యూరిటీస్ ఎస్కార్ట్ కుబోటాపై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్, తన 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 2,359 నుంచి 15% దిగువన ట్రేడవుతోంది. ఎస్కార్ట్ కుబోటా మార్కెట్ క్యాప్ రూ. 26,480 కోట్లు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.