అన్వేషించండి

Kondaveeti Satyavathi: 'ఆడపిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసే వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన'

”అష్ఠ వర్షాత్‌ భవేత్‌ కన్యా” అంటే ఎనిమిదేళ్లు వచ్చిన బాలిక కన్య కిందే లెక్కకట్టి ఎనిమిదేళ్లు నిండకుండా పెళ్లి చేయాలి అనేది ఒకప్పటి నియమం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ రాసిన గురజాడ ఉద్దేశ్యం బాల్య వివాహాలు చెయ్యొద్దని చెప్పడమే. అయితే ఈ కథ చదివిన వాళ్లు, దృశ్యంగా చూసిన వాళ్లు కడవల కొద్దీ కన్నీళ్లు కారుస్తారు కానీ తమ కూతుళ్లకు బాల్య వివాహమే చేస్తారు. ఆమె చిన్న వయసులో భర్తను కోల్పోయినప్పుడు అదే కుటుంబం ఆమె పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తుంది. ఆమెను అనాకారిని చేస్తుంది. ఆమె చుట్టూ ”అరిష్టాలను” అల్లి మూలన కూర్చోబెడుతుంది. ఇంటిల్లిపాదికీ జీతం భత్యం లేని ఒక బానిసగా మార్చేస్తుంది. ఇది హిందూ సంప్రదాయంలోని అమానుషం.

గురజాడ తొలి అడుగు...

విధవా వివాహాలు చెయ్యాలంటూ వీరేశలింగం తెచ్చిన సంస్కరణోద్యమం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని బాల్య వివాహ బాధితుల మీద చిన్న వెలుతురు ఫోకస్‌ చేసింది. బాల్య వివాహాల నిరోధానికి గురజాడ పూర్ణమ్మ తొలి అడుగేస్తే, బాల్య వివాహాల ద్వారా భర్తల్ని కోల్పోయిన వారి గుండె ఘోష వీరేశలింగం ఉద్యమం ప్రతిఫలించింది. ఈ రెండు అంశాల మీద చర్చ మొదలై 150 సంవత్సరాలు గడిచిపోయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉండడం మహా విషాదకరమే కాదు ఈ అంశం పట్ల ఆధునిక సమాజం కూడా నిర్లిప్తంగా, నిర్లజ్జగా వ్యవహరించడం క్షమించరాని నేరం.

పేదరికమే మొదటి కారణం

బాల్య వివాహాల నిరోధానికి చట్టాలొచ్చాయి. వివాహ వయస్సును పెంచుతూ చట్టాలైతే వచ్చాయి, కానీ బాల్య వివాహాల చుట్టూ అల్లుకుని ఉన్న అంశాలను పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికీ చాలా ప్రబలంగా బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరగడానికి సమాజం, కుటుంబం చూపించే కారణాలను విశ్లేషిస్తే గానీ అసలు కారణాలు అర్థం కావు, వెలుగులోకి రావు. మొదటి కారణం ఈ దేశం నిండా కారుమేఘంలా కమ్ముకుని ఉన్న పేదరికం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పుకుంటున్నా కోట్లాది గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు ఈ స్వాతంత్య్రం ఏమైనా ఒరగబెట్టిందా అన్నది సందేహాస్పదమే.

వాస్తవాలు పట్టించుకోకుండా వాదన అర్థరహితం

పేదరికం, నిరక్షరాస్యత, వైద్య సదుపాయాల లేమి, సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం అన్నింటినీ మించి, విద్యా హక్కు చట్టం అమలులో ఉన్నప్పటికీ అందరికీ చదువుకునే అవకాశాల్లేకపోవడం లాంటి ముఖ్యమైన అంశాలు పరిష్కారం లేకుండా చాలావరకు అలాగే ఉండిపోయాయి. దేశం చాలా అభివృద్ధి చెందింది, పరిస్థితులు సమూలంగా మారిపోయాయి. మీలాంటి వాళ్లు ఇలాగే రాస్తారు అంటూ వాదనలకు దిగేవాళ్లు తాము ధరించిన నగరాలు, పట్టణాలు మాత్రమే కనిపించే కళ్లద్దాలను పక్కనపెట్టి ఒక్కసారి ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాలను, అక్కడ బతుకుతున్న కోట్లాది మంది జీవన దృశ్యాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా నిబద్ధత, దమ్ము కావాలి. వాస్తవాలను పట్టించుకోకుండా వాదన కోసం వాదన చేయడం అర్థరహితం. ఆ వాదనలు ఎలా ఉంటాయంటే మీరు మరీ చెపుతారు ఇప్పుడెవరూ ఆడపిల్ల, మగపిల్లాడు అనే తేడాలే చూపించడం లేదు, అందరినీ చదివిస్తున్నారు, ఇద్దరినీ సమానంగానే చూస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లయినా, మగపిల్లాడైనా ఒకటే అంటూ అడ్డగోలుగా వాదించేవారు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి.

అసలు హంతకులెవ్వరు? 

ఎందుకని ఇంకా అల్ట్రాసౌండ్‌ సెంటర్లకు వెళ్లి స్కానింగ్‌ చేయించుకుని ఆడపిండాల హత్యలు చేస్తున్నారు. దేశంలో కోట్లాదిమంది ఆడపిల్లల్ని చంపేసి మగపిల్లల్ని మాత్రమే కంటున్నారు. ఎందుకని 1000 మంది అబ్బాయిలకు 912 మంది మాత్రమే బాలికలున్నారు. మిగిలిన వాళ్లని చంపేసిన హంతకులెవ్వరు? అక్షరాస్యత లేని, పల్లెటూరి వాళ్లు, నగర బస్తీలలో ఉండే పేదలే ఈ ఆడపిండాల హత్య చేస్తున్నారనే నగర, చదువుకున్న వాళ్ల వాదన తప్పని చాలాసార్లు రుజువయ్యింది. నగరాల్లో సమస్త సౌకర్యాల్లో మునిగి తేలుతూ, బాగా చదువుకున్న వాళ్లు, ఆస్తులున్న వాళ్లు కూడా బాలికల్ని ఆడపిండాల రూపంలో హత్య చేసినవారే.

పితృస్వామిక భావజాలం  

ఇలా బాలికల మీద వివక్ష, అసమానత్వం తల్లి గర్భంలోనే మొదలై పుట్టుకే ప్రశ్నార్థకమై, పుట్టాక తీవ్ర ఆంక్షలు, సంప్రదాయాలు, ఇంటా బయటా విపరీతమైన హింసల్ని ఎదుర్కోవడం మనం చూస్తూనే ఉన్నాం. చట్టాలతో పైపూతల్ని పూస్తూనే ఉన్నాం. మహిళలు, బాలికల మీద అమలయ్యే వివక్షకు కారణాలేమిటనే ప్రాథమికమైన ప్రశ్నని పక్కన పెట్టడం వల్లనే ఆధునిక సమాజం కూడా వివక్షతలకు ఆమోద ముద్ర వేసి అసమానత్వం కొనసాగిస్తోంది. కుటుంబాల్లో అసమానతలను పెంచి పోషించే పితృస్వామిక భావజాలాన్ని చెక్కు చెదరనీయకుండా, కుటుంబాల్లో సంబంధాలు ప్రజాస్వామికీకరణ చెందకుండా కొనసాగించినంత కాలం మహిళలు, బాలికల హోదాలో ఎలాంటి మౌలిక మార్పులూ రావు. కుటుంబ పెద్ద మగవాడని, అతడెలాంటి వాడైనా కుటుంబంలో అధికారం అతనిదేనని, అతను చెప్పిందే నియమమని, కుటుంబంలో సమస్త నిర్ణయాలు అతడే చేస్తాడని, అతను ఆ కుటుంబ పాలకుడని, అందరూ అతని పాలనకు లోబడే ఉండాలనే పురుషాధిక్య భావజాలాన్ని చెక్కుచెదరకుండా కొనసాగిస్తున్నంత కాలం మహిళలు, పిల్లలు ముఖ్యంగా బాలికల పరిస్థితుల్లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు రావు.

చట్టమంటే ఎవరికీ భయం లేదు..!

ఈ భావజాలాన్ని యధాతథంగా కొనసాగిస్తూ ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా ఫలితం శూన్యం. మగవాడు తన భార్యను కొట్టే హక్కును కలిగి ఉన్నాడని నమ్మే సమాజంలో గృహ హింస నేరం, కొట్టడం చట్టరీత్యా నేరమని చెప్పడంలో ఉన్న రెండు నాల్కల ధోరణి వల్ల గృహ హింస నిరోధక చట్టమొచ్చి దశాబ్ద కాలం దాటినా కుటుంబాల్లో హింస విపరీతంగా పెరుగుతూనే ఉంది. చట్టం దారి చట్టానిదే. మగవాడి హింసాత్మక ప్రవృత్తికి కారణమైన పితృస్వామ్య భావజాలం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. తాగుడు వల్ల కుటుంబాల్లో ఎంత హింస జరుగుతుందో తెలిసి కూడా ప్రభుత్వం మద్యం దుకాణాలు నడుపుతుంది. బార్లు, పబ్బులు నడిపి పీకల్దాకా తాగిస్తుంది. తాగించి వాడి చేత భార్యా పిల్లల్ని హింసింపచేస్తుంది. మరి అదే ప్రభుత్వం భార్యని, పిల్లల్ని కొట్టడం, తిట్టడం నేరం అని చట్టం తెస్తుంది. అంతా హిపోక్రసీ. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకురావాలని ఉబలాటపడుతున్న ”బాలికల వివాహ వయో పరిమితిని పెంచాలను”కుంటున్న చట్టాన్ని పై నేపథ్యం లోంచి చూడాల్సి ఉంటుంది. వివాహ వయస్సును పెంచినప్పటికీ ఎవ్వరికీ చట్ట భయం లేదు. బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మైనర్‌ బాలికలు అతి చిన్న వయస్సులో కుటుంబ భారాన్ని మోస్తూ బాల తల్లులవుతూనే ఉన్నారు. కనలేక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. బాల్య వివాహాలెందుకు జరుగుతున్నాయి? చట్టం ఉన్నప్పటికీ భయం లేకుండా తల్లిదండ్రులు ఎందుకు బాల్య వివాహాలు చేసి ”తమ గుండెల మీద కుంపట్లను” దించేసుకోవాలనుకుంటున్నారు? బాలికల్ని పెనం మీంచి పొయ్యిలోకి ఎందుకు తోసేస్తున్నారు? దానికి వారు చెప్పే ప్రథమ కారణం ఆడపిల్లలకు రక్షణ లేదు. చదువుకోవడానికి బయటికెళ్తే ఏమి జరుగుతుందో, ఎలాంటి లైంగిక హింసకు గురవుతారో అనే భయం వారిని పట్టి పీడించడం. కులం తప్పి వేరే కులం వాళ్ళను ప్రేమించి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుందేమో. మేము పేదవాళ్ళం, ఆడపిల్లల్ని చదివించలేం, పెళ్ళి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది, అత్తింట బతికినా, చచ్చినా మా బాధ్యత ఉండదు. పెద్ద పెద్ద చదువులు చదివించి ఉద్యోగాలు చేయించే ఆర్థిక స్థోమత మాకు లేదు.

జబ్బు ఒక చోట మందు మరో చోట

తల్లిదండ్రులు ఇలాంటివే కారణాలు చెబుతారు. ఇందులో కొన్ని నిజమే. వారు చెబుతున్న కారణాలన్నీ ప్రభుత్వాలు పట్టించుకోవాల్సినవే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల మీద ఎలాంటి క్రూరమైన, ఘోరమైన లైంగిక నేరాలు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రుల భయాలకు అర్థముంది. మరి మహిళలకు, బాలికలకు సురక్షితమైన పరిస్థితులను ఎవరు కల్పించాలి. ఇళ్ళల్లో ఉండండి, చీకటి పడ్డాక బయటకు రాకండి అని చెప్పే పనికిమాలిన సలహాలు హింసను మరింత ప్రేరేపిస్తాయనే ఇంగితం లేని మనువాద ప్రభుత్వాలు. బాల్య వివాహాలు జరగడానికి ముఖ్య కారణమైన అసురక్ష సామాజిక వాతావరణాన్ని యధాతథంగా ఉంచి బాలిక వివాహ వయోపరిమితిని 21 సంవత్సరాలకు పెంచడం అంటే జబ్బు ఒక చోట ఉంటే మందు ఇంకో చోట వేసిన చందాన ఉంటుంది.

అదో పెద్ద భ్రమ

పెళ్ళి వయసు పెంచేస్తే బాల్య వివాహాలు ఆగిపోతాయనేది పెద్ద భ్రమ మాత్రమే. చదువు లేక, చదువుకునే అవకాశాలు లేక, అమ్మ పనికెళ్తే చెల్లినో, తమ్ముడినో చూసుకునే బాధ్యత, తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఎదురయ్యే సవాళ్ళు, చిన్న వయస్సులోనే రజస్వల అవ్వడం వల్ల చురుకుగా ఉండే సెక్సువల్‌ హార్మోన్స్‌… 21 సంవత్సరాలు వచ్చేవరకు తల్లిదండ్రులతోనే ఉండాల్సి రావడంతో ఎదురయ్యే ఒత్తిళ్ళను అమ్మాయిలు ఎలా అధిగమించగలుగుతారు. చదువు లేక, ఉద్యోగమో, ఉపాధో లేక 21 సంవత్సరాలు వచ్చేవరకు ఆడపిల్ల తల్లిదండ్రులు అదుపాజ్ఞల్లో ఉండాల్సి రావడం ఎంతవరకు సబబు? ఇది ఖచ్చితంగా విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితులు పెరుగుతాయి. వివాహ వయస్సును పెంచడంతో వివాహాలు ఆగవు. తల్లిదండ్రులు ఆగరు. వాళ్ళమీద క్రిమినల్‌ కేసులు ఫైలవుతాయి. పరిష్కారం ఏంటంటే ప్రజల వ్యక్తిగత నిర్ణయమైన పెళ్ళిలో దీనికి పరిష్కారాలు వెతకడం మాని ఆడపిల్లల చదువు మీద దృష్టి పెట్టాలి. కల్యాణలక్ష్మిలు, షాదీముబారక్‌ లాంటి స్కీములనాపేసి బాలికల చదువు మీద, వారి ఎదుగుదల మీద నిధుల్ని ఖర్చు పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేయాలి. స్కూళ్ళలో టాయిలెట్లు, నీటి సరఫరా, ప్రహరీ గోడల నిర్మాణం మీద పెట్టుబడి పెట్టాలి. ఆడపిల్లల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం, సైకిళ్ళు పంచడం చేయాలి. చేతిలో సైకిల్‌ ఉన్న బాలిక ఆత్మస్థైర్యం ఖచ్చితంగా పెరుగుతుంది. ఆయా గ్రామాల నుంచి సైకిళ్ళ మీద బృందాలుగా ప్రయాణాలు చేస్తూ ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్ళే వెసులుబాటు ఉంటే వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ గ్రామానికా గ్రామం సర్పంచ్‌ ఆధ్వర్యంలో రక్షణ బృందాలను ఏర్పాటు చేసి, బాలికలకు అండగా నిలబడితే వారు హాయిగా, సురక్షితంగా పాఠశాలకో, కాలేజీకో వెళ్ళి వస్తారు. అంతేకానీ స్కూళ్ళకు పంపిస్తే ‘లేచిపోతారు’ అనే మొరటు ఆలోచనలను చెయ్యకూడదు.

పితృస్వామ్య, ఆధిపత్య ఆలోచనలకు కళ్ళెం వేస్తేనే...

చదువుకునే చోట కనీస సౌకర్యాలైన టాయ్‌లెట్ల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం, బహిష్టు సమయంలో బాలికలకు అవసరమైన శానిటరీ నాప్‌కిన్స్‌ అందించడం, వారికోసం ముఖ్యంగా శానిటరీ నాప్‌కిన్‌ మార్చుకోవడానికి ప్రత్యేక గది ఏర్పాటు చేయడం తప్పనిసరి కావాలి. లేకపోతే బహిష్టు సమయంలో పాఠశాలకు రాలేకపోవడం, తద్వారా చదువులో వెనకబడడం, హాజరు శాతం తగ్గిపోవడం వెరసి బాలిక చదువుకు ఆటంకాలు ఏర్పడకుండా చూడాలి. మగపిల్లల ప్రవర్తన మీద, వారి ఆలోచనా ధోరణుల మీద ఖచ్చితంగా, లోతుగా పనిచేయాలి. జెండర్‌ స్పృహను పాఠాల ద్వారా అందిస్తేనే మార్పు సాధ్యపడుతుంది. తమ దుందుడుకు చర్యలు, తమ ఆధిపత్య ధోరణులు బాలికల విద్యావకాశాలను ఎలా నాశనం చేస్తాయో వాళ్ళకు అర్థమయ్యేలా బోధించాలి. కుటుంబం కానీ, సమాజం కానీ మగపిల్లల విపరీత ప్రవర్తనలను సరిచెయ్యకపోతే బాలికల మీద లైంగిక హింస, లైంగిక నేరాలు పెరిగిపోయే ప్రమాదం మరింత ఎక్కువవుతుంది. ఈ పరిస్థితి బాలిక విద్యావకాశాలను, వారి కదలికలను దారుణంగా దెబ్బతీస్తుంది. తల్లిదండ్రులు తమ కొడుకుల్ని గాలికొదిలేసి, తమ కూతుళ్ళను ఇళ్ళల్లో మగ్గబెట్టడమో, బాల్యవివాహాలు చేసి, గృహహింస బాధితులుగా మార్చడమో చేయడం వల్లనే పరిస్థితులు బాలికలకు శాపంగా మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేయతలపెట్టిన బాలికల వివాహ వయస్సు పెంపుదల చట్టం నిజానికి బాలికలకు చాలా నష్టం చేయబోతోంది, ప్రమాదకారి కాబోతోంది. చదువు లేక, ఉపాధి లేక ఊరికే 21 సంవత్సరాలు వచ్చేవరకు తల్లిదండ్రుల ఇంట కట్టుకొయ్యకు బాలికలను కట్టేసే చట్టమిది. తల్లిదండ్రులు, వారి స్వంత బిడ్డలకు ప్రమాదంగా పరిణమించే అంశమిది. బాలికల వివాహ వయస్సును పెంచాలనే ఆలోచనలను విరమించుకుని, బాలికల విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు, రవాణా సదుపాయాలు పెంపొందించాలని పౌర సమాజం కోరుతోంది. పితృస్వామ్య, ఆధిపత్య ఆలోచనలకు కళ్ళెం వేసి, తమ జీవితాలను తామే నిర్వహించుకునే జీవన నైపుణ్యాలను బాలికలకు అందించిననాడు భారతదేశ భవిష్యత్తు చిత్రపటంతో బాలికలు ధృవతారలుగా, దారిదీపాలుగా వెలుగొందుతారు.

Kondaveeti Satyavathi: 'ఆడపిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసే వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన

- కొండవీటి సత్యవతి, రచయిత్రి, సామాజిక కార్యకర్త
(ఈ వ్యాసంలోని అంశాలు, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం) 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
KTR vs Revanth: నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
నువ్వు మగాడివైతే అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించు - రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్
Rains: అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
అల్పపీడనం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో ఇదీ పరిస్థితి
Tirumala News: తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి - టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారంటే?, టీటీడీ కీలక నిర్ణయాలివే!
Telangana Assembly: విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్య 3 కీలక బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Embed widget