అన్వేషించండి

Xiaomi YU7 Electric Car: 3 నిమిషాల్లో 2 లక్షల బుకింగ్స్‌తో రికార్డ్.. ఈ ఎలక్ట్రిక్ కారు స్పెషాలిటీ, ఫీచర్లు ఏంటి..

Xiaomi YU7 Bookings Record: షియోమీ కంపెనీ కార్ల విక్రయాల్లో రికార్డులు తిరగరాస్తోంది. వేరే కంపెనీ కార్లు కూడా కొనుక్కోండని CEO కస్టమర్లను కోరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు పలు గాడ్జెట్‌లను తయారు చేసే Xiaomi కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ లోనూ దూసుకెళ్తోంది. షియోమీ కంపెనీ ఎలక్ట్రిక్ SUV Xiaomi YU7 కార్లను 3 నిమిషాల్లో 2 లక్షల మంది బుక్ చేసుకున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఒక గంటల 2 లక్షల 89 వేల యూనిట్ల SUV Xiaomi YU7 బుకింగ్స్ తో దుమ్మురేపింది. Xiaomi మొదటి నెలలో 6 వేల మందికి పైగా కస్టమర్‌లకు ఈ ఎలక్ట్రిక్ SUVని డెలివరీ చేసింది. 

బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. Xiaomi ఫౌండర్ లేయ్ జున్ మాట్లాడుతూ.. ఇక నుంచి YU7ని కొనుగోలు చేసేవారు ఇతర బ్రాండ్ కార్లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేయవచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక కార్ల తయారీ సంస్థ CEO అయినా తన కస్టమర్‌లను ఇతర కార్లను కొనుగోలు చేయాలని చెప్పడం ఇదే మొదటిసారి. 

Xiaomi ఎలక్ట్రిక్ కారులో ప్రత్యేకత ఏంటి? 

Xiaomi YU7 డిజైన్ దాని SU7 సెడాన్ ద్వారా ప్రేరణ పొంది అలా డిజైన్ చేసింది. ఇందులో పోర్షే మకాన్, ఫెరారీ పురోసాంగ్ వంటి హై-ఎండ్ కార్ల రూపురేఖలు కనిపిస్తాయి. SUV రెండు వేరియంట్‌లలో (రియర్-వీల్ డ్రైవ్ (RWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD)) ప్రారంభించింది. ఈ SUVలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 288 kW ఎనర్జీతో పాటు 528Nm టార్క్‌ను జనరేట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వీటి కారణంగా Xiaomi YU7  పనితీరు పరంగా బెస్ట్ అంటున్నారు. 

Xiaomi YU7ని కంపెనీ 3 వేర్వేరు బ్యాటరీ వేరియంట్‌లతో వచ్చింది. ఇది కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా దాని పనితీరును, పరిధిని మెరుగు చేసుకుంటోంది. ఇందులో మొదటి వేరియంట్ 96.3kWh బ్యాటరీతో రాగా, ఇది రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాన్ఫిగరేషన్‌లో 835 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఎలక్ట్రిక్ కారు రేంజ్, ధర వివరాలు

Xiaomi YU7 రెండవ వేరియంట్ 96.3kWh బ్యాటరీతో వస్తుంది. కానీ ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD ప్రో) సిస్టమ్‌ కలిగి ఉంటుంది. ఇది 760 కిలోమీటర్ల రేంజ్‌తో కారు కొనుగోలు చేయాలన్న వారిని ఆకట్టుకుంటోంది. మూడవ, అత్యంత శక్తివంతమైన వేరియంట్‌లో 101.7kWh బ్యాటరీ అమర్చారు. ఇది AWD మాక్స్ కాన్ఫిగరేషన్‌లో 770 కిలోమీటర్ల వరకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ తెలిపిన ఈ వివరాలు YU7ని ఫేమస్ కార్లు టెస్లా మోడల్ Y, ఇతర హై-ఎండ్ ఎలక్ట్రిక్ వాహనాలకు దీటుగా నెట్టాయి.

ధర విషయానికి వస్తే Xiaomi YU7 ప్రారంభ ధర 2,53,500 యువాన్లు, భారత కరెన్సీలో దాదాపు 30 లక్షల రూపాయలు. ఇది టెస్లా మోడల్ Y కంటే 1.19 లక్షలు తక్కువ ధరకే లభిస్తుంది. ఈ కారణాలతో Xiaomi YU7 ఎలక్ట్రిక్ కారు అటు సాంకేతికంగా మాత్రమే కాకుండా, మీ డబ్బును సైతం ఆదా చేస్తుంది. మిడ్-ప్రీమియం EV SUV విభాగంలోని కస్టమర్‌లకు ఈ బ్రాండ్ బెస్ట్ చాయిస్‌గా మారుతుంది. ట్రంప్ టారిఫ్‌లతో నెలకొన్న పరిస్థితులతో అమెరికాలో తయారైన కార్లను కొనుగోలు చేయకూడదని భావిస్తున్న వారు ఇతర దేశాల కార్ల వైపు చూస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget