అన్వేషించండి

Tata Altroz Facelift: టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ని ఎందుకు కొనాలి, కొత్తగా ఏం మారింది?

Tata Altroz Facelift 2025: టాటా మోటార్స్ ఫేస్‌లిఫ్ట్ 2025ను ఇటీవలే విడుదల చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్‌కు కంపెనీ చాలా కొత్త & అద్భుతమైన ఫీచర్లను యాడ్‌ చేసింది.

2025 Tata Altroz Facelift Price, Mileage And Features: టాటా మోటార్స్, తన ఫ్యాన్‌బేస్‌ కోసం, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో ప్రధాన మార్పులు జరిగాయి, ఈ కార్‌ మునుపటి కంటే స్మార్ట్‌గా, సేఫ్‌గా & ఫీచర్-రిచ్‌గా మారింది. అప్‌డేటెడ్‌ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర (2025 Tata Altroz Facelift ex-showroom price) రూ. 6.89 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది, టాప్‌-ఎండ్‌ వెర్షన్‌ రేటు రూ. 11.40 లక్షల వరకు ఉంటుంది. సరికొత్త అవతార్‌లో రోడ్డు ఎక్కిన ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కొనేముందు, ఈ కారును ప్రత్యేకంగా నిలుపుతున్న 5 విషయాలు తెలుసుకోండి.

కొత్త డిజైన్ & ఎక్స్‌టీరియర్‌ అప్‌డేట్స్‌
కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త LED హెడ్‌లైట్లు, రిఫ్రెష్‌డ్‌ ఫ్రంట్ గ్రిల్ & ఏరోడైనమిక్ డిజైన్‌ బంపర్‌ను బిగించారు. ఇంకా... కొత్త 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, లైట్లు వెలిగే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ & కనెక్టెడ్‌ LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. టాటా మోటార్స్‌ ఈ ఫేస్‌లిఫ్ట్‌ను కొన్ని కొత్త రంగుల్లోనూ పరిచయం చేసింది. ఇవన్నీ కలిసి కొత్త ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ను మునుపటి కంటే స్టైలిష్‌గా మార్చాయి.

ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్‌ & కొత్త 'ఫిజిటల్' డాష్‌బోర్డ్
ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ లోపలి భాగం కూడా మరింత ప్రీమియంగా మారింది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ అందించారు. డిజిటల్ & ఫిజికల్‌ కంట్రోల్స్‌ కాంబోతో 'ఫిజిటల్' (Phygital) డాష్‌బోర్డ్‌ ఏర్పాటు చేశారు. కొత్త ఆల్ట్రోజ్‌కు కొత్త లేత రంగు అప్‌హోల్‌స్టెరీ అపాదించారు, ఇది క్యాబిన్‌లో మరింత ఓపెన్‌ & కంఫర్టబుల్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది.

భద్రత & సాంకేతికత 
కొత్త టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ డ్రైవింగ్ అనుభవాన్ని స్మార్ట్‌గా మార్చిన కంపెనీ, భద్రతపరంగా గతం కంటే మెరుగైన ఆధునిక & ప్రీమియం ఫీచర్లను చేర్చింది. బ్లైండ్ వ్యూ మానిటర్‌తో 360-డిగ్రీ కెమెరాను ఏర్పాటు చేసింది. దీనివల్ల, కారును ఇరుకైన ప్రదేశాలలో పార్క్ చేయడం & సురక్షితంగా మలుపులు తీసుకోవడం ఇంకా సులభంగా మారింది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు కారులో ఉన్నాయి. ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) భద్రత వల్ల, క్లిష్ట పరిస్థితుల్లో కూడా కారు స్కిడ్‌ కాకుండా స్థిరంగా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ & మ్యూజిక్‌ అనుభవం కోసం కారులో 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ కూడా ఉంది. క్యాబిన్‌లో మరింత ప్రీమియం ఫీల్‌ తేవడానికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఇచ్చారు.

ఇంజిన్ ఆప్షన్లు & ట్రాన్స్‌మిషన్‌
టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ అన్ని రకాల కస్టమర్ల అవసరాలకు తగిన ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది, ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలు - AMT & DCA - ఆప్షన్స్‌తో వస్తుంది. తద్వారా, కస్టమర్‌లు తమ అవసరానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఆల్ట్రోజ్ CNG వెర్షన్‌ కూడా ఉంది, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 

ట్రిమ్‌ లెవల్స్‌
టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్‌ నాలుగు ట్రిమ్‌ లెవల్స్‌లో లాంచ్‌ అయింది - Smart, Pure, Creative & Accomplished. ఈ ట్రిమ్‌లలో ఫీచర్లు & సౌకర్యాల స్థాయి పెరుగుతుంది. అంటే.. కస్టమర్‌ తన బడ్జెట్ & అవసరాలకు అనుగుణంగా సరైన ట్రిమ్‌ ఎంచుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

స్కార్పియో ఎన్‌ కంటే రఫ్‌ అండ్‌ టఫ్‌ లుక్స్‌.. మహీంద్రా కొత్త లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌ వచ్చేసింది!
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్‌ పికప్‌ ట్రక్‌.. టయోటా, ఇసుజుకి స్ట్రాంగ్‌ కాంపిటీషన్‌!
Clean Cloudy Car Headlights: వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
వర్షంలో హెడ్‌లైట్లు మసకగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలు మీకు హెల్ప్ అవుతాయి!
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget