అన్వేషించండి

Tata Harrier EV Loan: రూ.5 లక్షల డౌన్ పేమెంట్‌ చాలు, టాటా హారియర్ EV కొనొచ్చు - EMI ఎంత అవుతుంది?

Tata Harrier EV Finance Plan: టాటా హారియర్ EV అడ్వెంచర్, ఫియర్‌లెస్ & ఎంపవర్డ్ అనే మూడు వేర్వేరు వేరియంట్లలో వచ్చింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షలు.

Tata Harrier EV Down Payment, Loan and EMI Details In Telugu: టాటా మోటార్స్, గత నెలలో, భారతదేశంలోకి ఒక గేమ్‌ ఛేంజర్‌ లాంటి ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చింది, అదే "టాటా హారియర్ EV". ఈ EV ఫీచర్లు వింటే వెంటనే కారు కొనేయాలనిపిస్తుంది. ఇంకా, దీని డ్రైవింగ్‌ రేంజ్‌ కూడా వేరే లెవెల్‌లో ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్‌ క్రెటా EV & మహీంద్రా XEV 9e వంటి కార్లకు పోటీగా హారియర్ EVని టాటా మోటార్స్‌ రంగంలోకి దించింది. ఈ కారు కొన్నాక ఇక పెట్రోల్ బంక్‌ మొహం కూడా చూడాల్సిన అవసరం రాదు. ఎంచక్కా మీ ఇంట్లోనే దీనిని ఛార్జ్‌ చేసుకుని దర్జాగా తిరగొచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో ధర
టాటా కంపెనీ, హారియర్ EVని మూడు వేరియంట్లలో లాంచ్‌ చేసింది, అవి - అడ్వెంచర్, ఫియర్‌లెస్ & ఎంపవర్డ్. ఈ బండి ఎక్స్-షోరూమ్ ధర (Tata Harrier EV ex-showroom price) రూ. 21.49 లక్షలు. మీరు దీని బేస్ మోడల్‌ను హైదరాబాద్‌ లేదా విజయవాడ లేదా మరేదైనా తెలుగు నగరంలో కొనుగోలు చేస్తే.. ఆన్-రోడ్ ధర (Tata Harrier EV on-road price) రూ. 22.58 లక్షలు చెల్లించాలి. ఇందులో.. ఎక్స్‌-షోరూమ్‌ ధర, రిజిస్ట్రేషన్‌ ఖర్చులు, కారు బీమా, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి.

టాటా హారియర్ EV డౌన్ పేమెంట్
ఈ కారు కొనడానికి మీరు రూ. 5 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 17.58 లక్షలను బ్యాంకు నుండి కార్‌ లోన్‌గా తీసుకోవచ్చు. బ్యాంక్‌ మీకు 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్‌ మంజూరు చేసిందని అనుకుందాం. ఇప్పుటు నెలవారీ EMI లెక్క చూద్దాం.

*  7 సంవత్సరాల్లో తిరిగి తీర్చేలా ఈ రుణం తీసుకుంటే, మీరు నెలకు రూ. 28,285 EMI చొప్పున 84 వాయిదాలు చెల్లించాలి.

* 6 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకుంటే, నెలకు రూ. 31,689 EMI చొప్పున 72 వాయిదాలు చెల్లించాలి.

* 5 సంవత్సరాల లోన్‌ టెన్యూర్‌ కోసం మీరు నెలకు రూ. 36,493 EMI చొప్పున 60 వాయిదాలు చెల్లించాలి.

* 4 సంవత్సరాల్లో ఈ రుణం మొత్తం తీర్చేయాలనుకుంటే, నెలకు రూ. 43,748 EMI చొప్పున 48 వాయిదాలు చెల్లించాలి.

మీ జీతం రూ.80,000 నుంచి రూ.1,00,000 ఉంటే, మీరు 6 లేదా 7 సంవత్సరాల టెన్యూర్‌తో లోన్‌ తీసుకోవచ్చు.

బ్యాంక్‌ మీకు ఇచ్చే రుణం, వసూలు చేసే వడ్డీ రేటు మీ క్రెడిట్ స్కోర్‌, క్రెడిట్‌ హిస్టరీ, బ్యాంక్‌ పాలసీలపై ఆధారపడి ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ డౌన్‌పేమెంట్‌ చేయగలిగితే, చెల్లించాల్సిన మొత్తం వడ్డీ అంత తగ్గుతుంది.

టాటా హారియర్ ఈవీ ఫీచర్లు
టాటా హారియర్ EVలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఫీచర్‌ 'డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్' (AWD) సిస్టమ్‌. దీనిలో, ఫ్రంట్‌ మోటార్ 158 PS పవర్‌ (116 kW) & రియర్‌ మోటార్ 238 PS పవర్‌ (175 kW)ను జనరేట్‌ చేస్తుంది. దీని మొత్తం టార్క్ 504 Nm. బూస్ట్ మోడ్‌లో పెట్టి ఆక్సిలేటర్‌ తొక్కితే ఈ SUV కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈ పవర్‌ కారణంగా ఇది హై-పెర్ఫార్మ్‌ ఎలక్ట్రిక్ SUVగా నిలిచింది. 

హారియర్ EV కారులో అడ్వాన్స్‌డ్‌ 540-డిగ్రీస్‌ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్ ఉంది. దీనిలో 360-డిగ్రీల కెమెరా పారదర్శక అండర్ బాడీ వ్యూతో ఉంటుంది, డ్రైవింగ్‌ సమయంలో కారు కింది భాగాన్ని కూడా మీరు చూడవచ్చు. ఈ ఫీచర్ ఆఫ్-రోడింగ్ & ఇరుకైన పార్కింగ్ స్థలాల్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

డ్రైవింగ్‌ రేంజ్‌
టాటా హారియర్ EVని 65 kWh లేదా 75 kWh బ్యాటరీ ప్యాక్‌ల్లో కొనవచ్చు. ఇవి దాదాపు 480 km నుంచి 505 km డ్రైవింగ్‌ రేంజ్‌ను అందిస్తాయి. దీని అర్ధం.. సింగిల్‌ ఛార్జ్‌తో లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లవచ్చు లేదా తెలుగు నగరాల మధ్య హ్యాపీగా ప్రయాణించొచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
చిలకలూరిపేట స్కూల్‌కు లైబ్రరీ, 25 కంప్యూటర్లు - ఇచ్చిన మాట ప్రకారం పంపిన పవన్ కల్యాణ్
Viral Video: ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
ముస్లిం యువతి హిజాబ్ లాగిన బీహార్ సీఎం నితీష్‌- వీడియో వైరల్‌
Sircilla Sarpanchs: సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
సర్పంచ్‌లుగా గెలిచిన వారికి న్యాయసాయం కోసం జిల్లాలో లీగల్ సెల్ - కేటీఆర్ నిర్ణయం
Prashant Kishor: దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
దేశ రాజకీయాల్లో కీలక మార్పులు - ప్రియాంకా గాంధీతో ప్రశాంత్ కిషోర్ చర్చలు - కాంగ్రెస్‌లో చేరుతారా?
EPFO Update: ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
ఇకపై ఎలాంటి కారణం లేకుండా PFలోని 75% డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు! ప్రభుత్వ కొత్త నియమం తెలుసుకోండి
IPS officer Sanjay: ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
ప్రభుత్వం నిధుల దుర్వినియోగం కేసులో ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు!
Axar Patel Ruled Out : భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
భారత జట్టు నుంచి ఆల్ రౌండర్ అవుట్, దక్షిణాఫ్రికాతో నాల్గో టీ20 మ్యాచ్ ఆడే జట్టు ఇదే!
UP bride: పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
పెళ్లి మండపంలో కారు డిమాండ్ చేసిన వరుడు - పెళ్లి రద్దు చేసుకున్న వధువు -అచ్చం సినిమాలో జరిగినట్లే
Embed widget