Mini Fortuner: టయోటా మినీ ఫార్చ్యూనర్ పేటెంట్స్ లీక్ - ఇది పక్కా పవర్‌ఫుల్ యూత్ బండి!
Toyota Mini Fortuner Launch Date: టయోటా, ఇటీవలే, కొత్త ల్యాండ్ క్రూయిజర్ 250తో పాటు మరో రెండు SUVలను ఆవిష్కరించింది. ఇప్పుడు, FJ క్రూయిజర్ పేటెంట్స్ లీక్ అయ్యాయి.

Toyota Mini Fortuner FJ Cruiser Price And Features: భారతీయ మార్కెట్లో SUV ట్రెండ్‌కు అనుగుణంగా, టయోటా త్వరలోనే కొత్త స్టైలిష్ & పవర్‌ఫుల్ FJ Cruiserను లాంచ్ చేయబోతోంది. దీనిని "మినీ ఫార్చ్యూనర్" (Mini Fortuner), "బేబీ ల్యాండ్ క్రూయిజర్" (Baby Land Cruiser) అని కూడా పిలుస్తున్నారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న కొన్ని పాపులర్ SUVలకు పోటీగా FJ Cruiserను లైన్‌లోకి తెస్తోంది టయోటా.
ధర ఎంత?
భారతదేశంలో టయోటా FJ క్రూయిజర్ ఎక్స్-షోరూమ్ ధర (Toyota FJ Cruiser ex-showroom price) రూ. 20 లక్షల నుంచి రూ. 27 లక్షల మధ్య ఉండవచ్చు. ఇది, Mahindra Thar RWD & Thar Roxx, Mahindra Scorpio-N, Tata Safari, Jeep Compass వంటి SUVలకు డైరెక్ట్ పోటీగా FJ Cruiser లాంచ్ కాబోతోంది. తక్కువ బడ్జెట్‌లో ఫార్చ్యూనర్ లాంటి స్టైల్ & ఆఫ్-రోడింగ్ క్యాపబులిటీ కోరుకునే కస్టమర్లకు ఇది ఈ బండి బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
మినీ ఫార్చ్యూనర్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారు?
మీడియా నివేదికల ప్రకారం, టయోటా FJ క్రూయిజర్ (మినీ ఫార్చ్యూనర్) ఉత్పత్తి 2026 చివరి నాటికి థాయిలాండ్‌లో ప్రారంభమవుతుంది. భారతదేశంలో లాంచింగ్ (Toyota Mini Fortuner Launch Date) 2027 మధ్య నాటికి (బహుశా జూన్ 2027) జరుగుతుందని భావిస్తున్నారు. టయోటా FJ క్రూయిజర్‌ను మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఉన్న మేక్-ఇన్-ఇండియా ప్లాంట్‌లో తయారు చేస్తారు. ఫలితంగా ఈ బండి ఖర్చు అదుపులో ఉంటుంది & పోటీ ధరకు కస్టమర్‌కు లభిస్తుంది.
డిజైన్ ఎలా ఉంది?
యూత్‌ను, ముఖ్యంగా ఆఫ్-రోడింగ్‌ను ఇష్టపడేవాళ్లను దృష్టిలో పెట్టుకుని FJ క్రూయిజర్‌ను డిజైన్ చేశారు. ఇది రఫ్ అండ్ టఫ్ & బాక్సీ లుక్ ఇస్తుందని గతంలో విడుదలైన టీజర్ ఇమేజ్‌ను బట్టి తెలుస్తోంది. ఈ SUVకి మోడర్న్ LED హెడ్‌ల్యాంప్‌లు & DRLs (Daytime Running Lights), అధిక గ్రౌండ్ క్లియరెన్స్, చంకీ టైర్లు & టెయిల్‌గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ వంటివి యాడ్ చేస్తారు. ఇవి దీనికి బలమైన SUV అనిపించేలా మారుస్తాయి. అలాగే, దీని 4WD వ్యవస్థ కష్టమైన రోడ్లపై కూడా డ్రైవింగ్‌ను ఈజీగా చేస్తుంది.
ఇంజిన్ & పవర్‌ట్రెయిన్
FJ క్రూయిజర్ ఇండియన్ వెర్షన్‌కు 2.7 లీటర్ 2TR-FE నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ బిగిస్తారు, ఇది 161 bhp పవర్ & 246 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ అవుతుంది & ఫుల్-టైమ్ 4WD సిస్టమ్‌తో పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం FJ క్రూయిజర్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా యాడ్ చేయవచ్చు. దీనివల్ల మైలేజ్ పెరుగుతుంది & పర్యావరణ అనుకూలంగానూ ఉంటుంది.





















