అన్వేషించండి

Volkswagen Taigun Facelift : వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ గ్రాండ్ ఎంట్రీకి రెడీ: అదిరిపోయే లుక్స్, కొత్త గేర్‌బాక్స్‌తో సరికొత్త అవతార్!

Volkswagen Taigun Facelift:వోక్స్‌వ్యాగన్ తన పాపులర్ SUV టైగన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఏప్రిల్ 9, 2026న ఇండియాలో లాంచ్ చేస్తోంది. కొత్త డిజైన్, 8-స్పీడ్ గేర్‌బాక్స్ వంటి అప్‌డేట్స్‌తో ఈ కారు రాబోతోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 9, 2026న విడుదలవుతుంది.
  • కొత్త మోడల్‌కు స్టైలిష్ లైట్ బార్, వెలిగే VW బ్యాడ్జ్ ఉన్నాయి.
  • ఇంటీరియర్‌లో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉంటాయి.
  • 1.0-లీటర్ ఆటోమేటిక్‌లో కొత్త 8-స్పీడ్ గేర్‌బాక్స్ వస్తుంది.

Volkswagen Taigun Facelift : ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు జర్మన్ కార్ మేకర్ వోక్స్‌వ్యాగన్ సిద్ధమైంది. తన బెస్ట్ సెల్లింగ్ SUV Taigun ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఏప్రిల్ 9, 2026న ఇండియాలో అఫీషియల్‌గా అన్‌వీల్ చేయబోతోంది. ఈ లేటెస్ట్ అప్‌డేటెడ్ మోడల్ పాత వెర్షన్ కంటే చాలా రిఫ్రెష్డ్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్, ఇంటీరియర్ ట్రిమ్స్, ఒక స్పెషల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మార్కెట్లోకి వస్తోంది.

రీసెంట్‌గా బయటకు వచ్చిన స్పై షాట్స్ గమనిస్తే, ఈ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఫ్రంట్ ఎండ్ గ్లోబల్ మోడల్ Tayron R-Lineను పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలా స్లిమ్ గా ఉండే LED హెడ్‌లైట్స్, వాటిని కలుపుతూ ఒక స్టైలిష్ లైట్ బార్, వెలిగే VW బ్యాడ్జ్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు రీడిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్స్, కొత్త గ్రిల్, టెయిల్-ల్యాంప్స్ లో చేసిన మార్పులు కారుకు ఒక అగ్రెసివ్ లుక్ ఇస్తున్నాయి.

అదిరిపోయే ఇంటీరియర్..

కారు ఇంటీరియర్ విషయానికి వస్తే, వోక్స్‌వ్యాగన్ క్వాలిటీ మెటీరియల్స్, కొత్త కలర్ స్కీమ్‌ను వాడినట్లు సమాచారం. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పెద్దదైన 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే హైలైట్‌గా ఉండబోతున్నాయి. పవర్డ్ అడ్జస్టబుల్ సీట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కారు లోపల లగ్జరీ ఫీల్ ఇస్తాయి. ఎండాకాలంలో కూలింగ్ పర్ఫార్మెన్స్ పెంచేలా మెరుగైన ఎయిర్-కండిషనింగ్ కంప్రెసర్‌ను కూడా ఇందులో అమర్చారు.

ప‌వ‌ర్ఫుల్ ఇంజిన్..

మెకానికల్ పరంగా చూస్తే, టైగన్ ఫేస్‌లిఫ్ట్ పాత ఇంజన్ లైనప్‌నే కంటిన్యూ చేస్తోంది. 115 hp పవర్ ఇచ్చే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 150 hp పవర్ ఇచ్చే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే ఒక కీలక మార్పు ఏంటంటే, 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌లో పాత 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ గేర్‌బాక్స్ ప్లేస్‌లో కొత్త 8-స్పీడ్ యూనిట్ రాబోతోంది. ఇది డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ను మరింత స్మూత్ గా చేస్తుంది. ప్రస్తుతం ఉన్న టైగన్ ధర రూ. 11.42 లక్షల నుండి రూ. 19.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ధర దీనికంటే కొంచెం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

Volkswagen Taigun ఫేస్‌లిఫ్ట్ ఎప్పుడు విడుదల అవుతుంది?

Volkswagen Taigun ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 9, 2026న ఇండియాలో అధికారికంగా ఆవిష్కరించబడుతుంది.

కొత్త Taigun ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు ఉంటాయి?

కొత్త Taigun ఫేస్‌లిఫ్ట్ గ్లోబల్ మోడల్ Tayron R-Lineను పోలిన ఫ్రంట్ ఎండ్, స్లిమ్ LED హెడ్‌లైట్స్, లైట్ బార్, వెలిగే VW బ్యాడ్జ్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త గ్రిల్, టెయిల్-ల్యాంప్స్ తో వస్తుంది.

Taigun ఫేస్‌లిఫ్ట్ లోపల ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి?

ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పవర్డ్ అడ్జస్టబుల్ సీట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Taigun ఫేస్‌లిఫ్ట్ లో ఇంజిన్ ఆప్షన్స్ ఏమిటి?

ఇది 115 hp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 150 hp 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది. 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌లో కొత్త 8-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

రూ.1.27 లక్షలకే Hero Xtreme 160R 4V అప్‌డేటెడ్‌ వెర్షన్‌.. కొత్త డిజైన్, మూడు వేరియంట్లు, పవర్‌ఫుల్ ఫీచర్లు!
కొత్త లుక్‌లో Hero Xtreme 160R 4V లాంచ్‌.. క్రూయిజ్ కంట్రోల్, TFT డిస్‌ప్లేతో నయా అప్‌డేట్స్
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget