అన్వేషించండి

2026లో వోక్స్‌వ్యాగన్‌ భారీ ప్లాన్: టైరాన్‌ SUV నుంచి గోల్ఫ్‌ GTI వరకు 5 లాంచ్‌లు

2026లో వోక్స్‌వ్యాగన్‌ ఇండియాలో 5 కొత్త కార్లను లాంచ్‌ చేయనుంది. కొత్త టైరాన్‌ 7 సీటర్‌ SUV, టైగూన్‌, వర్చుస్‌ ఫేస్‌లిఫ్ట్‌లు, గోల్ఫ్‌ GTI వివరాలు తెలుసుకోండి.

Volkswagen India 2026 launches: మన మార్కెట్‌లో, 2026 సంవత్సరం వోక్స్‌వ్యాగన్‌కు చాలా కీలకం కానుంది. SUVలు, సెడాన్లు, పెర్ఫార్మెన్స్‌ కార్లపై దృష్టి పెట్టిన ఈ జర్మన్‌ బ్రాండ్‌, ఈ ఏడాది ఇండియాలోకి మొత్తం 5 కొత్త కార్లను లాంచ్‌ చేయనున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్‌ చేసింది. వీటిలో పూర్తిగా కొత్త మోడళ్లు, పాపులర్‌ కార్లకు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు కూడా ఉన్నాయి.

Volkswagen Tayron R-Line (లాంచ్‌: మార్చి 2026)

వోక్స్‌వ్యాగన్‌ మళ్లీ ప్రీమియం 7 సీటర్‌ SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టనుంది. 2021లో నిలిపివేసిన Tiguan Allspace స్థానంలో Tayron R-Line రానుంది. ఈ SUVని ఛత్రపతి సంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌) ప్లాంట్‌లో లోకల్‌గా అసెంబుల్‌ చేస్తున్నారు.

ఈ కారు 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో 204hp పవర్‌, 320Nm టార్క్‌ అందిస్తుంది. 7 స్పీడ్‌ DSG గేర్‌బాక్స్‌, ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ ప్రత్యేక ఆకర్షణ. డిజైన్‌ పరంగా ఇది Tiguan R-Line లుక్‌ను కొనసాగిస్తూనే, మూడో వరుస సీట్ల కోసం కొంచెం పొడవుగా ఉంటుంది. అంచనా ధర రూ.50 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

Volkswagen Tayron (లాంచ్‌: రెండో త్రైమాసికం)

R-Line తరువాత స్టాండర్డ్‌ Tayron కూడా ఇండియాకు రానుంది. ఇందులో 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ (150hp, 250Nm) ఉండే అవకాశం ఉంది. ఇది R-Line కంటే కొంచెం తక్కువ ధరలో ఉండనుంది. అంచనా ధర రూ.45-48 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

Volkswagen Taigun Facelift (లాంచ్‌: రెండో త్రైమాసికం)

ఇండియాలో వోక్స్‌వ్యాగన్‌కు బలమైన మోడల్‌గా నిలిచిన టైగూన్‌కు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ రానుంది. బాడీ మార్పులు  పెద్దగా ఉండకపోయినా, కొత్త అలాయ్‌ వీల్స్‌, ఇంటీరియర్‌ అప్‌డేట్స్‌ ఉండొచ్చు.

ఇప్పటికే ఉన్న 1.0 లీటర్‌, 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్లు కొనసాగుతాయి. 1.0 లీటర్‌ వేరియంట్‌కు కొత్త 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వచ్చే అవకాశం ఉంది. పానోరామిక్‌ సన్‌రూఫ్‌ కూడా జోడించవచ్చు. ధర రూ.12-19 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌) ఉండొచ్చు.

Volkswagen Virtus Facelift (లాంచ్‌: మూడో త్రైమాసికం)

విర్టస్‌ సెడాన్‌కూ ఈ ఏడాది ఫేస్‌లిఫ్ట్‌ రానుంది. కొత్త ఫ్రంట్‌, రియర్‌ డిజైన్‌, అలాయ్‌ వీల్స్‌తో పాటు, టైగూన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చే ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి. కొత్తగా ADAS ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. 

1.5 లీటర్‌ ఇంజిన్‌తో 7 స్పీడ్‌ DSG కొనసాగుతుండగా, 1.0 లీటర్‌ వేరియంట్‌కు కొత్త 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ రావచ్చు. అంచనా ధర రూ.12-18 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

Volkswagen Golf GTI - రెండో బ్యాచ్‌ (లాంచ్‌: నాలుగో త్రైమాసికం)

పెర్ఫార్మెన్స్‌ కారు అభిమానులకు ఇది పెద్ద వార్త. భారీ డిమాండ్‌ నేపథ్యంలో Golf GTI రెండో బ్యాచ్‌ను వోక్స్‌వ్యాగన్‌ తీసుకురానుంది. 

ఈ హాట్‌ హ్యాచ్‌బ్యాక్‌లో 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 265hp పవర్‌తో, 7 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉంటుంది. డ్రైవ్‌ ఫ్రంట్‌ వీల్స్‌కు వెళ్తుంది. అంచనా ధర రూ.53 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

ఓవరాల్‌గా, 2026లో వోక్స్‌వ్యాగన్‌ ఇండియాలో SUVలు, సెడాన్లు, పెర్ఫార్మెన్స్‌ కార్లతో పూర్తి దాడికి సిద్ధమైంది. కుటుంబానికి పెద్ద SUV కావాలన్నా, యూత్‌కి డ్రైవింగ్‌ ఎంజాయ్‌మెంట్‌ కావాలన్నా - ఈ లిస్ట్‌లో ప్రతి ఒక్కరికీ ఒక ఫేవరెట్‌ ఉండే అవకాశముంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Safest Cars Of India: ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
ఇండియాలో 15 అత్యంత సురక్షితమైన కార్లు ఇవే! బెస్ట్‌ రేటింగ్ పొందినవి ఏవో చూడండి!
Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget