అన్వేషించండి

Upcoming Tata SUVs: అదిరిపోయే డిజైన్‌తో, రూ.10 లక్షల్లో 3 కొత్త కాంపాక్ట్ SUVలు - ఏ మోడల్ ప్రత్యేకత ఏంటి?

New Tata Compact SUVs: టాటా మోటార్స్ రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు మూడు కొత్త కాంపాక్ట్ పెట్రోల్-డీజిల్ SUVలు స్కార్లెట్, న్యూ-జెన్ నెక్సాన్ & పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేయబోతోంది.

Upcoming Tata Compact SUVs Under Rs 10 Lakhs: రూ. 10 లక్షల బడ్జెట్‌లో స్టైలిష్‌గా ఉండే, శక్తిమంతమైన & మెరుగైన SUVని కొనుగోలు చేయాలనుకుంటే, కాస్త ఓపిక పట్టండి. బిల్ట్‌ క్వాలిటీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే టాటా మోటార్స్, త్వరలో మూడు గొప్ప ఆఫరింగ్స్‌ తీసుకువస్తోంది. వచ్చే రెండేళ్లలో, టాటా మోటార్స్ మూడు కొత్త కాంపాక్ట్ SUVలను విడుదల చేయబోతోంది, అవి - స్కార్లెట్, న్యూ-జెన్ నెక్సాన్ & పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Scarlet, New-gen Nexon & Punch Facelift). 

ఏ కాంపార్ట్‌ SUV ఎలా ఉంటుంది?

టాటా స్కార్లెట్ 
టాటా స్కార్లెట్ పూర్తిగా కొత్త SUV మోడల్ అవుతుంది,టాటా సియెర్రా డిజైన్‌ ఇన్‌స్పిరేషన్‌తో టాటా స్కార్లెట్‌ను డిజైన్ చేసినట్లు ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. ఈ SUVని టాటా కర్వ్ ICE ప్లాట్‌ఫామ్‌పై నిర్మించవచ్చు. పెట్రోల్ & డీజిల్ ఇంజిన్ ఎంపికలు రెండూ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ SUV లుక్ స్పోర్టీ & మస్క్యులర్‌గా ఉంటుంది, ఇది యువతకు ప్రత్యేకంగా నచ్చుతుంది. దీనికి 1.2 లీటర్ టర్బో పెట్రోల్ & 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఇవ్వవచ్చు. భవిష్యత్తులో, టాటా స్కార్లెట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ఈ కంపెనీ తీసుకురావచ్చు. టాటా స్కార్లెట్ ప్రారంభ ధర దాదాపు రూ. 9 లక్షలు ఉండవచ్చు, ఇది మిడ్-రేంజ్ SUVలను కొనుగోలు చేసే వారికి మంచి ఎంపికగా మారవచ్చు.

న్యూ-జెన్‌ టాటా నెక్సాన్
టాటా అత్యంత విజయవంతమైన SUV నెక్సాన్. దీనికి తదుపరి తరం మోడల్ త్వరలో మార్కెట్లోకి రానుంది. "గరుడ్" అనే కోడ్‌నేమ్ ఉన్న ఈ SUV, టాటా X1 ప్లాట్‌ఫామ్ అప్‌డేటెడ్‌ వెర్షన్‌పై నిర్మించారు. అంటే.. ఆధునిక డిజైన్ &భద్రత సాంకేతికతల మెరుగైన మిశ్రమాన్ని గరుడ్ చూస్తుంది. ఈ కొత్త నెక్సాన్ పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా & లెవల్ 2 ADAS వంటి ప్రీమియం సెగ్మెంట్ లక్షణాలను కూడా యాడ్‌ చేసుకుంటుంది. ఇప్పటికే నెక్సాన్‌లో ఉపయోగించిన, ప్రజాదరణ పొందిన అదే విశ్వసనీయ 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్‌ & 1.5L డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్లను ఈ కారులో తీసుకువస్తున్నారు. దీని అంచనా ప్రారంభ ధర రూ. 9.50 లక్షల కంటే తక్కువగా ఉండవచ్చు.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో SUVలలో టాటా పంచ్ ఒకటి & ఇప్పుడు కంపెనీ దాని ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకువస్తోంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ గురించి ఇటీవలి టెస్టింగ్‌ సమయంలో బయటకు వచ్చింది. కొత్త పంచ్‌లోని అనేక డిజైన్‌ ఎలిమెంట్స్‌ పంచ్ EV నుంచి తీసుకోవచ్చు, తద్వారా ఇది మునుపటి కంటే మరింత మోడరన్‌ & అగ్రెసివ్‌ లుక్స్‌ ఇస్తుంది. ఈ అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో రిఫ్రెష్‌ చేసిన హెడ్‌లైట్లు, కొత్త గ్రిల్ & షార్ప్ బాడీలైన్స్‌ ఉంటాయి. ఇంటీరియర్‌లో.. కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటాయి, ఇవి డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఈ SUVలో కొనసాగుతుంది. దీని ధర రూ. 6 లక్షల నుంచి రూ. 7.5 లక్షల మధ్య ఉండవచ్చు.

2030 నాటికి 30 కొత్త వెహికల్స్‌
టాటా మోటార్స్, 2030 నాటికి 30 కొత్త వాహనాలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, వాటిలో 7 పూర్తిగా కొత్త మోడళ్లు. ఈ కంపెనీ ICE (పెట్రోల్-డీజిల్) & EV విభాగాలలో ఏకకాలంలో బలంగా ముందుకు కదులుతోంది. ఈ వ్యూహంలో భాగంగా, టాటా తన R&D, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ప్రారంభించింది.

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget