అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Upcoming SUVs in 2024: 2024లో కారు కొనాలనుకుంటున్నారా? - ఈ నాలుగు ఎస్‌యూవీలు ఎంట్రీ ఇస్తున్నాయి - ఒక్కసారి చూడండి!

Upcoming SUVs 2024: 2024లో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్, ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్, టాటా కర్వ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.

New SUVs in 2024: ప్రస్తుతం మనదేశంలో ఎస్‌యూవీలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. హై గ్రౌండ్ క్లియరెన్స్, బెటర్ రోడ్ ప్రెజెన్స్, ఎక్కువ సామర్థ్యం ఉన్న కార్లకు మనదేశంలో డిమాండ్ ఎక్కువ. 2024 ప్రారంభంలో ఈ విభాగంలో నాలుగు కొత్త ఎస్‌యూవీ భారతీయ రోడ్లపైకి రానున్నాయి. ఈ ఎస్‌యూవీల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం.

కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ (Kia Sonet Facelift)
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ డిసెంబర్ 14వ తేదీన లాంచ్ కానుంది. అమ్మకాలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది కొత్త ఫ్రంట్, రియర్ బంపర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, అప్‌డేట్ చేసిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త ఫ్రంట్ వంటి కొన్ని చిన్న బ్యూటీ అప్‌డేట్‌లను పొందుతుంది. విలక్షణమైన టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు కూడా చూడచవ్చు. క్యాబిన్ లోపల కూడా ప్రధాన అప్‌గ్రేడ్‌లు కనిపిస్తాయి. ఇందులో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అప్‌హోల్స్టరీ, అప్‌డేట్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఉంటాయి. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) కూడా ఇందులో ఉండనుంది.

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ (Hyundai Creta Facelift)
హ్యుందాయ్ మోటార్ ఇండియా 2024 ప్రారంభంలో కొత్త క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేయనుంది. ఏడీఏఎస్ టెక్నాలజీని చేర్చడంతో పాటు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండింటిలోనూ ప్రధాన అప్‌డేట్‌లు ఉంటాయని ఆశిస్తున్నారు. ఫుల్లీ డిజిటల్ 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేను ఇందులో చూడవచ్చు. క్రెటాకు పవర్‌ను అందించడానికి ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పాటు 160 బీహెచ్‌పీ పవర్‌తో కొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉండనుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
మహీంద్రా ఎక్స్‌యూవీ300 సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని 2024 ప్రారంభంలో అప్‌డేట్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 6 స్పీడ్ ఏఎంటీ యూనిట్ స్థానంలో కొత్త 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఏడీఏఎస్ టెక్నాలజీ, పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది. ఎక్స్‌యూవీ700 తరహాలో డిజైన్ మార్పులు చేయనున్నారు. ఇందులో కొత్త ఫ్రంట్ గ్రిల్, సీ-ఆకారపు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన వెనుక బంపర్, టెయిల్‌గేట్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో కొత్త డ్యాష్‌బోర్డ్ ఫినిషింగ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కోసం చిన్న గేర్ సెలెక్టర్, ప్రత్యేక సెంట్రల్ ఏసీ వెంట్లు ఉంటాయి.

టాటా కర్వ్ (Tata Curvv)
టాటా మోటార్స్ 2024 ప్రారంభంలో కర్వ్ ఎస్‌యూవీని లాంచ్‌ చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఇది ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో మార్కెట్లోకి వచ్చే మొదటి టాటా కారు. కంపెనీ జనరేషన్ 2 ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రిక్ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ఇందులో ఏడీఏఎస్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, స్టీరింగ్ వీల్‌పై కొత్త ఇల్యూమినేటెడ్ టాటా లోగో, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు... ఇలా అనేక ఫీచర్లు ఉండనున్నాయి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: సూపర్ హిట్ టయోటా కామ్రీ అప్‌డేటెడ్ వెర్షన్ త్వరలో - ఈసారి హైబ్రిడ్ ఇంజిన్‌తో!

Also Read: లాంచ్‌కు రెడీ అవుతున్న కొత్త స్విఫ్ట్ - సరికొత్త ఇంజిన్, సూపర్ లుక్‌తో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Auction 2025: ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్, లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా రిషభ్ పంత్ - లక్నో ఫ్రాంచైజీకి కొత్త కెప్టెన్!
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Embed widget