Upcoming EVs in India: కర్వ్, హారియర్, 3ఎక్స్‌వో, ఈవీఎక్స్ - మార్కెట్లోకి పోటెత్తనున్న క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు!
2024 Upcoming EVs in India: త్వరలో మనదేశంలో కొన్ని క్రేజీ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కానున్నాయి. మనదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ నడుస్తుంది.
Upcoming EVs in 2024: భారతదేశంలో ఈవీ మార్కెట్ నిరంతరం పెరుగుతోంది. అందుకే కార్ల తయారీ కంపెనీలు మారుతి సుజుకి, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, విన్‌ఫాస్ట్, టెస్లా... కొత్త మోడల్స్, వారి గ్లోబల్ ఈవీలతో ఈ విభాగంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీలతో ఈవీ స్పేస్‌లో బలంగా ఉన్నాయి. అంతేకాకుండా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణలో మహీంద్రా, బీవైడీ కూడా ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. 2024లో భారత ఈవీ మార్కెట్ 66 శాతం వృద్ధి చెందుతుందని అంచనా. మీరు కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం చూస్తున్నట్లయితే టాటా, మారుతి సుజుకి, మహీంద్రాకు సంబంధించిన నాలుగు ప్రధాన ఉత్పత్తులు మార్కెట్లోకి రాబోతున్నాయి.
టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)
టాటా కర్వ్ ఈవీ అమ్మకాలు 2024 మధ్య నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితే హారియర్ ఈవీ ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో వస్తుంది. రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మోడల్స్ టాటా జెన్ 2; యాక్టివ్.ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. అయితే కర్వ్ ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల రేంజ్‌ని పొందే అవకాశం ఉంది. ఈ కూపే ఎస్‌యూవీ నెక్సాన్ కొత్త 125 బీహెచ్‌పీ, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌లతో పాటు సీఎన్‌జీ ఆప్షన్‌తో మార్కెట్లోకి రానుంది. టాటా కర్వ్ ఈవీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ను పొందుతుంది. అప్‌డేట్ చేసిన హారియర్ లాగానే కొత్త టాటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 4 స్పోక్ ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్‌తో పాటు 360 డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ సీట్ల వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.
టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV)
టాటా హారియర్ ఈవీ డ్యూయల్-మోటార్ ఏడబ్ల్యూడీ (ఆల్-వీల్ డ్రైవ్) సెటప్‌తో పాటు వెహికల్ టు లోడ్ (V2L), వెహికల్ టు వెహికల్ (V2V) ఛార్జింగ్‌ను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ దాదాపు 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని రేంజ్ దాదాపు 400 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. హారియర్ ఈవీ దాని ఐసీఈ మోడల్‌ను పోలి ఉంటుంది. కానీ కొన్ని ఈవీ స్పెసిఫిక్ డిజైన్ అంశాలను కలిగి ఉంటుంది. ముందు భాగంలో కొత్త బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, అప్‌డేట్ చేసిన బంపర్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్ కోసం బ్లాక్ హౌసింగ్, సెంటర్ ఎయిర్ ఇన్‌టేక్‌పై రీడిజైన్ చేసిన బ్లాంక్డ్ ఆఫ్ ప్యానెల్, కొత్త యాంగ్యులర్ క్రీజ్‌లు ఉంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ (Mahindra XUV 3XO EV)
మహీంద్రా 2024 జూన్ నాటికి ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ లాంచ్‌తో దాని ఎలక్ట్రిక్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది. ఇది టాటా నెక్సాన్‌తో పోటీపడుతుంది. దీని డిజైన్, స్టైలింగ్ దాని ఐసీఈ వెర్షన్‌తో సమానంగా ఉంటాయి. ఇది పెద్ద సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్, కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్, కొత్త డ్రాప్ డౌన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, సీ-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు, పూర్తి వెడల్పాటి ఎల్ఈడీ లైట్ బార్‌తో కూడిన కొత్త రెండు భాగాల గ్రిల్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ, దాని ఐసీఈ వెర్షన్ లాగానే సెగ్మెంట్‌లో మొదటిసారిగా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో రావచ్చు. డోర్ లాక్/అన్‌లాక్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డయాగ్నస్టిక్ టూల్స్ మొదలైన రిమోట్ ఫంక్షన్‌లను అందించగల కొత్త అడ్రెనాక్స్ కనెక్ట్ యాప్ కూడా ఉంటుంది. కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
మారుతి సుజుకి EVX (Maruti Suzuki EVX)
మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 2025 ప్రారంభంలో వస్తుంది. ఈ ఈవీ టయోటా 27 పీఎల్ స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. సుమారు 4.3 మీటర్ల పొడవు ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. దీని ఈ-రేంజ్ దాదాపు 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఏడబ్ల్యూడీ సెటప్ ఈవీఎక్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇది డ్యూయల్ స్క్రీన్ సెటప్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్, రోటరీ డయల్‌తో ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్, 360 డిగ్రీ కెమెరా, ఫ్రేమ్‌లెస్ రియర్ వ్యూ మిర్రర్, ఏడీఏఎస్ టెక్నాలజీని పొందవచ్చు. దాని కాన్సెప్ట్ మాదిరిగానే కొత్త మారుతి ఈవీ పెద్ద హెడ్‌ల్యాంప్‌లు, క్లోజ్డ్ గ్రిల్, ఫ్లాట్ బానెట్, సి పిల్లర్ మౌంటెడ్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంటుంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?