Upcoming Cars Bikes in November: నవంబర్‌లో లాంచ్ కానున్న కార్లు, బైక్‌లు ఇవే - రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి స్కోడా కైలాక్ వరకు!
Upcoming Cars Bikes in India November 2024: నవంబర్‌లో మనదేశంలో ఎన్నో కార్లు, బైక్‌లు లాంచ్ చేయనున్నారు. ఇందులో కొత్త మారుతి సుజుకి డిజైర్ నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 వరకు ఉన్నాయి.
Upcoming Cars Bikes Launching in November: ప్రస్తుతం మనదేశంలో బైక్‌లు, కార్ల అమ్మకాలు దూసుకుపోతున్నాయి. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా అందుబాటులో ఉన్న ఆఫర్లు కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. దీపావళితో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ కూడా ముగిసింది. ఇప్పుడు కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ కంపెనీలు కొత్త కార్లను, బైక్‌లను లాంచ్ చేయనున్నాయి. 2024 నవంబర్‌లో కొన్ని కొత్త బైక్‌లు, కార్లు మన ముందుకు రానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కొత్త మారుతి సుజుకి డిజైర్ (Next-Gen Maruti Suzuki Dzire)
మారుతి సుజుకి తర్వాతి తరం మారుతి సుజుకి డిజైర్ నవంబర్ 11వ తేదీన మనదేశంలో లాంచ్ చేయనుంది. రివైజ్డ్ సబ్ 4 మీటర్ సెడాన్ విభాగంలో ఈ కారు కొత్త ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌తో రానున్నాయి. ఇందులో కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. సన్‌రూఫ్‌తో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుందని సమాచారం. కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టం, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించనున్నారు. కొత్త స్విఫ్ట్ తరహాలో దీని ఇంజిన్ కూడా ఉండనుంది. 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్... మాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఉండనుంది.
స్కోడా కైలాక్ (Skoda Kylaq)
నవంబర్ 6వ తేదీన స్కోడా తన కొత్త కారును మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే స్కోడా కైలాక్. ఇది సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్లోకి వచ్చింది. ఇది కుషాక్ కంటే కాస్త తక్కువ రేంజ్‌లో ఉండనుంది. ఈ కొత్త స్కోడా ఎస్‌యూవీకి సంబంధించిన సేల్ 2025 ప్రారంభంలో సేల్‌కు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇందులో 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించనున్నారు. ఇది 113 హెచ్‌పీ పవర్‌ను డెలివర్ చేయనుంది.
Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650)
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 బైక్ నవంబర్ 5వ తేదీన మార్కెట్లోకి రానుంది. కంపెనీ 650 సీసీ విభాగంలో లాంచ్ చేసిన మొదటి స్క్రాంబ్లర్ బైక్ ఇదే. దీనికి సంబంధించిన ఫొటోలు కొన్ని వారాల క్రితం లీక్ అయ్యాయి. ఈ ఫొటోలను బట్టి ఈ బైక్‌ను ఇంటర్‌సెప్టార్ 650 బేస్ మీద రూపొందించారని అనుకోవచ్చు. ఇందులో 648 సీసీ సింగిల్ సిలింజర్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది.
కొత్త హీరో డెస్టినీ 125 (Next-Gen Hero Destini 125)
కొత్త హీరో డెస్టినీ 125 బైక్ మనదేశంలో 2024 నవంబర్‌లో లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ స్కూటీని కంపెనీ ఇప్పటికే రివీల్ చేసింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడింది. కానీ ధర మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇందులో 124.6 సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అందించనున్నారు. 9 హెచ్‌పీ పవర్, 10.4 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఈ స్కూటీ జనరేట్ చేయనుంది.
Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!