అన్వేషించండి

TVS iQube ST కొనే ప్లాన్‌లో ఉన్నారా? బ్యాటరీ కెపాసిటీ నుంచి ఆన్‌రోడ్‌ ప్రైస్‌, అండర్‌సీట్‌ స్టోరేజ్‌ వరకు ఫుల్‌ గైడ్‌

TVS iQube ST ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ కెపాసిటీ, రైడ్‌ రేంజ్‌, చార్జింగ్‌ టైమ్‌, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్‌ ధర, ఫీచర్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

TVS iQube ST Price In Hyderabad Vijayawada: ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా TVS iQube ST మీదే మీ దృష్టి ఉంటే, ముందుగా కొన్ని విషయాలు క్లియర్‌గా తెలుసుకోవడం మంచిది. ఇది TVS లైనప్‌లో టాప్‌ వేరియంట్‌. ధర కాస్త ఎక్కువైనా, ఫీచర్లు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. 

TVS iQube ST గురించి కొనుగోలు ముందు తెలుసుకోవాల్సిన 6 ముఖ్య అంశాలు:

1) బ్యాటరీ కెపాసిటీ, పవర్‌, టాప్‌ స్పీడ్‌

TVS iQube STలో 5.3kWh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. మోటార్‌ గరిష్టంగా 4.4kW పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. టార్క్‌ 140Nm వరకు ఉంటుంది. కంపెనీ చెప్పిన గరిష్ట వేగం గంటకు 82 కి.మీ. నగర ప్రయాణాలకు ఇది సరిపడే స్థాయిలో ఉంటుంది.

2) రేంజ్‌ & చార్జింగ్‌ టైమ్‌

IDC ప్రకారం, ఈ స్కూటర్‌ పూర్తి చార్జ్‌తో 212 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. రోజువారీ ఆఫీస్‌ ప్రయాణాలతో పాటు వీకెండ్‌లో చిన్నపాటి ట్రిప్‌లకు కూడా ఈ రేంజ్‌ చాలా బాగుంటుంది. 0 నుంచి 80 శాతం వరకు చార్జ్‌ కావడానికి సుమారు 4 గంటలు 18 నిమిషాలు పడుతుంది.

3) అండర్‌సీట్‌ స్టోరేజ్‌, ఫీచర్లు

ఈ స్కూటర్‌లో 32 లీటర్ల అండర్‌సీట్‌ స్టోరేజ్‌ ఉంది. రెండు హెల్మెట్లు పెట్టుకునేంత స్థలం ఉంటుంది. Eco, Power అనే రెండు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి. LED హెడ్‌ల్యాంప్‌, రివర్స్‌ మోడ్‌, USB ఛార్జింగ్‌ పోర్ట్‌, CBS బ్రేకింగ్‌ సిస్టమ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీతో TFT టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

4) బరువు, సీటు ఎత్తు

TVS iQube ST కర్బ్‌ వెయిట్‌ 132 కిలోలు. సీటు ఎత్తు 770 మిల్లీమీటర్లు. తక్కువ ఎత్తు ఉన్నవారికి కూడా సులభంగా హ్యాండిల్‌ చేయగలిగేలా డిజైన్‌ చేశారు.

5) కలర్‌ ఆప్షన్లు

ఈ స్కూటర్‌ మూడు కలర్‌లలో లభిస్తుంది - కాపర్‌ బ్రౌన్‌ బీజ్‌, స్టార్లైట్‌ బ్లూ బీజ్‌, టైటానియం గ్రే మ్యాట్‌. మొదటి రెండు డ్యూయల్‌ టోన్‌ సీటుతో ప్రత్యేకంగా కనిపిస్తాయి.

6) ధర - హైదరాబాద్‌లో ఎంత?

TVS iQube ST ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1,61,984. ఇతర వేరియంట్లలో iQube S ధర రూ. 1,41,523 కాగా, స్టాండర్డ్‌ iQube ధర రూ. 1,10,370 నుంచి ప్రారంభమవుతుంది (ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు).

హైదరాబాద్‌లో iQube ST 5.3kWh వేరియంట్‌ ఆన్‌రోడ్‌ ధర వివరాలు:
ఎక్స్‌-షోరూమ్‌ ధర – రూ. 1,61,984
RTO ఛార్జీలు – రూ. 1,185
ఇన్సూరెన్స్‌ – రూ. 6,254
మొత్తం ఆన్‌రోడ్‌ ధర – రూ. 1,69,423 ‍‌(సుమారు)

మంచి రేంజ్‌, పెద్ద స్టోరేజ్‌, ఆధునిక ఫీచర్లతో TVS iQube ST నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు మంచి ఎంపిక. అయితే, కొనే ముందు మీ అవసరాలు, బడ్జెట్‌, చార్జింగ్‌ సదుపాయాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget