అన్వేషించండి

రూ.3.59 లక్షలకే మహీంద్రా UDO ఈ-ఆటో - విమానం లాంటి డిజైన్‌, 200 Km రేంజ్‌తో సంచలనం

మహీంద్రా UDO ఈ-ఆటో రూ.3.59 లక్షల ప్రారంభ ధరకు లాంచ్ అయింది. 200 కి.మీ. రియల్ వరల్డ్ రేంజ్, మోనోకోక్ డిజైన్, 6 ఏళ్ల వారంటీతో లాస్ట్ మైల్ మొబిలిటీకి కొత్త స్టాండర్డ్‌గా మారునుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మహీంద్రా UDO ఎలక్ట్రిక్ ఆటో ₹3,58,999 ప్రారంభ ధరతో విడుదలైంది.
  • విమాన డిజైన్ స్ఫూర్తితో, సెగ్మెంట్ ఫస్ట్ మోనోకోక్ నిర్మాణం తో వచ్చింది.
  • 11.7 kWh బ్యాటరీతో 200 కి.మీ. రియల్ వరల్డ్ రేంజ్ అందిస్తుంది.
  • Range, Ride, Race డ్రైవ్ మోడ్స్, 6 ఏళ్ల వారంటీ ఉన్నాయి.

Mahindra UDO eAuto: భారతదేశంలో ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ మొబిలిటీ రంగం వేగంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML), తన సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మహీంద్రా UDOను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధరగా రూ.3,58,999 (ఎక్స్-షోరూమ్) ఇప్పుడు అమ్ముతున్నారు, కొంత కాలం తరువాత ఈ రేటు రూ.3,84,299గా మారిపోతుంది.

విమాన డిజైన్ ప్రేరణ

“UDO” అనే పేరు హిందీలో ‘ఎగరడం’ అనే అర్థాన్ని ఇస్తుంది. విమానాల డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన ఈ ఈ-ఆటోను మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియో అధిపతి ప్రతాప్ బోస్ బృందం రూపొందించింది. కంపెనీ దీన్ని “ఆటోప్లేన్”గా అభివర్ణిస్తోంది. పెద్ద హెడ్‌ల్యాంప్స్, పెద్ద పానోరమిక్ విండ్‌షీల్డ్, స్టైలిష్ మిర్రర్లు దీని ప్రత్యేకతలు.

సెగ్మెంట్ ఫస్ట్ మోనోకోక్ నిర్మాణం

సాంప్రదాయ ఆటోలతో పోలిస్తే UDOలో సెగ్మెంట్ ఫస్ట్ ఫుల్ మోనోకోక్ కన్‌స్ట్రక్షన్ ఉంది. ఇది బలమైన నిర్మాణంతో పాటు మెరుగైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. రఫ్ రోడ్లపై కూడా స్థిరంగా నడిచేలా ఉండేలా రూపొందించారు.

డ్రైవర్ & ప్యాసింజర్ కంఫర్ట్

డ్రైవర్ కోసం ప్రత్యేకంగా “పైలట్ సీట్” అందించారు. ఇది సాధారణ సీట్లతో పోలిస్తే దాదాపు 20% మందంగా ఉంటుంది. ప్రయాణికులకు ఎక్కువ హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ ఇచ్చారు. ఇంటీరియర్ లేఅవుట్ లౌంజ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, డ్యూయల్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ రైడ్ కంఫర్ట్‌ను పెంచుతాయి.

బ్యాటరీ & పనితీరు

11.7 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అందించారు. PMS మోటార్ 13.6 bhp (10kW) పవర్, 52 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ 200 km అని కంపెనీ పేర్కొంటోంది. ARAI సర్టిఫైడ్ రేంజ్ 265 km.

డ్రైవింగ్ మోడ్‌లు

Range, Ride, Race అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. Race మోడ్‌లో గరిష్ట వేగం 55 గంటకు km. రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ థ్రోటిల్ ఫంక్షన్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రీప్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ & వారంటీ

12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్, ఛార్జర్ IP67 రేటింగ్‌తో వచ్చాయి. 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల km వారంటీ అందిస్తున్నారు. 1 లక్ష km వరకు ఉచిత సర్వీసింగ్. అదనంగా రూ.20 లక్షల ప్రమాద బీమా కవరేజీతో Uday Nxt పథకం కూడా ఉంది.

తయారీ కేంద్రం

ఈ మోడల్ మహీంద్రా జహీరాబాద్ ప్లాంట్‌లో తయారు అవుతోంది. అక్కడ ఆధునిక ఆటోమేటెడ్ బ్యాటరీ అసెంబ్లీ, రోబోటిక్ ప్రొడక్షన్ లైన్లు ఏర్పాటు చేశారు.

సాంప్రదాయ ఆటోల రూపాన్ని మార్చే ప్రయత్నంగా మహీంద్రా UDO నిలుస్తోంది. మెరుగైన డిజైన్, 200 km రేంజ్‌తో అదనంగా డబ్బు సంపాదించుకునే అవకాశం, అధునాతన ఫీచర్లతో లాస్ట్ మైల్ మొబిలిటీకి కొత్త ప్రమాణాలు సెట్ చేయనుంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభవం కోరుకునే ఆటో డ్రైవర్లకు ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Frequently Asked Questions

Mahindra UDO eAuto ప్రారంభ ధర ఎంత?

Mahindra UDO eAuto ప్రారంభ ధర రూ. 3,58,999 (ఎక్స్-షోరూమ్). కొంత కాలం తర్వాత ఈ ధర రూ. 3,84,299గా మారవచ్చు.

Mahindra UDO eAuto డిజైన్ ఎలా ఉంటుంది?

UDO పేరు 'ఎగరడం' అనే అర్థాన్ని సూచిస్తుంది. విమానాల డిజైన్ నుంచి ప్రేరణ పొంది, పెద్ద హెడ్‌ల్యాంప్స్, పానోరమిక్ విండ్‌షీల్డ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది.

Mahindra UDO eAuto బ్యాటరీ సామర్థ్యం మరియు రేంజ్ ఎంత?

ఇందులో 11.7 kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. దీని రియల్ వరల్డ్ రేంజ్ 200 km, ARAI సర్టిఫైడ్ రేంజ్ 265 km.

Mahindra UDO eAutoలో ఎన్ని డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి?

Range, Ride, Race అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. Race మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 55 km.

Mahindra UDO eAuto పై ఎలాంటి వారంటీ అందిస్తున్నారు?

బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్, ఛార్జర్‌లపై 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల km వారంటీ ఉంది. 1 లక్ష km వరకు ఉచిత సర్వీసింగ్ కూడా లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget