అన్వేషించండి

BMW నుంచి TVS వరకు - ఎక్కువ అండర్‌సీట్ స్టోరేజ్ ఇచ్చే పెట్రోల్‌ స్కూటర్లు ఇవే

మన దేశంలో ఎక్కువ అండర్‌సీట్ బూట్ స్పేస్ ఇచ్చే 5 పెట్రోల్ స్కూటర్లు ఇవే. BMW, TVS, యమహా, సుజుకి మోడళ్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని ఒకసారి తెలుసుకోండి.

Scooters In India With Big Boot Space: స్కూటర్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సౌకర్యం. ముఖ్యంగా, అండర్‌సీట్ స్టోరేజ్ కూడా స్కూటర్ల కొనుగోలు చేయడానికి ఒక ప్రధాన కారణం. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇంజిన్ లేకపోవడంతో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. కానీ పెట్రోల్ స్కూటర్లలో ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, ఎగ్జాస్ట్ వ్యవస్థల కారణంగా స్టోరేజ్ తగ్గిపోతుంది. అయినా కూడా, మన మార్కెట్లో కొన్ని పెట్రోల్ స్కూటర్లు ఆశ్చర్యపరిచే స్థాయిలో బూట్ స్పేస్ ఇస్తున్నాయి. అలాంటి టాప్ 5 మోడళ్లు ఇవీ:

1) BMW C 400 GT - 37.6 లీటర్లు

ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది BMW C 400 GT. ఇది మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్‌లో వస్తుంది. ఇటీవల చేసిన అప్‌డేట్‌లో అండర్‌సీట్ స్టోరేజ్‌ను 7.1 లీటర్ల వరకు పెంచి మొత్తం 37.6 లీటర్లుగా మార్చారు. సీటు టబ్ & కంట్రోల్ యూనిట్‌ను కొత్తగా డిజైన్ చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ముందుభాగంలో 4.5 లీటర్ల అదనపు కబ్బీ కూడా ఉంది. అయితే దీని ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.10.99 లక్షలు కావడం వల్ల ఇది ప్రీమియం కేటగిరీలోనే ఉంటుంది.

2) TVS Jupiter 110 / 125 - 33 లీటర్లు

భారతదేశంలో తయారైన స్కూటర్లలో అత్యధిక అండర్‌సీట్ స్టోరేజ్ ఇచ్చేది TVS Jupiter. 110cc & 125cc వేరియంట్లు రెండూ 33 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తాయి. ఫ్యూయల్ ట్యాంక్‌ను ఫ్లోర్‌బోర్డ్ క్రింద అమర్చడం వల్ల సీటు కింద పెద్ద స్థలం లభించింది. రెండు హాఫ్ ఫేస్ హెల్మెట్‌లు సులభంగా సరిపోతాయి. కుటుంబ అవసరాలకు ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

3) Yamaha Aerox 155 - 24.5 లీటర్లు

యమహా ఏరోక్స్ 155 స్పోర్టీ డిజైన్‌తో వచ్చిన స్కూటర్. ఇది ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ లేకుండా అండర్‌బోన్ నిర్మాణంతో ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ మధ్య భాగంలో ఉండటం వల్ల సీటు కింద 24.5 లీటర్ల స్థలం లభిస్తుంది. ఫుల్ ఎల్ఈడీ లైటింగ్‌, బ్లూటూత్ కనెక్టివిటీ, కీ లెస్ ఇగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

4) Suzuki Access 125 - 24.4 లీటర్లు

2007 నుంచి మన మార్కెట్లో ఉన్న సుజుకి యాక్సెస్ 125 కుటుంబాలకు ఎంతో ఇష్టమైన మోడల్. తాజా అప్‌డేట్‌తో బూట్ స్పేస్ 21.8 లీటర్ల నుంచి 24.4 లీటర్లకు పెరిగింది. ముందు భాగంలో రెండు చిన్న కబ్బీలు కూడా ఉన్నాయి. రోజువారీ వినియోగానికి సరైన స్కూటర్‌గా ఇది నిలుస్తోంది.

5) TVS Ntorq 125 / 150 - 22 లీటర్లు

స్పోర్టీ సెగ్మెంట్‌లో ఉన్న TVS Ntorq 125 & కొత్త Ntorq 150 మోడళ్లు 22 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఇస్తాయి. ఇది జూపిటర్ లేదా యాక్సెస్‌తో పోలిస్తే తక్కువే అయినా, స్పోర్టీ స్కూటర్‌గా ఇది మంచి ప్రాక్టికాలిటీ అందిస్తుంది.

రోజువారీ ప్రయాణాల్లో హెల్మెట్, ల్యాప్‌టాప్ బ్యాగ్, కొన్ని సరుకులు పెట్టుకోవడానికి పెద్ద బూట్ స్పేస్ చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రీమియం స్కూటర్ కోసం చూస్తుంటే BMW. కుటుంబ వినియోగం కోసం అయితే TVS Jupiter లేదా Suzuki Access మంచి ఎంపిక. స్పోర్టీ లుక్ కావాలంటే Yamaha Aerox లేదా TVS Ntorq సరిపోతాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget