TVS Apache RTX 300 ఆన్ ది వే - అక్టోబర్ 15న లాంచ్ అవుతున్న తొలి అడ్వెంచర్ బైక్
TVS, తన తొలి అడ్వెంచర్ బైక్ RTX 300ను మరికొన్ని రోజుల్లో మార్కెట్‌లో లాంచ్ చేయబోతోంది. కొత్త 299cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, ట్రెలిస్ ఫ్రేమ్, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్ అద్భుతంగా రూపుదిద్దుకుంది.

TVS Apache RTX 300 Launch Date Specifications: టీవీఎస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న TVS Apache RTX 300 బైక్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ కంపెనీ నుంచి ఇదే తొలి అడ్వెంచర్ బైక్. TVS Apache RTX 300 బైక్‌ను ఈ కంపెనీ అక్టోబర్ 15న అధికారికంగా భారత మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. ఈ బైక్ మొదట భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. అప్పటి నుంచే దీని డిజైన్, స్టైల్, ఫీచర్లు ఆటో అభిమానుల దృష్టిని ఆకర్షించాయి.
డిజైన్ & లుక్స్
TVS Apache RTX 300ని చూస్తేనే ఇది అడ్వెంచర్ బైక్ అని స్పష్టంగా తెలుస్తుంది. ముందు భాగంలో ట్విన్ LED హెడ్‌ల్యాంప్స్, LED టర్న్ సిగ్నల్స్, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, ట్రాన్స్‌పరెంట్ విండ్షీల్డ్, LED టెయిల్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు దీన్ని చాలా స్టైలిష్‌గా చూపిస్తున్నాయి. వెనుక భాగంలో స్ప్లిట్ పిలియన్ గ్రాబ్ రైల్స్, లగేజ్ రాక్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ దీన్ని అడ్వెంచర్ టూర్‌ర్లకు మరింత సరిపోయేలా తీర్చిదిద్దాయి.
ఇంజిన్ & పనితీరు
ఈ బైక్‌లో TVS ప్రత్యేకంగా రూపొందించిన RTX D4 ఇంజిన్ ప్లాట్‌ఫాం ఉపయోగించారు. ఇది 299cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కాగా, సుమారు 35bhp పవర్, 28.5Nm టార్క్ అందిస్తుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్‌ను జత చేశారు. ఈ ఇంజిన్ శక్తిమంతమైనదిగా, సాఫీగా పనిచేస్తుందని టీవీఎస్ విశ్వాసం వ్యక్తం చేసింది.
ఫ్రేమ్, సస్పెన్షన్ & బ్రేకింగ్
RTX 300లో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఇచ్చారు. ముందువైపు USD ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ఈ బైక్ 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రియర్ వీల్ సైజ్‌తో వస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ అందించారు. ఈ సెటప్ రోడ్ ట్రిప్స్‌లో మంచి కంఫర్ట్ & స్టేబిలిటీని ఇస్తుంది.
ఫీచర్లు
TVS Apache RTX 300లో కలర్ TFT డిస్‌ప్లే, రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి. దీనిని టూరర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు కాబట్టి, సుదీర్ఘ ప్రయాణాల్లో రైడర్‌కు పూర్తి సౌకర్యం ఉండేలా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
ధర & పోటీ
TVS Apache RTX 300 అధికారిక ధర ఇంకా వెల్లడికాలేదు. కానీ, మార్కెట్ అంచనాల ప్రకారం ఈ బండి రూ. 2.70 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండే అవకాశం ఉంది. ఈ బైక్ KTM 250 Adventure వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
TVS, తన Apache RTX 300తో అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లోకి అడుగుపెడుతోంది. భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న అడ్వెంచర్ బైక్స్ మధ్య ఈ బైక్ ప్రత్యేకమైన డిజైన్, ఇంజిన్ పనితీరు, ఫీచర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. అక్టోబర్ 15న జరిగే లాంచ్ ఈవెంట్ టీవీఎస్ అభిమానులకు ఖచ్చితంగా ఎగ్జైటింగ్‌గా ఉండనుంది.





















