Triumph Thruxton 400: కొనబోయే ముందు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
Thruxton 400 specifications: క్లాసిక్ లుక్‌తో పాటు మోడ్రన్ టెక్‌ను ఇష్టపడే వారికి ఈ బండి ఒక మిస్ చేయకూడని ఆప్షన్!. స్టైల్‌కి ప్రాధాన్యం ఇస్తూనే డైలీ రైడింగ్‌కి సూటయ్యేలా డిజైన్ చేశారు.

Triumph Thruxton 400 Features Telugu: ఇండియాలో బైక్ ప్రియులు, ముఖ్యంగా యువత ఎంతగానో ఎదురుచూసిన ట్రయంఫ్ థ్రక్స్టన్ 400 బైక్ ఎట్టకేలకు లాంచ్ అయింది. 1960s కేఫే రేసర్ లెజెండ్‌కు మోడరన్ ఇంజినీరింగ్‌ను కలిపి రూపొందించిన ఈ బైక్.. స్టైల్, పనితీరు, ప్రాక్టికాలిటీ అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్" ప్యాకేజ్‌గా వచ్చింది. స్టైల్‌కి ప్రాధాన్యం ఇస్తూనే డైలీ రైడింగ్‌కి సూటయ్యే ఈ బైక్‌లోని 5 ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. స్టైలింగ్
థ్రక్స్టన్ 400 డిజైనింగ్ పూర్తిగా దాని క్లాసిక్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కిందకు ఉండే క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్లు, స్లిమ్ ఫ్యూయల్ ట్యాంక్, బుల్లెట్ స్టైల్ సీట్ కౌల్‌తో కాంపాక్ట్ టెయిల్ వంటివన్నీ ఈ టూవీలర్‌కు ఒక స్వచ్ఛమైన కేఫ్ రేసర్ వైబ్ ఇస్తాయి. కొత్త హెడ్‌లైట్ ఫేరింగ్, బార్-ఎండ్ మిర్రర్స్, LED లైటింగ్‌తో ఈ బైక్ రేట్రో లుక్‌తోపాటు ఆధునిక టచ్‌ను కలిపింది. ఈ బండి తీసుకుని రోడ్డుపైకి ఎక్కితే, క్లాస్ & అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది.
2. ఇంజిన్ & పనితీరు
ఈ బైక్‌లో 398cc లిక్విడ్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 41 bhp పవర్, 37.5 Nm టార్క్ ఇస్తుంది. స్పీడ్ 400 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడినా, థ్రక్స్టన్‌లో ప్రత్యేక కామ్‌షాఫ్ట్ ట్యూనింగ్‌తో టాప్-ఎండ్ పనితీరును మరింత మెరుగుపరిచారు. పవర్ డెలివరీ స్మూత్‌గా, సరైన మార్గంలో ఉండి రైడింగ్ అనుభూతిని పెంచుతుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, రైడ్-బై-వైర్ సిస్టమ్ రైడర్‌కు ఫుల్ కంట్రోల్ ఇస్తాయి.
3. రైడింగ్ పొజిషన్
స్పీడ్ 400తో పోలిస్తే, థ్రక్స్టన్‌లో మరింత అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ ఉంది. హ్యాండిల్‌బార్లు కిందకు & దగ్గరగా ఉండగా, ఫుట్‌పెగ్స్ వెనుకకు & పైకి షిఫ్ట్ చేశారు. దీంతో, రైడర్‌కు స్పోర్టీ రైడింగ్ పొజిషన్ వస్తుంది. అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, స్టిఫ్ రియర్ మోనో-షాక్ సస్పెన్షన్ కాంబినేషన్ డైనమిక్ రైడింగ్‌ను అందిస్తూనే, బండి కంట్రోల్‌ను మెరుగుపరుస్తుంది.
4. ఫీచర్స్
రూపంలో క్లాసిక్ అయినా, టెక్నాలజీలో ఇది మోడరన్ బండి. మార్చుకోదగిన ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-చానల్ ABS, టార్క్-అసిస్ట్ క్లచ్, USB-C చార్జింగ్ పోర్ట్ అన్నీ స్టాండర్డ్‌గా వస్తాయి. అనలాగ్ స్పీడోమీటర్‌తో కలిపిన డిజిటల్ డిస్‌ప్లే అవసరమైన సమాచారం ఇస్తూనే వింటేజ్ ఫీలింగ్‌ను కాపాడుతుంది.
5. వారంటీ & సర్వీస్
అంతర్జాతీయ స్థాయి క్వాలిటీతో తయారైన థ్రక్స్టన్ 400లో మెషీన్డ్ కూలింగ్ ఫిన్స్, ప్రీమియం పెయింట్ ఫినిష్ ఉన్నాయి. 16,000 కి.మీ. సర్వీస్ ఇంటర్వెల్స్, 2-సంవత్సరాల అన్‌లిమిటెడ్ మైలేజ్ వారంటీ వంటివి రైడర్ నమ్మకాన్ని పెంచుతాయి. విలువ, నాణ్యత కలిపిన ఈ బైక్ మధ్యస్థాయి సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తుంది.
క్లాసిక్ లుక్‌తో పాటు మోడ్రన్ టెక్‌ను ఇష్టపడే వారికి ట్రయంఫ్ థ్రక్స్టన్ 400 ఒక మిస్ చేయకూడని ఆప్షన్!.





















