అన్వేషించండి

Toyota SUVs: హైటెక్‌ హంగులతో హీట్‌ పెంచిన టయోటా ఫార్చ్యూనర్, లెజెండర్‌ - ఈ కార్లు ఇంతకుముందులా లేవు!

Toyota Fortuner And Fortuner Legender: టయోటా ఫార్చ్యూనర్‌ & ఫార్చ్యూనర్ లెజెండర్‌ మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ నెల మూడో వారం నుంచి ప్రారంభం అవుతాయి.

Toyota Fortuner And Legender With 48V Mild-hybrid Tech: టయోటా ఫార్చ్యూనర్ & టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ సొసైటీలో స్టేటస్‌ సింబల్‌లా గుర్తింపు తెచ్చుకున్నాయి. చాలామంది ప్రముఖులు ఈ కార్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు, ఈ రెండు భారీ కార్లు కొత్త మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్స్‌తో రీలాంచ్‌ అయ్యాయి, ఫుల్‌-సైజ్‌ SUV సెగ్మెంట్‌లోకి మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను తీసుకొచ్చాయి. ఈ సిస్టమ్‌తో ఇంధన సామర్థ్యం పెరుగుతుంది, ఉద్గారాలు తగ్గుతాయి & బండి పనితీరు మెరుగుపడుతుంది. ప్రస్తుత వెర్షన్లలోని 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌నే కొత్త వేరియంట్లలో ఉపయోగించినప్పటికీ, 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను కొత్తగా యాడ్‌ చేశారు. ఇంకా అదనపు ఫీచర్లను కూడా కలిపారు. 

మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో మరింత పవర్‌ఫుల్‌గా తయారైన టయోటా ఫార్చ్యూనర్ & టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ కోసం బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి, జూన్‌ మూడో వారం నుంచి డెలివెరీలు స్టార్ట్‌ అవుతాయి.

ధర
టయోటా ఫార్చ్యూనర్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 35.37 లక్షల నుంచి రూ. 51.94 లక్షల మధ్య ఉంటుంది & లెజెండర్ ధర రూ. 44.11 లక్షల నుంచి రూ. 50.09 లక్షల వరకు ఉంటుంది. కొత్త వేరియంట్లలో... టయోటా ఫార్చ్యూనర్ మైల్డ్-హైబ్రిడ్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 44.72 & లెజెండర్ మైల్డ్-హైబ్రిడ్ ఎక్స్‌-షోరూమ్‌ ధర 50.09 లక్షల రూపాయలు.

ఈ వేరియంట్లలో కొత్తగా ఏం యాడ్‌ చేశారు?
ఫార్చ్యూనర్ & లెజెండర్ వేరియంట్లలో అత్యంత కీలక అప్‌డేట్‌ వాటి పవర్‌ట్రెయిన్‌. 2.8-లీటర్‌ డీజిల్‌ 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌ గరిష్టంగా 204 PS పవర్‌ను, 500 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇది 6-స్పీడ్‌ AT ట్రాన్స్‌మిషన్‌తో,  రియర్‌-వీల్‌ డ్రైవ్‌తో (RWD) పరుగులు పెడుతుంది. ఫార్చ్యూనర్ మైల్డ్-హైబ్రిడ్‌లో పవర్ ఔట్‌పుట్‌ మారలేదు. ఇంజిన్, తన ఔట్‌పుట్‌లో 16 PS & 65 Nm స్వల్ప బూస్ట్‌ కోసం ఒక చిన్న బ్యాటరీ ప్యాక్ & ఎలక్ట్రిక్ మోటారుపై ఆధారపడుతుంది. ఫలితంగా చాలా ఈజీ డ్రైవ్‌ ఇస్తుంది. ఇంకా.. ఐడిల్ స్టార్ట్/స్టాప్‌ను యాడ్‌ చేయడం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. 

డిజైన్‌
కొత్త వేరియంట్లలో డిజైన్ పరంగా కనిపించే ఏకైక మార్పు బాడీపై కనిపించే 'నియో డ్రైవ్' బ్యాడ్జ్. డిజైన్ పరంగా ఇతర మార్పులు లేవు.

ఫీచర్లు
ఫార్చ్యూనర్ & లెజెండర్ రెండింటిలోనూ 360-డిగ్రీ కెమెరా ఉంది, వీటిని డీలర్‌షిప్ స్థాయిలో బిగిస్తున్నారు. ఫార్చ్యూనర్‌లో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ కూడా ఉంది, దీనిని కూడా డీలర్‌షిప్ ఫిట్‌మెంట్‌గా అందుబాటులో ఉంచారు. ఇంకా.. మల్టీ-టెర్రైన్ సెలెక్ట్, లెదర్‌ సీట్‌ కవర్లు, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, రియర్ AC వెంట్స్‌తో డ్యూయల్-జోన్ ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ (IRVM) & 11-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. ఇంకో సూపర్‌ టెక్నాలజీ ఏంటంటే.. దీనిలో గెస్చర్‌-కంట్రోల్డ్‌ పవర్డ్ టెయిల్‌గేట్ & ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే (MID) కూడా ఈ వేరియంట్లలో చూడవచ్చు.

అయితే, మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్స్‌ నుంచి వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు తీసేశారు. కచ్చితమైన కారణం తెలియకపోయినా, సీటు కింద మైల్డ్-హైబ్రిడ్ టెక్ కోసం చిన్న బ్యాటరీని అమర్చడం కోసం ఆ వెంటిలేటెడ్‌ సీట్‌ ఫీచర్‌ను తీసేసి ఉండొచ్చని భావిస్తున్నారు. 

భద్రత
ప్రయాణీకుల భద్రత కోసం 7 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

పోటీ కార్లు
టయోటా ఫార్చ్యూనర్ & లెజెండర్ రెండూ MG Gloster, Jeep Meridian, Skoda Kodiaqతో పాటు త్వరలో రాబోయే MG Majestorకు పోటీ ఇస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget