Tork Kratos: మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎంట్రీ - ధర, ఫీచర్లు ఎంతో చూసేయండి!
ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ బ్రాండ్ టోర్క్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టోర్క్ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టోర్క్ క్రేటోస్ డెలివరీలను త్వరలో ప్రారంభించనుంది. పుణేలో ఈ నెలలోనే దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. దీని ధర రూ.1,92,499గా (ఎక్స్-షోరూం) ఉండనుంది. అయితే సబ్సిడీల అనంతరం రూ.1.22 లక్షలకే ఇది లభించే అవకాశం ఉంది. ఇది ఎంట్రీ లెవల్ స్కూటర్ ధర.
ఇందులోనే మరింత పవర్ ఫుల్ వెర్షన్ క్రేటోస్ ఆర్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.2.07 లక్షలుగా ఉండనుంది. స్టాండర్డ్ వెర్షన్ 7.5 కేడబ్ల్యూ అవుట్‌పుట్‌ను అందించనుండగా ఆర్ వేరియంట్ 9 కేడబ్ల్యూ పవర్‌ను అందించనుంది. ఇందులో 4 కేడబ్ల్యూహెచ్ లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. 180 కిలోమీటర్ల రేంజ్‌ను ఇది అందించనుందని కంపెనీ తెలిపింది. అయితే రోడ్డు మీద ఎకో మోడ్‌లో డ్రైవ్ చేస్తే 120 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంది.
0 నుంచి 80 శాతం చార్జింగ్ కేవలం గంటలోపే ఎక్కుతుందని తెలుస్తోంది. అయితే దీని ధర చాలా ఎక్కువ కాబట్టి ఇదే ధరలో వేరే ఎలక్ట్రిక్ బైక్‌లను ట్రై చేయడం బెస్ట్. టోర్క్‌కి, మిగతా బైక్‌లకు ఉన్న ప్రధాన తేడా ఏంటంటే దీని మోటార్, బ్యాటరీ ప్యాక్‌లను టోర్కే ప్రత్యేకంగా రూపొందించింది. అందుకే ఇది మార్కెట్లోకి రావడానికి కాస్త టైం పట్టింది.
ప్రస్తుతం మార్కెట్లో ఇతర కంపెనీలు బైక్‌లను త్వరగా లాంచ్ చేయడానికి విడి భాగాల కోసం వేరే కంపెనీలపై ఆధారపడుతున్నాయి. అయితే టోర్క్ మాత్రం వేర్వేరు నగరాల్లో ఆపరేషన్స్‌ను విస్తరిస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో కంపెనీలు ఎక్కువగా ఉన్నప్పటికీ... వినియోగదారులు వీటి కొనుగోలుపై ఎక్కువ ఆసక్తిని చూపించడం లేదు.
View this post on Instagram
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?