News
News
వీడియోలు ఆటలు
X

Best Bikes: రూ.లక్షలోపు ఈ ఫీచర్ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే - ఇది ఉంటేనే మోడర్న్ బైక్!

ప్రస్తుతం మనదేశంలో రూ.లక్షలోపు బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్న బెస్ట్ బైక్స్ ఇవే.

FOLLOW US: 
Share:

Top 5 two-wheelers with Bluetooth connectivity: ప్రస్తుతం మోడర్న్ టూ వీలర్స్‌ను గుర్తించడానికి ఉన్న ఆప్షన్లలో ముఖ్యమైనది బ్లూటూత్ కనెక్టివిటీ. ఈ ఉపయోగకరమైన ఫీచర్ ద్వారా స్కూటర్‌ను ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్, స్పీడ్ ఎక్సీడింగ్, మిస్డ్ కాల్ అలెర్ట్స్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ వంటి వాటిని పొందవచ్చు. వీటన్నిటినీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చూడవచ్చు.

కొన్ని మోటార్ సైకిల్స్‌లో ఆన్‌లైన్ స్కూటర్ యాప్ ద్వారా, మన బైక్ కండీషన్ ఎలా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఫీచర్‌తో మీరు బడ్జెట్ ధరలో టూ వీలర్ కొనుగోలు చేయాలనుకుంటే రూ. లక్ష లోపు అందుబాటులో ఉన్న ఐదు ఆప్షన్లు ఇవే.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (రూ. 76,346)
హీరో ఇటీవలే కొత్త స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ మోడల్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఈ బైక్‌లో 97.2 సీసీ ఇంజిన్‌ను అందించారు. ఇది 7.92 బీహెచ్‌పీ, 8.05 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. దీని మైలేజ్ కూడా 75 నుంచి 80 కిలోమీటర్ల మధ్య ఉండనుంది.

యమహా ఫ్యాసినో (రూ.88,230)
యమహా ఫ్యాసినో 125 కూడా మంచి సక్సెస్ ఫుల్ స్కూటీనే. డ్రమ్, డిస్క్ వేరియంట్లలో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. అయితే బ్లూటూత్ కనెక్టివిటీ మాత్రం ఫ్యాసినో డిస్క్ వేరియంట్లో మాత్రమే అందించారు. దీని ఎక్స్ షోరూం ధర రూ.88,230గా ఉంది. ఈ స్కూటీలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. యమహా వై కనెక్ట్ యాప్ ద్వారా కాల్, ఎస్ఎంఎస్, ఈమెయిల్, ఫోన్ బ్యాటరీ పర్సంటేజ్ వంటివి చూసుకోవచ్చు.

సుజుకి యాక్సెస్ 125 (రూ.85,500)
ఇది కూడా సుజుకి బ్రాండ్ ఎంట్రీ లెవల్ స్కూటరే. స్టాండర్డ్, స్పెషల్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ ఎడిషన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ మాత్రం రైడ్ కనెక్ట్ ఎడిషన్‌లోనే అందుబాటులో ఉంది. కాలర్ ఐడీ, ఫోన్ బ్యాటరీ లెవల్, స్పీడ్ ఎక్సీడింగ్ అలెర్ట్, కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ అలెర్ట్, టర్న్ బై టర్న్ నేవిగేషన్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సుజుకి అవెనిస్ రేస్ ఎడిషన్ (రూ.92,300)
సుజుకి అవెనిస్ రేస్ ఎడిషన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవే స్టాండర్డ్, రేస్ ఎడిషన్. సుజుకి రైడ్ కనెక్ట్ రేస్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ (రూ.92,891)
ఫీచర్లు అద్భుతంగా ఉండే టీవీఎస్ ఉత్పత్తుల్లో ఎన్‌టార్క్ 125 ఒకటి. స్పోర్ట్, స్ట్రీట్ మోడళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. కాల్స్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ అలెర్ట్స్, నేవిగేషన్ అసిస్ట్, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర కూడా రూ. లక్ష లోపే ఉంది.

దేశీయ మార్కెట్లో 100 సీసీ సెగ్మెంట్ బైక్‌లు అత్యధికంగా అమ్ముడు అవుతున్నాయి. హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా ఈ సెగ్మెంట్‌లో ముందంజలో ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో అత్యధికంగా ప్రజలు ఇష్టపడే బైక్‌లు ఇవే. కాబట్టి ఈ విభాగంలో హోండా షైన్, స్ప్లెండర్, బజాజ్ ప్లాటినాకు గట్టి పోటీనిస్తుంది. ఇప్పుడు హోండా షైన్‌లో కొత్త వేరియంట్ లాంచ్ అయింది.

Published at : 20 Mar 2023 05:03 PM (IST) Tags: TVS Yamaha Hero Bluetooth Ntorq Splendor Best Bikes With Bluetooth Connectivity

సంబంధిత కథనాలు

Upcoming Electric Cars: రూ.20 లక్షల లోపు రాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే - ఫీచర్స్ అద్భుతం

Upcoming Electric Cars: రూ.20 లక్షల లోపు రాబోయే ఎలక్ట్రిక్ కార్లు ఇవే - ఫీచర్స్ అద్భుతం

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!

Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ -  కొనాలంటే ఇదే రైట్ టైం!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!