అన్వేషించండి

రేసు గుర్రం లాంటి శక్తి: ఇండియాలో పవర్‌ఫుల్‌ సింగిల్‌ సిలిండర్‌ మోటార్‌సైకిళ్లు ఇవే

భారత్‌లో, ప్రస్తుతం అమ్ముడవుతున్న అత్యంత శక్తిమంతమైన సింగిల్‌ సిలిండర్‌ బైక్‌లు ఏవో తెలుసా? ధర రూ.2 లక్షల లోపు నుంచి రూ.17 లక్షల పైగా ఉన్న టాప్‌ 5 బైక్‌ల పూర్తి వివరాలు ఇవి.

Most powerful single cylinder bikes India: సాధారణంగా, సింగిల్‌ సిలిండర్‌ బైక్‌ అంటే తక్కువ ఖర్చుతో నడిచే కమ్యూటర్‌ లేదా పాతకాలపు రెట్రో బైక్‌ అనే భావన చాలామందికి ఉంటుంది. కానీ ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఉన్న కొన్ని సింగిల్‌ సిలిండర్‌ మోటార్‌సైకిళ్లు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేశాయి. పవర్‌, టెక్నాలజీ, రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అన్నింటిలోనూ ఇవి మల్టీ-సిలిండర్‌ బైక్‌లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. రూ. 2 లక్షలలోపు నుంచి రూ. 17 లక్షలకు పైగా ధర ఉండి, భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సింగిల్‌ సిలిండర్‌ బైక్‌ల టాప్‌-5 లిస్ట్‌ ఇది.

5. Triumph Thruxton 400 -- 42hp

ధర: రూ.2.76 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఈ లిస్ట్‌లో తక్కువ పవర్‌ ఉన్న బైక్‌ ఇదే. అయినప్పటికీ Thruxton 400 మోటార్‌సైకిల్‌ 42hp పవర్‌ ఉత్పత్తి చేస్తుంది. భారత్‌లో అమ్మకంలో ఉన్న సింగిల్‌ సిలిండర్‌ ట్రయంఫ్‌ బైక్‌లలో ఇది ప్రత్యేకమైన ఇంజిన్‌ ట్యూన్‌ పొందింది. రెట్రో లుక్‌తో పాటు స్పోర్టీ పనితీరు కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.

4. Bajaj Pulsar NS400Z -- 43hp

ధర: రూ.1.94 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

లాంచ్‌ అయిన ఏడాదిలోపే బజాజ్‌ ఈ బైక్‌ను అప్‌డేట్‌ చేసింది. మెరుగైన బ్రేకులు, టైర్లు ఇవ్వడంతో పాటు పవర్‌ను కూడా పెంచింది. ఇప్పుడు 43hpతో వచ్చే NS400Zలో కొత్త Sport రైడింగ్‌ మోడ్‌ ఉంది. ఇది మరింత అగ్రెసివ్‌ మ్యాపింగ్‌తో రైడింగ్‌ను ఉత్సాహంగా మారుస్తుంది. ఈ ధరకు ఇంత పవర్‌ అంటే ఇది నిజంగా 'వాల్యూ ఫర్‌ మనీ'.

3. BSA Gold Star 650 -- 45hp

ధర: రూ.3.10 లక్షలు – రూ.3.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఈ బైక్‌లో ఉన్న 652cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ మిడ్‌రేంజ్‌ టార్క్‌పై ఎక్కువ దృష్టి పెడుతుంది. హై రేవ్‌ పవర్‌ కంటే స్మూత్‌, శక్తిమంతమైన పుల్‌ ఇవ్వడం దీని ప్రత్యేకత. పాత బ్రిటిష్‌ సింగిల్‌ బైక్‌ల ఫీల్‌ను ఆధునిక టెక్నాలజీతో ఇస్తుంది.

2. KTM 390 Duke -- 46hp

ధర: రూ.2.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

2013లో లాంచ్‌ అయినప్పటి నుంచి భారత స్పోర్ట్‌బైక్‌ సీన్‌ను మార్చేసిన బైక్‌ ఇది. తాజా 390 డ్యూక్‌ 46hp పవర్‌తో వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో వేగం, అగ్రెసివ్‌ రైడింగ్‌ కోరుకునే వారికి ఇది ఇంకా బెస్ట్‌ ఆప్షన్‌. ఇదే ఇంజిన్‌తో వచ్చే 390 Adventure, Husqvarna Svartpilen 401 కూడా మంచి ఎంపికలే.

1. Ducati Hypermotard 698 Mono -- 77.5hp

ధర: రూ.17.63 లక్షలు - రూ.18.70 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)

ఈ లిస్ట్‌లో అగ్రస్థానం దక్కించుకున్న బైక్‌ ఇదే. 659cc సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో 77.5hp ఉత్పత్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. 1299 Panigale నుంచి ప్రేరణ పొందిన ఈ ఇంజిన్‌ అసాధారణమైన రైడింగ్‌ అనుభూతిని ఇస్తుంది. మన రోడ్ల పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కొనే ఛాసిస్‌తో ఇది నిజంగా ప్రత్యేకమైన స్ట్రీట్‌ బైక్‌. అయితే దీనికి భారీ బడ్జెట్‌ అవసరం.

మొత్తంగా, సింగిల్‌ సిలిండర్‌ బైక్‌లు అంటే ఇక కేవలం సాధారణ కమ్యూటర్లు మాత్రమే కాదు. పవర్‌, స్టైల్‌, టెక్నాలజీ అన్నింటినీ కోరుకునే రైడర్లకు ఇప్పుడు భారత మార్కెట్‌లో బలమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Bhogapuram Airport Photos: 2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలివే
2203 ఎకరాలు.. 275 కి.మీ వేగంతో వీచే గాలులను తట్టుకునేలా నిర్మాణం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ విశేషాలు
Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
CWG Javelin Glory: నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
నీరజ్ చోప్రాకు సిల్వర్.. డెబ్యూట్ బాయ్ యష్ వీర్ సింగ్ కు బ్రాంజ్, రిజ‌ల్ట్స్ పై నీర‌జ్ స్పంద‌న ఇదే..!
Embed widget