అన్వేషించండి

Entry Level SUV’s: రూ. 8 లక్షల లోపు అదిరిపోయే SUVలు ఇవే! చూసి, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి!

భారతీయ మార్కెట్లో SUVలకు జనాదరణ పెరిగింది. ప్రస్తుతం ఈ వాహనాలు 40 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. రూ. 8 లక్షల్లోపు అదిరిపోయే SUVలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భారతీయ వాహన మార్కెట్లో SUVలకు వినియోగం బాగా పెరిగింది. సరసమైన ధరలోనూ ఈ వాహనాలు లభించడంతో వినియోగదారులు వాటినే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాలు 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. త్వరలో ఆటోమోటివ్ విభాగంలో మార్కెట్ లీడర్లుగా అవతరించే అవకాశం ఉంది. ఇందులో హాచ్‌ బ్యాక్‌లకు సమానమైన ధర ఉన్న ఎంట్రీ-లెవల్ మోడల్‌లు కూడా ఉన్నాయి. టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, హ్యుందాయ్ వెన్యూ,  కియా సోనెట్ భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన టాప్ 5 ఎంట్రీ-లెవల్ SUVలు. ప్రతి మోడల్ పెట్రోల్, డీజిల్‌తో సహా వివిధ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. 2023 భారతీయ మార్కెట్‌లో  కొనుగోలు చేయగల టాప్ 5 అత్యంత సరసమైన ఎంట్రీ లెవల్ SUVలు ఏవో ఇప్పుడు చూద్దాం..

1.టాటా పంచ్ - రూ. 5.99 లక్షలు

టాటా పంచ్ అనేది టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ SUV. దీని ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 5.99 లక్షలు. కంపెనీ ఈ మైక్రో SUVని వారి ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగో ధరల శ్రేణిలో అందిస్తోంది.   దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కస్టమర్ బేస్‌ను ఈ కారు కలిగి ఉంది. ఒకే ఇంజన్ ఎంపిక, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్ ఎంపికతో అందించబడుతుంది.

2.నిస్సాన్ మాగ్నైట్ - రూ. 5.99 లక్షలు

నిస్సాన్ మాగ్నైట్ భారత్ లో ఓ రేంజిలో అమ్మకాలు కొనసాగిస్తోంది. మాగ్నైట్ భారతీయ మార్కెట్లో కంపెనీకి బ్రేకవుట్ ఉత్పత్తిగా చెప్పుకోవచ్చు. నిస్సాన్ నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ SUV సమకాలీన జపనీస్ రూపాన్ని కలిగి ఉంది. దీని ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధర రూ. 5.99 లక్షలు. ఇది టాటా పంచ్‌ మాదిరిగానే భారతీయ మార్కెట్లో అత్యంత సరసమైన SUV.  నిస్సాన్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మాగ్నైట్‌ను అందిస్తుంది.  1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

3.రెనాల్ట్ కిగర్- రూ. 6.49 లక్షలు

రెనాల్ట్ కిగర్ నుంచి  భారతీయ మార్కెట్లో విడుదలైన ఎంట్రీ లెవల్ SUV. దీని ప్రారంభ(ఎక్స్-షోరూమ్) ధర రూ.6.49 లక్షలు. రెనాల్ట్ కిగర్‌ను రెండు ఇంజన్ ఎంపికలతో అందిస్తుంది. ఒకటి 1.0L  పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇది  5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్, 5-స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.  మరొకటి 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.  ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌ మిషన్, CVTతో జతచేయబడి ఉంటుంది.

4.హ్యుందాయ్ వెన్యూ - రూ. 7.68 లక్షలు

భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ అనేది ఎంట్రీ లెవల్ SUV. దీని ప్రారంభ(ఎక్స్-షోరూమ్) ధర రూ.7.68 లక్షలు. హ్యుందాయ్ మూడు ఇంజన్ ఎంపికలతో వెన్యూను అందిస్తుంది. అందులో ఒకటి 114.41 bhp, 250 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.5L డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. మరొకటి  81.86 bhp, 114 Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్. ఇంకొకటి 1.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ b21 ఇంజన్ ను కలిగి ఉంటుంది.

5.కియా సోనెట్ - రూ. 7.79 లక్షలు

కియా సోనెట్ భారతీయ మార్కెట్లో సబ్-4M SUV.  దీని ప్రారంభ(ఎక్స్-షోరూమ్) ధర రూ.7.79 లక్షలు. కియా హ్యుందాయ్ వెన్యూ వంటి ఇంజన్ ఎంపికలతో సోనెట్‌ను అందిస్తుంది.  81.86 bhp,  114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్, 114.41 bhp, 250 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే 1.5L డీజిల్ ఇంజన్, 1.0L టర్బో పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటుంది.   

Read Also: సెకండ్ హ్యాండ్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

టాప్ హెడ్ లైన్స్

2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు
2026 Toyota Glanza Facelift లుక్‌ అదిరిపోయింది.. కొత్త ఇంజిన్, ADAS ఫీచర్లు, CNG ఆటోమేటిక్ కూడా!
2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ లాంచ్‌.. ధర రూ.6.99 లక్షలే! కేవలం రూ.11,000తో బుక్‌ చేసుకోవచ్చు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Embed widget