Top 5 Sunroof Cars: ప్రీమియం పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న బడ్జెట్ కార్లు ఇవే - టాప్-5 లిస్టులో ఏమేం ఉన్నాయి?
Affordable Cars With Panoramic Sunroof: ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ రూ.20 లక్షల్లోపు కార్లలో కూడా ఉంది.
Panoramic Sunroof Cars: ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ ప్రకారం కొత్త కారును కొనుగోలు చేసే వినియోగదారులు కచ్చితంగా ఉండాలని కోరుకునే ఫీచర్ పనోరమిక్ సన్‌రూఫ్. సింగిల్ పేన్ సన్‌రూఫ్ ఫీచర్ రూ.10 లక్షల్లోపు కార్లలో కూడా అందుబాటులో ఉంది. అయితే పనోరమిక్ యూనిట్ ఇప్పటికీ ప్రీమియం ఫీచర్. అయితే ఇది కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న కార్లలో తక్కువ ధర ఉన్న ఐదు కార్లు ఒకసారి చూద్దాం.
ఎంజీ ఆస్టర్ (MG Astor)
ఎంజీ దాని ఆప్షనల్ వేరియంట్‌లతో దాని కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆస్టర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుంది. ఐదు వేరియంట్లలో మిడ్ స్పెక్ ఆప్షన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ 110 పీఎస్ పవర్ జనరేట్ చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.12.98 లక్షలుగా ఉంది.
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
హ్యుందాయ్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ క్రెటాలో పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంది. ఇది క్రెటా అందిస్తున్న ఎస్(వో) వేరియంట్‌తో అందుబాటులో ఉంది. ఇది మిడ్ స్పెక్ ఎస్ వేరియంట్ పైన ఉంటుంది. సన్‌రూఫ్ కోసం వాయిస్ ఎనేబుల్డ్ ఫంక్షనాలిటీ హై స్పెక్ ఎస్ఎక్స్ వేరియంట్ నుంచి ప్రారంభం అవుతుంది. ఎస్(వో) వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.14.32 లక్షలుగా ఉంది.
2024 కియా సెల్టోస్ (2024 Kia Seltos)
సెల్టోస్ 2023లో దాని ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌తో పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌ను పొందింది. కియా దీనిని టెక్ లైన్ ఎస్‌యూవీలకు సంబంధించిన మిడ్ స్పెక్ హెచ్‌టీఎక్స్ వేరియంట్‌లో అందిస్తుంది. ఈ వేరియంట్‌లో 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ లేదా 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.15.20 లక్షలుగా నిర్ణయించారు.
మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)
మారుతి సుజుకి ఎస్‌యూవీ అందిస్తున్న టాప్ ఆఫ్ ది లైన్ ఆల్ఫా వేరియంట్ అయిన గ్రాండ్ విటారాతో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించవచ్చు. ఈ వేరియంట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 103 పీఎస్ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని ఆల్ఫా వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.51 లక్షలు.
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder)
గ్రాండ్ విటారా రీబ్యాడ్జ్డ్ మోడల్ అయిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ టాప్ స్పెక్ వీ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందింది. గ్రాండ్ విటారా లాగానే ఇది 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉన్న మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 103 పీఎస్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. టయోటా అర్బన్ క్రూయిజ్ హైరైడర్‌కు సంబంధించి సన్ రూఫ్ ఫీచర్ లభించే వీ వేరియంట్ ధర రూ. 16.04 లక్షలుగా నిర్ణయించారు.