Top 3 Cars Under 8 Lakh: రూ.8 లక్షల్లోపు బెస్ట్ బడ్జెట్ కార్లు ఇవే - టాప్-3లో ఏమేం ఉన్నాయో తెలుసా?
Top 3 Cars Under 8 Lakh In India: రూ.8 లక్షల్లోపు ధరలో మనదేశంలో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బెస్ట్ కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాప్-3 లిస్టులో టాటా, మారుతి, మహీంద్రా కార్లు ఉన్నాయి.
Best Cars Under 8 Lakh In India: దీపావళి సందర్భంగా చాలా మంది బంగారం, వెండితో చేసిన వస్తువులతో పాటు కొత్త కార్లను కూడా కొనుగోలు చేస్తారు. ధన్‌తేరస్, దీపావళి సందర్భంగా కొత్త కారు కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. అయితే కారు కొనడానికి ముందు ప్రజలు ముందుగా ఆలోచించేది దానికి అవసరమైన బడ్జెట్ గురించి. కారు కొనడానికి మీ బడ్జెట్ దాదాపు రూ. 8 లక్షలు అయితే, భారతీయ మార్కెట్లో ఈ రేంజ్‌లో చాలా కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో టాటా, మారుతి నుంచి మహీంద్రా వరకు అనేక కార్లు ఉన్నాయి. వీటిలో బెస్ట్ ఏవో ఇప్పుడు చూద్దాం.
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift)
మారుతి సుజుకి స్విఫ్ట్ రూ. 8 లక్షల రేంజ్‌లో వచ్చే కారు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు తొమ్మిది కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్ అందించారు. ఈ కారు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 25.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ మారుతి కారులో సెక్యూరిటీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.
టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. ఈ కారుకు సంబంధించి మొత్తంగా 100 వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉండటం విశేషం. ఈ కారును ఐదు కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. టాటా కార్లు సెక్యూరిటీ విషయంలో మాత్రం చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా అందించారు. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7,99,990 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో (Mahindra XUV 3XO)
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో మూడు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ కారులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 82 కేడబ్ల్యూ శక్తిని, 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 1.2 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 96 కేడబ్ల్యూ పవర్, 230 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఈ మహీంద్రా కారులో 1.5 లీటర్ టర్బో డీజిల్ కూడా ఉంది. ఇది 86 కేడబ్ల్యూ పవర్, 300 ఎన్ఎం టార్క్‌ను కూడా ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.79 లక్షల నుంచి మొదలై రూ. 15.49 లక్షల వరకు ఉంటుంది.
ఈ మూడు కార్లూ మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్ల లిస్ట్‌లో కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?