అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరలో ADAS టెక్నాలజీ కార్లు - టాప్‌-10 లిస్ట్‌, రూ.9 లక్షల నుంచే

ADAS అంటే ఫ్యూచర్‌ సేఫ్టీ టెక్నాలజీ. ఇప్పుడు రూ.9 లక్షల నుంచే ఈ ఫీచర్‌తో కార్లు లభిస్తున్నాయి. హోండా, హ్యుందాయ్‌, కియా, టాటా వంటి బ్రాండ్లు అందిస్తున్న ఈ 10 కార్లు ఏవో తెలుసుకుందాం.

Cheapest ADAS Cars In India In 2025: భారతదేశంలో ఆటోమొబైల్‌ మార్కెట్‌ వేగంగా మారిపోతోంది. ఇప్పుడు కేవలం పవర్‌, లుక్స్‌ మాత్రమే కాదు - సేఫ్టీ కూడా చాలా ముఖ్యమైంది. పెరుగుతున్న వాహనాల రద్దీ, ఆధునిక కార్ల వేగం నడుమ డ్రైవర్‌తో పాటు ప్రయాణీకుల భద్రత కూడా ముఖ్యం. అందుకే ADAS (Advanced Driver Assistance Systems) టెక్నాలజీని మధ్యస్థ ధరల్లోనే అందించడం మొదలుపెట్టాయి ప్రముఖ కార్‌ కంపెనీలు. ఈ టెక్నాలజీ డ్రైవర్‌కు సహకరించి, ప్రమాదాల అవకాశాన్ని తగ్గిస్తుంది. ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, బ్లైండ్‌ స్పాట్‌ మానిటరింగ్‌, అడాప్టివ్‌ క్రూయిజ్‌ కంట్రోల్‌ సహా చాలా మోడ్రన్‌ ఫీచర్లు ADAS సూట్‌లో భాగంగా వస్తాయి.

ఇప్పుడు, కేవలం రూ.9 లక్షల నుంచే ఈ హైటెక్‌ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్న టాప్‌ 10 కార్లు ఇవి:

10. MG Astor - ₹15.16 లక్షలు

2021లో ADASతో వచ్చిన తొలి SUV ఇదే. Level 2 ADAS కలిగిన Savvy Pro వేరియంట్‌లో 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, CVT ట్రాన్స్‌మిషన్‌ లభిస్తుంది.

9. Honda Elevate - ₹14.8 - ₹16.06 లక్షలు

ZX టాప్‌ వేరియంట్‌లో ADAS అందిస్తున్నారు. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో మాన్యువల్‌, CVT ఆప్షన్లు ఉన్నాయి. బ్లాక్‌ ఎడిషన్‌ కూడా ఆకర్షణీయంగా ఉంది.

8.  Kia Syros - ₹14.56 - ₹15.94 లక్షలు

HTX+(O) టాప్‌ వేరియంట్‌లో Level 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. 1.0 టర్బో పెట్రోల్‌, 1.5 డీజిల్‌ ఇంజిన్‌లతో DCT లేదా TC గేర్‌బాక్స్‌ అందుబాటులో ఉన్నాయి.

7. Hyundai Venue - ₹14.56 - ₹15.69 లక్షలు

HX 10 వేరియంట్‌లో Level 2 ADAS ఫీచర్లు వస్తాయి. 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ లేదా 1.5 లీటర్‌ డీజిల్‌ ఆప్షన్లు. డ్రైవింగ్‌లో అదనపు సేఫ్టీ ఫీలింగ్‌ ఇస్తుంది.

6. Hyundai Verna - ₹14.35 - ₹16.98 లక్షలు

SX(O) వేరియంట్‌లో Level 2 ADAS. 1.5 లీటర్‌ పెట్రోల్‌, 160 hp టర్బో వేరియంట్‌లతో MT/DCT ఆప్షన్లు ఉన్నాయి. ఫీచర్‌ల పరంగా ఈ సెగ్మెంట్‌లో ఇది లీడర్‌.

5. Tata Nexon - ₹13.53 -  ₹14.15 లక్షలు

Fearless+ PS ట్రిమ్‌లో Level 2 ADAS అందుబాటులో ఉంది. 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో DCT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ ఉంది. డీజిల్‌ వేరియంట్‌లో మాత్రం ఈ ఫీచర్‌ లేదు.

4. Kia Sonet - ₹13.51 - ₹14.09 లక్షలు

GTX+, X-Line వేరియంట్‌లలో Level 1 ADAS ఉంది. 1.0 టర్బో పెట్రోల్‌, 1.5 డీజిల్‌ ఇంజిన్‌లతో ఆటోమేటిక్‌ ఆప్షన్లు మీ ముందుకు వస్తాయి.

3. Honda City - ₹12.69 -  ₹16.07 లక్షలు

SV వేరియంట్‌ తప్ప అన్ని మోడళ్లలో ADAS లభిస్తుంది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ MT/CVT ఆప్షన్లు. స్మూత్‌ రైడ్‌, సేఫ్‌ డ్రైవింగ్‌ రెండింటినీ కలిపిన కాంబినేషన్‌ ఈ కార్‌.

2. Mahindra XUV 3XO - ₹11.5 - ₹14.4 లక్షలు

AX5 L, AX7 L వేరియంట్‌లలో Level 2 ADAS ఉంది. 1.2 టర్బో పెట్రోల్‌, 1.5 డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉన్నాయి. భారతీయ రోడ్లకు సరిపోయే SUV ఇది.

1. Honda Amaze (3rd Gen) - ₹9.15 - ₹10 లక్షలు

దేశంలోనే తక్కువ ధరలో ADAS కలిగిన కారు ఇదే. ZX వేరియంట్‌లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో MT/CVT ఆప్షన్లు లభిస్తాయి.

రూ.9 లక్షల నుండి రూ.16 లక్షల మధ్యలో సేఫ్టీతో కూడిన ఈ కార్లు కుటుంబ డ్రైవ్‌కి పర్ఫెక్ట్‌. భవిష్యత్‌ టెక్నాలజీ ఇప్పుడు మన బడ్జెట్‌లోకి వచ్చేసింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
R15 కంటే పవర్‌ఫుల్ బైక్.. Yamaha R2 ని కేవలం రూ.10,000 తో బుక్‌ చేసుకోవచ్చు
కేవలం రూ.10,000 మీ దగ్గర ఉంటే చాలు, రూ.2 లక్షల Yamaha R2 మీ సొంతం!
Mahindra XUV700 Price on Road: మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
మహీంద్రా XUV700 కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది? EMI లెక్కేంటీ?
అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో Ampere Magnus G Max అప్‌డేట్‌ వెర్షన్‌.. రేటు రూ.1.10 లక్షలు, చాలా స్పెషాలిటీలు
రూ.1.10 లక్షలకే ఆంపియర్‌ మాగ్నస్‌ G మ్యాక్స్‌.. ఇంతకుముందులా లేదు, 30కి పైగా కొత్త ఫీచర్లు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget