Safest Cars in India: సేఫెస్ట్ కారు కొనాలనుకుంటున్నారా? - ఈ ఐదు ఎస్‌యూవీలపై ఓ లుక్కేయండి!
ప్రస్తుతం మనదేశంలో టాప్ ఫైవ్ సేఫెస్ట్ ఎస్‌యూవీ కార్లు ఇవే.
Top 5 Safest Cars in India: దేశంలోని కస్టమర్లు ఇప్పుడు కారు కొనుగోలు చేసేటప్పుడు సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మీరు కూడా కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొంది మన దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ కార్ల గురించి తెలుసుకుందాం. మహీంద్రా స్కార్పియో ఎన్, టాటా ఆల్ట్రోజ్ భారతదేశంలో అందుబాటులో ఉన్న రెండు సురక్షితమైన కార్లు. ఈ లిస్ట్‌లో ఏయే కార్లు ఉన్నాయో చూద్దాం.
మహీంద్రా ఎక్స్‌యూవీ700
ఈ జాబితాలో మొదటి కారు మహీంద్రా ఎక్స్‌యూవీ700. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను, పిల్లల రక్షణ కోసం ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 రెండు ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో రానున్నాయి. ధర గురించి చెప్పాలంటే మహీంద్రా XUV700 ఎక్స్ షోరూమ్ ధర రూ. 14 లక్షల నుంచి రూ. 26.18 లక్షల మధ్యలో ఉంది.
మహీంద్రా స్కార్పియో ఎన్
మహీంద్రా స్కార్పియో ఎన్‌ను ఇటీవలే తాజా గ్లోబల్ ఎన్‌సీఎపీలో టెస్ట్ చేశారు. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను, పిల్లల రక్షణ కోసం ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. స్కార్పియో ఎన్ పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే ఇది రెండు ఇంజన్ ఆప్షన్‌లతో మార్కెట్లోకి రానుంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో పెయిర్ అయ్యాయి. మహీంద్రా స్కార్పియో ఎన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.05 లక్షల నుంచి రూ. 24.51 లక్షల మధ్య ఉంటుంది.
టాటా పంచ్
ఈ లిస్టులో మూడో కారు గురించి చెప్పాలంటే టాటా మోటార్స్ ఇటీవలే లాంచ్ చేసిన పంచ్ మైక్రో ఎస్‌యూవీ. పంచ్ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్, పిల్లల ప్రొటెక్షన్ కోసం ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.52 లక్షల మధ్య ఉంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ300
మహీంద్రా ఎక్స్‌యూవీ300 కూడా ఈ లిస్టులో ఉంది. ఈ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఫైవ్ స్టార్, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను సాధించింది. మహీంద్రా మహీంద్రా ఎక్స్‌యూవీ300 రెండు ఇంజన్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 1.2 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్, టర్బో డీజిల్ ఇంజన్ ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్ గురించి చెప్పాలంటే రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఏఎంటీ ఆప్షన్‌ను పొందుతాయి.
టాటా ఆల్ట్రోజ్
ఈ జాబితాలోని చివరి కారు టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఆల్ట్రోజ్. ఇది పెద్దల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఫైవ్ స్టార్, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ హ్యాచ్‌బ్యాక్ మూడు ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. ఇందులో 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.2 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయి.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial