By: ABP Desam | Updated at : 11 Sep 2021 12:23 PM (IST)
Electric_Vehicles_1
నేను ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నా.. కొన్ని సంవత్సరాల క్రితం ఈ మాట చెప్తే అదెందుకు కొన్నావ్ అన్నట్లు పై నుంచి కింద దాకా చూసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ మాట చెప్తే మంచి పని చేశావు అని మెచ్చుకుంటున్నారు. దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లకు గిరాకీ పెరిగింది.
దీనికితోడు ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్ అంత ఆకట్టుకునే విధంగా ఉండేవి కాదు. ఇప్పుడు వీటిని ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మనదేశంలో అందుబాటులో ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
1. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రో
మనదేశంలో ఆన్ లైన్ ట్యాక్సీ సర్వీసుల్లో ఓలా ముందంజలో ఉంది. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోకి కూడా అడుగుపెట్టి ఓలా ఎలక్ట్రిక్ ఎస్1, ఎస్1 ప్రోలను లాంచ్ చేసింది. వీటిలో ఎస్1 ధర రూ.99,999 కాగా, ఎస్1 ప్రో ధర రూ.1,29,999గా ఉంది. దీని కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని కూడా ఇస్తుంది.
ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఎస్1ను 121 కిలోమీటర్లు, ఎస్1 ప్రోను 181 కిలోమీటర్లు డ్రైవ్ చేయవచ్చు. ఎస్1ను పూర్తిగా చార్జ్ చేయడానికి 4.48 గంటలు, ఎస్1 ప్రోకు 6.30 గంటలు పట్టనుంది.
2. సింపుల్ వన్
దీని బ్యాటరీ, రేంజ్ చాలా ఎక్కువని చెప్పవచ్చు. 4.8kWh బ్యాటరీని ఇందులో అందించారు. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే ఏకంగా 236 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేయవచ్చు. దీని ధర రూ.1.09 లక్షలుగా ఉంది. ఇందులో రెండు బ్యాటరీ ఉంటాయి. వీటిలో ఒకదాన్ని తీసి చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని టాప్ స్పీడ్ 105 కిలోమీటర్లుగా ఉండనుంది.
3. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్
ఇందులో అర్బన్ వేరియంట్ ధర రూ.1.42 లక్షలుగానూ, ప్రీమియం వేరియంట్ ధర రూ.1.44 లక్షలుగానూ ఉంది. పూర్తిగా చార్జ్ చేసి ఎకో మోడ్ లో డ్రైవ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. అదే స్పోర్ట్ మోడ్ లో 85 కిలోమీటర్లు డ్రైవ్ చేసే అవకాశం ఉంది. దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి ఐదు గంటల సమయం పట్టనుంది.
4. టీవీఎస్ ఐక్యూబ్
దీని ధర రూ.1.15 లక్షలుగా ఉంది. దీన్ని పూర్తిగా చార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. పూర్తిగా చార్జ్ చేశాక 75 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేయవచ్చు. ఐదు గంటల్లో దీని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది.
5. ఏథర్ 450ఎక్స్
దీని ధర రూ.1.32 లక్షలుగా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 2.61kWhగా ఉంది. 3 గంటల 35 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ ఎక్కుతుంది. పూర్తిగా చార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేయవచ్చు. దీని టాప్ స్పీడ్ 80 కిలోమీటర్ల వరకు ఉండనుంది.
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈసారి మరిన్ని కొత్త రంగుల్లో!
Also Read: గుడ్ న్యూస్.. ఈ బడ్జెట్ రియల్ మీ ఫోన్ పై భారీ ఆఫర్.. ఏకంగా రూ.6 వేల వరకు!
Also Read: OnePlus: వన్ప్లస్ నుంచి రూ.20 వేల లోపు ధరలో స్మార్ట్ ఫోన్లు.. వచ్చే ఏడాది ఎంట్రీ..
Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!
Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!
Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు