అన్వేషించండి

Best Selling Cars in 2023: మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే - కొత్త కార్లు కొనాలనుకునేవారు ఆప్షన్లు చూసుకోండి!

మనదేశంలో కార్ల మార్కెట్ రకరకాల మార్పులకు గురి అయింది. ప్రస్తుతం మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఏవో తెలుసా?

Best Selling Cars in Different Segments in 2023: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భారతదేశంలో క్రమంగా బలపడుతోంది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అనేక మార్పులను చవిచూసింది. ఈ వాహనాల విక్రయాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు (Electric and Hybrid Cars)
2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (BEV) అమ్మకాలు మొదటిసారిగా 10 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో 24,028 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 రెండో త్రైమాసికంలో 26,794 యూనిట్లు అమ్ముడుపోగా, మూడో క్వార్టర్‌కు కాస్త తగ్గాయి. మరోవైపు బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు 20,022 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో టయోటా ముందంజలో ఉంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, బలమైన హైబ్రిడ్ ఈవీల సంయుక్త విక్రయాలు దాదాపు 4.2 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.

ముందంజలో టియాగో ఈవీ, ఇన్నోవా హైక్రాస్
టాటా టియాగో ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్‌గా నిలిచింది. అయితే టయోటా ఇన్నోవా హైక్రాస్ 2023 మూడో త్రైమాసికంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బలమైన హైబ్రిడ్ ఈవీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ రెండు మోడల్స్ వాటి సంబంధిత సెగ్మెంట్‌ల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లుగా నిలిచాయి. 2023లో మొదటి తొమ్మిది నెలలకు టియాగో ఈవీ తన విభాగంలో 41 శాతం, ఇన్నోవా హైక్రాస్ తన విభాగంలో 44 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ ఆప్షన్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ 4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది.

పెట్రోల్, డీజిల్ కార్లు
2023లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ కార్ల విభాగంలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మారుతి స్విఫ్ట్ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. ఇది ఏడు శాతం మార్కెట్ వాటాను పొందింది. ఇప్పుడు కంపెనీ తదుపరి తరం స్విఫ్ట్‌ను 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఉండనుంది. ఈ ఇంజిన్‌తో ఇది భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్య కారుగా అవతరిస్తుంది. 2024 స్విఫ్ట్ ఇటీవల జపాన్‌లో దాని కాన్సెప్ట్ రూపంలో పరిచయం అయింది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ విభాగంలో మహీంద్రా బొలెరో సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. డీజిల్ మార్కెట్లో మొత్తం 81,344 యూనిట్ల విక్రయాలతో 16 శాతం వాటాను సాధించింది.

సీఎన్‌జీ కార్లు
అంతేకాకుండా సీఎన్‌జీ కూడా భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఇష్టపడే ఇంధన ఎంపికగా మారింది. 2023లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అత్యధికంగా అమ్ముడైన సీఎన్‌జీ కారు. 66,406 యూనిట్ల అమ్మకాలతో 17 శాతం మార్కెట్ వాటాను సాధించింది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP DesamTirumala Ghee Adulteration Case | తిరుమల లడ్డూ కల్తీ కేసులో నలుగురు అరెస్ట్ | ABP DesamMadhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: శ్రీవారి  లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
శ్రీవారి లడ్డూ ప్రసాద నెయ్యి కల్తీ కేసులో సీబీఐ సిట్ దూకుడు - సూత్రధారుల వేట ప్రారంభం !
Chilkur Balaji Temple Chief Priest Rangarajan : రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
Lakshmi Arrest: కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
కిరణ్ రాయల్ పై ఫిర్యాదు చేసిన లక్ష్మి అరెస్ట్- తిరుపతిలో అదుపులోకి తీసుకున్న జైపూర్ పోలీసులు
KTR Visits Chilukuru Temple: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవంటూ ఆగ్రహం
Maha Kumbh: ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ - మహాకుంభమేళాలో మరో రికార్డు !
ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ - మహాకుంభమేళాలో మరో రికార్డు !
Vishwaksen: 'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
'మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు' - 'బాయ్ కాట్ లైలా' స్పందించిన మూవీ టీం, సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్
Ram Gopal Varma: సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
సీఐడీతోనే గేమ్సా ? - రామ్ గోపాల్ వర్మ పరిస్థితేంటి ?
UK : యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ  బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
యూకేలో అక్రమంగా పని చేస్తున్న వారందరికీ బ్యాడ్ న్యూస్ - అమెరికా తరహాలో గెంటేయాలని ప్రధాని స్టార్మర్ నిర్ణయం
Embed widget