అన్వేషించండి

Tesla Model Y: టెస్లా మోడల్ Y ధర రూ.15 లక్షలు తగ్గే ఛాన్స్‌ ఉంది, ఎలాగో తెలుసా?

Tesla Model Y Price: టెస్లా మోడల్ Y భారతదేశంలో రూ.60 లక్షలకు లాంచ్‌ అయింది. EV విధానం & వాణిజ్య ఒప్పందం కారణంగా ధర త్వరలోనే అతి భారీగా తగ్గవచ్చు.

Tesla Model Y Price In India: ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా ఎట్టకేలకు భారతదేశంలో షోరూమ్‌ ఓపెన్‌ చేసింది, "మోడల్ Y" ఎలక్ట్రిక్‌ కారును లాంచ్‌ చేసింది. ఈ కారు రియర్‌ వీల్‌ డ్రైవ్‌ (RWD) కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్ రేంజ్ వేరియంట్ రేటు రూ. 68 లక్షల వరకు ఉంటుంది. అయితే, కొన్ని వారాల తర్వాత టెస్లా కారు ధరలు రూ. 15–20 లక్షలు తగ్గవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

భారతదేశంలో మోడల్ Y రేటు చాలా ఎక్కువ
భారతదేశంలో టెస్లా మోడల్ Y ధర US & చైనా మార్కెట్ల కంటే చాలా ఎక్కువ. USలో, ఇదే కారు దాదాపు $44,990కు అంటే రూ. 38.60 లక్షలకు అందుబాటులో ఉంది. చైనాలో ఈ ధర రూ.31.5 లక్షలు & జర్మనీలో దాదాపు రూ.46 లక్షలు. భారతదేశంలో మాత్రం ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం దిగుమతి సుంకం, ఇది 70% నుంచి 110% వరకు ఉంటుంది. టెస్లా, ప్రస్తుతం, CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) పద్ధతిలో భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటున్నందున, ఆ కార్లపై భారీ స్థాయిలో పన్ను విధిస్తున్నారు.

దిగుమతి సుంకమే అతి పెద్ద అడ్డంకి
భారతదేశం యొక్క దిగుమతి సుంకం గురించి ఎలాన్ మస్క్ చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో వాహనాలపై దిగుమతి సుంకం ప్రపంచంలోనే అత్యధికమని 2021లో ట్వీట్ చేశారు, తర్వాత చాలాసార్లు చెప్పారు. భారతదేశంలో ఫ్యాక్టరీని స్థాపించే ముందు, ఇక్కడి మార్కెట్లో డిమాండ్ ఎంత ఉందో చూడాలని మస్క్‌ భావిస్తున్నారు, అందుకే దిగుమతులపై మాత్రమే ఆధారపడుతున్నారు. కానీ, ఇంత ఎక్కువ ధర కారణంగా ఈ కారు కస్టమర్లను చేరకపోవచ్చు.

దేశీయ కంపెనీల అసంతృప్తి
మస్క్, భారత ప్రభుత్వం నుంచి ఉపశమనం కోరుతున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ కంపెనీలు దీనిని వ్యతిరేకించాయి. విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకంలో మినహాయింపు ఇస్తే, ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన స్థానిక పెట్టుబడిదారులకు అన్యాయం జరుగుతుందని వారు వాదించారు.

కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం
2024 మార్చిలో, భారత ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, విదేశీ కంపెనీలు భారతదేశంలో ₹4,150 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే 15% దిగుమతి సుంకం చెల్లించి ప్రతి సంవత్సరం 8,000 ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందడానికి ఆయా కంపెనీలు కొన్ని షరతులను కూడా అంగీకరించాలి.

  • మూడు సంవత్సరాలలోగా భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించాలి. 
  • 3వ సంవత్సరం నాటికి 25% స్థానికీకరణ & 5వ సంవత్సరం నాటికి 50% స్థానికీకరణ అవసరం. 
  • దిగుమతి చేసుకునే వాహనాల ధర $35,000 (సుమారు ₹29 లక్షలు) కంటే ఎక్కువగా ఉండాలి.
  • ఈ విధానం లక్ష్యం భారతదేశంలోనే ఉత్పత్తిని ప్రోత్సహించడం & విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, 'మేక్ ఇన్ ఇండియా'ను బలోపేతం చేయడం.

టెస్లా భారతదేశంలో ఫ్యాక్టరీ నిర్మిస్తుందా?
భారతదేశంలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం టెస్లా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వాస్తవానికి, ఎలాన్ మస్క్ 2024లో భారతదేశంలో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం కావాల్సి ఉంది & $2–3 బిలియన్ల పెట్టుబడిని ప్రకటించే ప్లాన్‌ కూడా ఉంది. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దయింది, ఆ తర్వాత ఎటువంటి అప్‌డేట్స్‌ లేవు.

వాణిజ్య ఒప్పందం కారణంగా ధర తగ్గుతుందా?
ప్రస్తుతం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్‌-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించే అంశం కూడా అజెండాలో ఉంది. టెస్లా సహా అమెరికన్ ఆటో కంపెనీలు భారతదేశంలోకి సులభంగా ప్రవేశించడానికి వీలుగా భారతదేశంలో దిగుమతి సుంకాన్ని తొలగించాలని అమెరికా కోరుతోంది. ఈ వాణిజ్య జూలై 31, 2025 నాటికి ఖరారు కావచ్చు. దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే, టెస్లా మోడల్ Y ధరలు భారీగా తగ్గవచ్చు.

టెస్లా ధర ఎంత తగ్గవచ్చు?
EV పాలసీ కింద మినహాయింపు లభించినా లేదా వాణిజ్య ఒప్పందం ద్వారా దిగుమతి సుంకం తగ్గినా టెస్లాకు ప్రయోజనమే. తద్వారా, మోడల్ Y ధర రూ. 60 లక్షల నుంచి రూ. 45 లక్షలకు దిగిరావచ్చు. అధిక ధర కారణంగా ప్రస్తుతం టెస్లాకు దూరంగా ఉన్న మిడ్-సెగ్మెంట్ EV కొనుగోలుదార్లకు, దిగుమతి సుంకం తగ్గింపు వల్ల టెస్లా కార్లు అందుబాటులోకి వస్తాయి. ఇది టెస్లా అమ్మకాలను పెంచడమే కాకుండా భారతదేశంలో పాతుకుపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget