అన్వేషించండి

Tesla Model Y vs Indian EVs: టెస్లా మోడల్‌ Y బెటరా? లేక స్వదేశీ మహీంద్రా & టాటా ఎలక్ట్రిక్‌ కార్లు బెటరా?

Tesla Model Y: టెస్లా మోడల్ Y ధర రూ.60 లక్షల కంటే ఎక్కువ. మహీంద్రా & టాటా ఎలక్ట్రిక్ SUVలు దీనికంటే చాలా తక్కువ ధరలో వస్తాయి.

Tesla Model Y vs Mahindra and Tata Electric Cars: టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్‌ కారు, 15 జులై 15 2025న, భారతదేశ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది. ముంబైలో టెస్లా మొదటి షోరూమ్ ప్రారంభంతో ఈ 
ప్రీమియం మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV ఇండియాలో లాంచ్‌ అయింది. దీని ధర వేరియంట్‌ను బట్టి రూ. 59.89 లక్షల నుంచి రూ. 67.89 లక్షల వరకు ఉంటుంది.

మోడల్ Y రెండు బ్యాటరీ ఎంపికలతో వచ్చింది - 60 kWh & 75 kWh. ఇవి వరుసగా 500 కి.మీ. & 622 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్‌ అందిస్తాయి. 
మోడల్ Y ఫీచర్లు - 15.4-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆటోపైలట్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) & టెస్లా సిగ్నేచర్ సాఫ్ట్‌వేర్, ఇంకా చాలా ఉన్నాయి. రూ.22,000 వేలు చెల్లించి టెస్లా కారును ఇప్పుడు బుక్‌ చేసుకుంటే, దీని డెలివరీ 3 నెలల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

టెస్లా మోడల్‌ Y వెర్సస్‌ భారతీయ ఎలక్ట్రిక్‌ కార్లు: 

మహీంద్రా BE 6 
మహీంద్రా BE 6, భారతదేశంలో టెస్లాతో పోటీ పడుతున్న మొదటి SUV. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభమై రూ. 26.90 లక్షల వరకు ఉంటుంది. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్స్‌తో వస్తుంది. అవి 59 kWh, దీని పరిధి దాదాపు 556 కి.మీ.  & 79 kWh, దీని పరిధి దాదాపు 682 కి.మీ. 175 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి దీనిని కేవలం 20 నిమిషాల్లో 20-80% వరకు ఛార్జ్ చేయవచ్చు. 
మహీంద్రా BE 6 ఫీచర్లు - డ్యూయల్-డిస్‌ప్లే, ఫ్యూచరిస్టిక్ డాష్‌బోర్డ్ డిజైన్, 16-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్ & లెవెల్ 2 ADAS వంటివి. ఇవి ఈ కారును అత్యాధునిక SUVగా మార్చాయి.

మహీంద్రా XEV 9e
XEV 9e మరో శక్తివంతమైన ఎంపిక, దీని ప్రారంభ ధర రూ. 21.90 లక్షలు. ఇది కూడా రెండు బ్యాటరీ ప్యాక్‌లలో (59 kWh - రేంజ్‌ దాదాపు 542 km) & 79 kWh - రేంజ్‌ దాదాపు 656 km) లభిస్తుంది.
XEV 9e అతి ఫీచర్‌ దాని AI ఆధారిత ఆర్కిటెక్చర్. ఇంకా.. AR హెడ్స్-అప్ డిస్‌ప్లే, ట్రిపుల్ 12.3-అంగుళాల స్క్రీన్ & 7 ఎయిర్‌బ్యాగ్‌లతో గొప్ప భద్రత. దీని డిజైన్ కూడా కూపే SUVలాగా ఉంటుంది, ఇది కస్టమర్లకు చాలా నచ్చింది.

టాటా హారియర్ EV
టాటా హారియర్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి 65 kWh & 75 kWh బ్యాటరీ ఎంపికలు ఉన్నాయి, వీటితో ఈ కారు 627 కి.మీ. వరకు ప్రయాణించగలదు.
హారియర్ EV లో 540-డిగ్రీల సరౌండ్ కెమెరా, ఇ-వాలెట్ సిస్టమ్, ఆటో పార్కింగ్ అసిస్ట్ & AWD ఆప్షన్ వంటి హై-ఎండ్ సేఫ్టీ & డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫ్యామిలీలకు, లాంగ్‌ డ్రైవ్‌లకు చాలా మంది SUVగా మారింది.

టెస్లా మోడల్ Y విషయానికి వస్తే... బ్రాండ్ వాల్యూ, లాంగ్ రేంజ్ & అధునాతన సాంకేతికతకు ప్రాధాన్యతనిచ్చే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. ఆటోపైలట్, ADAS & పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లను ఇది అందిస్తుంది. అయితే, దీని ధర భారతదేశంలోని ఇతర ఎలక్ట్రిక్ SUVల కంటే దాదాపు రెట్టింపు.

మహీంద్రా BE 6 & XEV 9e తక్కువ ధరకే గొప్ప ఫీచర్లు & మంచి రేంజ్‌ను అందిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్, హర్మాన్ సౌండ్ సిస్టమ్, AR డిస్‌ప్లే & AI ఇంటీరియర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. టెస్లాతో పోలిస్తే ఇవి తక్కవ ధర & సాంకేతికంగా సామర్థ్యం కలిగి ఉంటాయి.

టాటా హారియర్ EV.. నమ్మకమైన, సురక్షితమైన & కుటుంబానికి అనుకూలమైన ఎలక్ట్రిక్ SUV కోసం చూస్తున్న కస్టమర్లకు అనువైనది. దీని AWD సామర్థ్యం, పార్కింగ్ అసిస్ట్ & 360 డిగ్రీస్‌ కెమెరా వ్యవస్థ దీనిని సురక్షితంగా & సౌకర్యవంతంగా చేస్తాయి.

టెస్లా ప్రీమియం టెక్నాలజీతో భారతీయ ఎలక్ట్రిక్‌ కార్‌ వ్యవస్థలను పోల్చడం అసంబద్ధం అయినప్పటికీ, మహీంద్రా & టాటా SUVలు ధర & ఫీచర్ల సమతుల్యత కారణంగా భారతీయ కస్టమర్లకు మంచి ఎంపిక అవుతాయని స్పష్టంగా తెలుస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

హైడ్రోజన్ కారుతో JCB సంచలనం.. గంటకు 654 కి.మీ. వేగంతో ప్రపంచ రికార్డు!
ఈ కారు స్పీడ్‌ గంటకు 654km, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా ఈ వేగం ముందు బలాదూర్‌!
పెరిగింది రూ.15 వేలే.. కానీ కొత్త Ducati Monsterలో వచ్చిన మార్పులు ఇవీ!
కొత్త ఇంజిన్‌తో Ducati Monster V2.. పాత మోడల్‌కు దీనికి ఇంత తేడానా?
సింగిల్‌ ఛార్జ్‌తో 145 కి.మీ. హ్యాపీగా తిరిగిరావచ్చు.. కొత్త BGauss OoWah MAX Plus‌లో స్పెషల్ ఫీచర్లు!
145km రేంజ్ ఇచ్చే కొత్త BGauss ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌.. ఛార్జర్‌ పూర్తిగా ఉచితం
E20 ఇంధనంతో వాహనాల ఇంజిన్లకు ముప్పే! కార్‌ కంపెనీల తనిఖీల్లో సంచలన విషయాలు
E20 పెట్రోల్‌ మీద మళ్లీ రచ్చ.. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక తేమ, రాష్ట్రాలవారీ వివరాలు లీక్‌

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget