అన్వేషించండి

Telangana Vehicle Tax: తెలంగాణలో వాహనదారులకు షాక్‌- లైఫ్‌ ట్యాక్స్‌, ఫ్యాన్సీ నంబర్‌ ఫీజులు భారీగా పెంపు – కొత్త రేట్లు ఇవే

Telangana Fancy Number Fees: తెలంగాణ రవాణా శాఖ లైఫ్‌ ట్యాక్స్‌ & ఫ్యాన్సీ నంబర్‌ ఫీజులను పెంచింది. కొత్త వాహనాలు, పాత వాహనాలు, ఫ్యాన్సీ నంబర్లకు వర్తించే రేట్లను మార్చింది.

Telangana New Vehicle Registration Charges Hike: తెలంగాణ రాష్ట్రంలో కొత్త కారు లేదా కొత్త బైక్‌ కొనాలంటే మీరు మరింత ఎక్కువ డబ్బు చెల్లించాలి. తెలంగాణ రవాణా శాఖ, వాహనదారులపై కొత్త భారం మోపింది. కొత్తగా కొనుగోలు చేసే కార్లు, బైక్‌లపై లైఫ్‌ ట్యాక్స్‌ శ్లాబులను మార్చింది. ఖరీదైన వాహనాలపైనా టాక్స్‌ శాతాలు పెంచింది. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు మార్చుకునే పాత వాహనాల రిజిస్ట్రేషన్‌ ఫీజులు కూడా పెరిగాయి. ఫ్యాన్సీ (స్పెషల్‌) నంబర్ల ఫీజులను కూడా తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ విడిచిపెట్టలేదు, భారీ పెంచింది. ఈ మార్పులు ప్రస్తుతం ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ రూపంలో జారీ అయ్యాయి, త్వరలో అమల్లోకి రానున్నాయి.

నాలుగు చక్రాల వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌
కామన్‌ మ్యాన్‌కు ఊరట ఏమిటంటే, ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 10 లక్షల లోపు ఉన్న కార్లకు అదనపు భారం ఉండదు. ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ. 10 లక్షలు దాటితే 1% అదనపు లైఫ్‌ ట్యాక్స్‌ విధిస్తారు. రూ. 20 లక్షలు దాటితే 2%, రూ. 50 లక్షలు దాటితే 3% వరకు అదనంగా చెల్లించాలి. కంపెనీలు, సంస్థలకు చెందిన 10 సీట్ల లోపు వాహనాల కూడా ట్యాక్స్‌ పెంచారు. రూ. 20-50 లక్షల మధ్య ఉన్న వాహనాలకు 22%, రూ. 50 లక్షలకు పైగా ఉన్న వాటికి 25% లైఫ్‌ ట్యాక్స్‌ వర్తిస్తుంది.

ద్వి చక్రాల వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌
చిన్న టూవీలర్ల విషయంలోనూ సర్కారు కనికరం చూపింది. ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1 లక్షలోపు ఉన్న బైక్‌లపై అదనపు భారం లేదు, ప్రస్తుత రేట్లే వర్తిస్తాయి. అయితే.. బైక్‌ ఎక్స్‌-షోరూమ్‌ రేటు రూ. 1 లక్ష దాటితే 3%, రూ. 2 లక్షలు దాటితే 6% లైఫ్‌ ట్యాక్స్‌ పెరుగుతుంది. ఉదాహరణకు, రూ. 1.10 లక్షల విలువైన బైక్‌ కోసం ఇంతకు ముందు రూ. 13,200 ట్యాక్స్‌ కట్టాల్సి వచ్చేది. కొత్త రేట్ల ప్రకారం ఇది మరో రూ.3,300 పెరిగి రూ. 16,500 అవుతుంది.

పాత వాహనాల రిజిస్ట్రేషన్‌ ఫీజులు
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై కొంతకాలం తర్వాత తెలంగాణకు మారే వాహనాలపై కూడా భారం పెరిగింది. వాహనం విలువ ఆధారంగా 1% నుంచి 6% వరకు అదనపు రిజిస్ట్రేషన్‌ ఫీజులు వసూలు చేస్తారు.

ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు
తెలంగాణ ప్రభుత్వం, ఫ్యాన్సీ నంబర్ల ఫీజుల్లో భారీగా పెంచింది. ఇంతకుముందు 5 శ్లాబులు (రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు & రూ.5 వేలు) ఉండగా, ఇప్పుడు 7 శ్లాబులుగా ‍‌(రూ.1.50 లక్షలు, రూ.1 లక్ష, రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు & రూ.6 వేలు) విస్తరించారు. “9999” వంటి నంబర్లకు ఇప్పుడు కనీసం రూ. 50,000 చెల్లించాల్సి ఉండగా, ఇకపై కనీసం రూ. 1.50 లక్షలు కోట్‌ చేయాలి. “1” లేదా “9” వంటి నంబర్లకు రూ. 1 లక్ష, ఇతర ప్రీమియం నంబర్లకు రూ. 50,000 నుంచి రూ. 6,000 వరకు రేట్లు నిర్దేశించారు.

వాహన యజమానులపై ప్రభావం
ఈ కొత్త రేట్లు అమలులోకి వస్తే, రూ. 1 లక్ష లోపు (ఎక్స్‌-షోరూమ్‌) బైక్‌లు, రూ. 10 లక్షల లోపు (ఎక్స్‌-షోరూమ్‌) కార్లను కొనేవాళ్లపై కొత్తగా ఎలాంటి భారం పడదు. దీనికి మించి ఖరీదైన కార్లు, బైక్‌లు కొనుగోలు చేసే వారిపై గణనీయమైన భారం పడుతుంది. ఫ్యాన్సీ నంబర్ల రేట్లు పెరగడం వల్ల, ప్రత్యేక నంబర్లకు డిమాండ్‌ ఉన్నవారు కచ్చితంగా మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే వారు కూడా అదనపు రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ రవాణా శాఖ, ఈ నిర్ణయాలను వాహనాల విలువ పెరుగుదల, వాహన మార్కెట్‌లో మార్పులు, ఆదాయం పెంపు అవసరం దృష్ట్యా తీసుకుంది. 

టాప్ హెడ్ లైన్స్

169 km రేంజ్‌తో వచ్చిన యమహా EC-06 ఈ-స్కూటర్‌ - పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌లో ఏం తెలిసిందంటే?
యమహా EC-06 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్‌ - రియల్‌ వరల్డ్‌లో యాక్సిలరేషన్‌, బ్రేకింగ్‌ ఎలా ఉంది?
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
526 km లాంగ్‌ రేంజ్‌తో రాబోతున్న కియా సైరస్ ఎలక్ట్రిక్‌ కారు - తెలుగు రాష్ట్రాల్లో ధర, బ్యాటరీ ఆప్షన్లు, ఫీచర్లు తెలుసుకోండి
కియా సైరస్ EV వచ్చేస్తోంది - ఎన్ని వేరియంట్లు ఉన్నయి? వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఇస్తారు? పూర్తి వివరాలు
ఏథర్ రిజ్టాకు LFP బ్యాటరీ ఆప్షన్‌ - కొత్త బ్యాటరీ ప్యాక్‌లు, 900W ఛార్జర్‌తో కీలక అప్‌డేట్
యూత్‌ మెచ్చిన ఏథర్ స్కూటర్లకు ఫ్రెష్‌ అప్‌డేట్‌ - చిన్న బ్యాటరీలతోనే సేమ్‌ రేంజ్, ఛార్జింగ్‌లో మరింత వేగం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget