అన్వేషించండి

New Tata Sierra వర్సెస్‌ Creta, Seltos, Grand Vitara - మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో ఏ కారు బెటర్‌?

2025 టాటా సియారా మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. సైజ్‌, ఇంజిన్‌ ఆప్షన్లు, బూట్ స్పేస్ & పవర్ విషయంలో క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా వంటి ప్రత్యర్థులతో పోలిస్తే ఎలా ఉందో పూర్తి వివరణ.

New Tata Sierra Comparison: 2025 టాటా సియారాతో మిడ్‌సైజ్ SUV మార్కెట్‌లో పోటీ మరింత హాట్‌గా మారింది. Hyundai Creta, Kia Seltos, Maruti Grand Vitara, Maruti Victoris, Toyota Hyryder, Honda Elevate, Skoda Kushaq, VW Taigun, MG Astor, Citroen Aircross వంటి బలమైన ప్రత్యర్థులతో ఉన్న సెగ్మెంట్‌లోకి టాటా ఈ కొత్త SUVని తీసుకొచ్చింది. సైజ్‌, శక్తిమంతమైన ఇంజిన్‌ ఆప్షన్లు, అప్‌డేటెడ్‌ డిజైన్‌ - ఇవి సియారాను ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే, ప్రత్యర్థి కార్లు కూడా తక్కువ తినలేదు, అవి ఇప్పటికే తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకున్నాయి.

సైజ్‌ విషయంలో సియారా పైచేయి
కొత్త టాటా సియారా 4.3 మీటర్ల పొడవుతో ఈ సెగ్మెంట్‌లో పెద్ద SUVల లెక్కలోకి వస్తోంది. 1,715 mm హైట్‌ కారణంగా ఇది అన్ని ప్రత్యర్థి కార్ల కంటే ఎత్తుగా ఉంటుంది. అలాగే 2,730 mm వీల్‌బేస్‌ ఈ సెగ్మెంట్‌లోనే అతి పెద్దది. ఈ సంఖ్యలు చూసినపుడు కేబిన్‌లో లెగ్‌రూం, హెడ్‌రూం, వెనక సీటింగ్ కంఫర్ట్‌ మరింత మెరుగ్గా ఉంటాయని స్పష్టమవుతుంది.

622 లీటర్ల భారీ బూట్ స్పేస్‌ కూడా సియారాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. లాంగ్‌ ట్రావెల్స్‌, ఫ్యామిలీ ట్రిప్స్‌, లగేజ్‌ తీసుకెళ్లేందుకు పెద్ద స్పేస్‌ కోసం చూస్తున్న వారికి ఇది అదనపు సౌకర్యం.

NA పెట్రోల్ ఇంజిన్‌ – సిటీ డ్రైవింగ్‌కు సరైన ఎంపిక
సియారా.. 1.5-లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ (NA) పెట్రోల్ ఇంజిన్‌తో 106 hp శక్తి, 145 Nm టార్క్‌తో వస్తోంది. ఇది హోండా ఎలివేట్‌, క్రెటా, విక్టోరిస్‌ వంటి ప్రత్యర్థులతో సమానంగా ఉంటుంది. స్మూత్‌గా రన్ అయ్యే ఈ ఇంజిన్‌ సిటీ డ్రైవింగ్‌కు బాగా సరిపోతుంది. 6-స్పీడ్‌ మాన్యువల్‌ & 7-స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల ఆప్షన్లు వినియోగదారుల ఎంపికను పెంచుతున్నాయి.

టర్బో పెట్రోల్ – పవర్‌ఫుల్‌ డ్రైవింగ్ కోసం
1.5-లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 160 hp శక్తి, 255 Nm టార్క్‌తో అందుబాటులో ఉంది. ఇది క్రెటా, సెల్టోస్‌, కుషాక్‌, టైగున్‌ టర్బో వెర్షన్‌లతో సమానంగా ఉంటుంది. 6-స్పీడ్‌ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఈ ఇంజిన్‌కు సరైన జోడీ. హైవే డ్రైవ్స్‌, వేగంగా ఓవర్‌టేక్ చేయాల్సిన పరిస్థితుల్లో ఇది మంచి పంచ్ ఇస్తుంది.

డీజిల్ ఆప్షన్ – సెగ్మెంట్‌లో అరుదైన USP
ఇప్పటికే చాలా బ్రాండ్లు డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్‌ను తీసివేశాయి. కానీ సియారా 1.5-లీటర్‌ టర్బో డీజిల్ 118 hp శక్తితో వచ్చింది. 260–280 Nm టార్క్‌తో ఇది సుదీర్ఘ ప్రయాణాలు చేసే డ్రైవర్స్‌కి మంచిది. ప్రత్యేకంగా డీజిల్–ఆటోమేటిక్‌ కాంబినేషన్‌ ఈ సెగ్మెంట్‌లో పెద్ద ఆధిక్యం.

సైజు, ఇంజిన్ ఎంపికలు, ధర.... అన్ని కలిసి సియారా స్ట్రాంగ్ ప్యాకేజ్

సైజు విషయంలో సియారా స్పష్టంగా ప్రత్యర్థులకంటే పెద్దది. మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లు (NA పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్) ఒకే SUVలో ఇవ్వడం ప్రస్తుతం చాలా అరుదు. ఇవన్నీ కలిసి సియారాను మంచి ప్యాకేజ్‌గా నిలబెడుతున్నాయి.

ఇక రియల్-వరల్డ్ మైలేజ్‌, సస్పెన్షన్ కంఫర్ట్‌, దీర్ఘకాలిక నమ్మకంలోనూ మంచి రేటింగ్ సాధిస్తే, సియారా మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో భారీ పోటీ ఇచ్చే మోడల్‌ అవుతుందని స్పష్టంగా చెప్పొచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

EV మార్కెట్‌లో మరోసారి సత్తా చాటిన Tata Motors.. Kia దెబ్బకు Marutiకి భారీ షాక్!
జనం ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్‌ కార్లు ఈ కంపెనీవే.. ఇతర బ్రాండ్ల వైపు కన్నెత్తి చూడడం లేదు!
Skoda Slavia Facelift EMI: నెలకు సుమారు రూ.14 వేలు కట్టి ఈ ప్రీమియం సెడాన్‌ను సొంతం చేసుకోండి!
Skoda Slavia Facelift ఆన్‌రోడ్‌ రేటు ఎంత పడుతుంది? కార్‌ లోన్‌ ఎంత వస్తుంది?
కొత్త గేర్‌బాక్స్, 360 డిగ్రీ కెమెరా, రియర్ సీట్ మసాజ్.. Skoda Slavia Faceliftలో ఇంకా ఏం మారిందంటే?
Skoda Slavia Facelift: చిన్న మార్పులు, పెద్ద ప్రభావం.. ఇప్పుడు మరింత మోడ్రన్‌గా!
Mahindra Thar Electric వస్తోంది.. టెస్టింగ్‌లో తొలిసారి కనిపించిన కారు లుక్, అంచనా ధర వివరాలు
Mahindra Thar Electric వస్తోంది.. టెస్టింగ్‌లో తొలిసారి కనిపించిన కారు లుక్, అంచనా ధర వివరాలు

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget