అన్వేషించండి

Tata Sierra vs Tata Harrier పోలికలు, భేదాలు: ధర, ఫీచర్లలో 'వాల్యూ ఫర్‌ మనీ' ఇచ్చే SUV ఏది?

Tata Sierra, Tata Harrier టాప్‌ వేరియంట్లలో ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్లు, ధరల పోలిక. ఎక్కువ వాల్యూ ఫర్‌ మనీ ఇచ్చే టాటా SUV ఏదో తెలుసుకోండి.

Tata Sierra vs Harrier comparison: భారత SUV మార్కెట్‌లో Tata Sierra, Tata Harrier రెండూ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్స్‌. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో పాటు, ఫీచర్ల విషయంలో కూడా టాటా ఈ రెండు SUVలను ఫుల్‌ చేసి అందిస్తోంది. కానీ టాప్‌ వేరియంట్‌ను తీసుకుంటే, ఏ మోడల్‌ నిజంగా వాల్యూ ఫర్‌ మనీ? అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. అదే విషయం ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.

గమనిక: ఈ పోలికలో Harrier Fearless Ultra కాకుండా Fearless X+ వేరియంట్‌ను పరిగణలోకి తీసుకున్నాం. ఎందుకంటే Ultra వేరియంట్‌ కేవలం పెట్రోల్‌ ఇంజిన్‌తోనే అందుబాటులో ఉంటుంది.

డైమెన్షన్స్‌

సైజ్‌ విషయంలో Tata Harrier స్పష్టంగా పెద్ద SUV. సియేరాతో పోలిస్తే ఇది 265mm ఎక్కువ పొడవుగా, 81mm ఎక్కువ వెడల్పుగా ఉండటంతో పాటు వీల్‌బేస్‌ కూడా 11mm ఎక్కువ. అయితే ఎత్తు మాత్రం రెండు SUVలలో దాదాపు ఒకేలా ఉంటుంది. ఎక్కువ స్పేస్‌, రోడ్‌ ప్రెజెన్స్‌ కోరుకునేవారికి హారియర్‌ ఇక్కడ ప్లస్‌ పాయింట్‌.

ఇంజిన్‌ & పవర్‌ట్రెయిన్‌

 
Sierra Accomplished+
Harrier Fearless X+
ఇంజిన్‌
 
1.5 టర్బో-పెట్రోల్‌ / 1.5 డీజిల్‌
1.5 టర్బో-పెట్రోల్‌ / 2.0 డీజిల్‌
పవర్‌
 
160hp / 118hp
170hp / 170hp
టార్క్‌
 
255Nm / 280Nm
280Nm / 350Nm
ట్రాన్స్‌మిషన్‌
 
6AT / 6MT, 6AT
6MT, 6AT

పెట్రోల్‌ సెగ్మెంట్‌లో... సియేరా, హారియర్‌ రెండింటిలోనూ ఒకే 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. అయితే హారియర్‌ ఈ ఇంజిన్‌ నుంచి సియేరాతో పోలిస్తే 10hp, 25Nm ఎక్కువ టార్క్‌ ఇస్తుంది. ట్రాన్స్‌మిషన్‌ విషయానికి వస్తే, సియేరాలో ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ మాత్రమే ఉండగా, హారియర్‌లో 6-స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ రెండూ ఉన్నాయి.

డీజిల్‌ సెగ్మెంట్‌లో హారియర్‌ మరింత ముందుంటుంది. ఇందులో 2.0 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఉండగా, సియేరా 1.5 లీటర్‌ డీజిల్‌తో వస్తుంది. హారియర్‌ డీజిల్‌ పవర్‌, టార్క్‌ పరంగా సియేరాను చాలా దూరం వెనక్కి నెట్టేస్తుంది. అయితే రెండు SUVలలోనూ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ఆప్షన్లు ఉన్నాయి.

ఎక్స్‌టీరియర్‌ & ఫీచర్లు

ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లలో రెండు SUVలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ఆల్‌-LED లైటింగ్‌, 19 అంగుళాల అలాయ్‌ వీల్స్‌, రియర్‌ స్పాయిలర్‌, పవర్డ్‌ ORVMs రెండింటిలోనూ ఉన్నాయి. కానీ Tata Sierra ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో ఉన్న ఫ్లష్‌ టైప్‌ డోర్‌ హ్యాండిల్స్‌, ORVM మెమరీ ఫంక్షన్‌ హారియర్‌లో లేవు.

సియేరాలో తొలిసారి డెడికేటెడ్‌ ప్యాసింజర్‌ స్క్రీన్‌, అదనంగా రెండు స్పీకర్లు, 12 స్పీకర్ల Dolby Atmos సౌండ్‌ సపోర్ట్‌ ఉన్నాయి. ఇవి Harrier Fearless X+లో కనిపించవు. అయితే హారియర్‌లో పవర్డ్‌ కో-డ్రైవర్‌ సీట్‌కి బాస్‌ మోడ్‌ ఉంటుంది. ఇది సియేరా Accomplished+లో లేదు.

డ్రైవింగ్‌ టెక్నాలజీ

డ్రైవింగ్‌ టెక్‌ విషయంలో రెండు SUVలు దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే హారియర్‌లో అదనంగా ఒక Eco డ్రైవ్‌ మోడ్‌ ఉంటుంది.

సేఫ్టీ

సేఫ్టీ ఫీచర్లలో పెద్ద తేడా లేదు. కానీ Harrier Fearless X+లో అదనంగా నీ (మోకాలి) ఎయిర్‌బ్యాగ్‌ ఉంటుంది. ఇది సియేరాలో లేదు.

ధర & వాల్యూ

 
Sierra Accomplished+*
Harrier Fearless X+
వ్యత్యాసం
టర్బో-పెట్రోల్‌ MT
 
-
రూ. 22.12 లక్షలు
-
టర్బో-పెట్రోల్‌ AT
 
రూ. 20.99 లక్షలు
రూ. 23.54 లక్షలు
- రూ. 2.52 లక్షలు
డీజిల్‌ MT
 
రూ. 20.29 లక్షలు
రూ. 23.12 లక్షలు
- రూ. 2.83 లక్షలు
డీజిల్‌ AT
 
రూ. 21.29 లక్షలు
రూ. 24.54 లక్షలు
- రూ. 3.25 లక్షలు

ధర విషయానికి వస్తే అసలు ట్విస్ట్‌ ఇక్కడే. సియేరా పెట్రోల్‌, డీజిల్‌ రెండింటిలోనూ హారియర్‌తో పోలిస్తే రూ.1 లక్షలకుపైగా తక్కువ ధరలో లభిస్తుంది. డీజిల్‌లో పవర్‌ తక్కువగా ఉన్నా, ఫీచర్లు చూస్తే సియేరా చాలా ఆకర్షణీయంగా మారుతుంది.

ఏది సరైన ఎంపిక?

పెద్ద సైజ్‌, ఎక్కువ పవర్‌, స్పేస్‌ కావాలంటే Tata Harrier సరైన ఎంపిక. కానీ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, డెడికేటెడ్‌ ప్యాసింజర్‌ స్క్రీన్‌, ప్రీమియం ఆడియో అనుభూతి కావాలంటే Tata Sierra స్పష్టంగా బెటర్‌ వాల్యూ ఫర్‌ మనీ SUVగా నిలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget