Tata Kaziranga Edition: టాటా పంచ్‌లో కొత్త మోడల్ - మరింత అదిరిపోయే లుక్, ఫీచర్లు - ధర ఎంతంటే?
టాటా మోటార్స్ తన ఎస్‌యూవీ రేంజ్‌లో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. అదే కజిరంగ ఎడిషన్.
Tata SUV Kaziranga Edition: టాటా మోటార్స్ తన ఎస్‌యూవీ రేంజ్‌లోని నాలుగు కార్లలోనూ కజిరంగ అనే స్పెషల్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఎక్కువగా ఉండే అస్సాంలోని కజిరంగ నేషనల్ పార్కు పేరు మీద టాటా వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారులో ఖడ్గమృగాన్ని గుర్తు చేసే ఎన్నో అంశాలు ఉన్నాయి.
వీటిలో డ్యూయల్ టోన్ రూఫ్ అందుబాటులో ఉంది. పియానో బ్లాక్ ఫినిష్ కూడా అందించారు. అన్ని ఎస్‌యూవీల్లోనూ ఈ కలర్‌ను ప్రత్యేకంగా అందించారు. ఈ కారు ఫొటోల్లో కంటే బయట చూడటానికి బాగుండటం విశేషం. ఇందులో బ్లాక్ కలర్ కారుకు క్లాస్ లుక్ వచ్చింది.కస్టం మేడ్ కీ, మరిన్ని యాక్సెసరీలు దీంతోపాటు రానున్నాయి.
టాటా పంచ్ (Tata Punch) కజిరంగ ఎడిషన్‌లో కొత్త లెదరెట్ అప్‌హోల్స్ట్రీని అందించారు. పియానో బ్లాక్ డోర్ ట్రిమ్ ఎడిషన్స్, డాష్ బోర్డు మిడ్ ప్యాడ్, గ్రానైట్ బ్లాక్ రూఫ్ రెయిల్స్, పియానో బ్లాక్ హ్యుమానిటీ లైన్ ఫ్రంట్ గ్రిల్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ కజిరంగ ఎడిషన్ క్రియేటివ్ ఎంటీ, క్రియేటివ్ ఎంటీ-ఐరా, క్రియేటివ్ ఏఎంటీ, క్రియేటివ్ ఏఎంటీ-ఐరా వేరియంట్లలో అందుబాటులో ఉంది.
నెక్సాన్ (Tata Nexon) కజిరంగ ఎడిసన్‌లో గ్లాస్ ల్యాండ్ బీజ్ కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. డ్యూయల్ టోన్ ఎర్తీ బీజ్ లెదరెట్ అప్‌హోల్స్ట్రీ, పియానో బ్లాక్ డోర్ ట్రిమ్ ఎడిషన్స్, ప్రత్యేకమైన వుడ్ ఫినిష్ డాష్ బోర్డ్ మినీ ప్యాడ్, గ్రానైట్ బ్లాక్ బాడీ క్లాడింగ్స్, రూఫ్ రెయిల్స్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటు పియానో బ్లాక్ హ్యుమానిటీ లైన్ ఫ్రంట్ గ్రిల్, 16 అంగుళాల అలోయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీంతోపాటు ముందు వరుస ప్యాసింజర్ల కోసం వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి.ఎయిర్ ప్యూరిఫయర్, ఎలక్ట్రో క్రోమాటిక్ ఐఆర్‌వీఎంలు కూడా ఇందులో అందించారు.
ఇక హారియర్ (Tata Harrier), సఫారీ (Tata Safari) కజిరంగ ఎడిషన్లలో కూడా ప్రత్యేకమైన కలర్‌ను అందించారు. దీంతోపాటు డ్యూయల్ టోన్ ఎర్తీ బీజ్ లెదరెట్ సీట్లు, డోర్ ట్రిమ్స్, ట్రోపికల్ వుడ్ ఫినిష్ డాష్ బోర్డ్ మిడ్ ప్యాడ్, గ్రానైట్ బ్లాక్ బాడీ క్లాడింగ్స్ ఇందులో ఉండనున్నాయి. వీటిలో 17 అంగుళాల అలోయ్ వీల్స్ ఉండనున్నాయి. వైర్‌లెస్ చార్జర్, యాపిల్ కార్ ప్లే / ఆండ్రాయిడ్ ఆటో ఓవర్ వైఫై, ఎయిర్ ప్యూరిఫయర్, కనెక్టెడ్ టెక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధరలు ఇవే...
టాటా పంచ్ కజిరంగ ఎడిషన్ ధర రూ.8,58,900 నుంచి ప్రారంభం కానుంది. నెక్సాన్ కజిరంగ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.11,78,900 నుంచి, డీజిల్ వేరియంట్ ధర రూ.13,08,900 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక హారియర్ కజిరంగ ఎడిషన్ ధర రూ.20,40,900 నుంచి, సఫారీ (7ఎస్) ధర రూ.20,99,000 నుంచి ప్రారంభం కానుంది.
Also Read: Baleno Vs Swift: బలెనో వర్సెస్ స్విఫ్ట్ - బడ్జెట్ కార్లలో ఏది బెస్ట్!
Also Read: ఏకంగా మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న జీప్ - అదిరిపోయే ఫీచర్లు - ధర కూడా తక్కువగానే!