అన్వేషించండి

జీఎస్టీ తగ్గింపు తర్వాత Tata Punch రేటు ఎంత తగ్గుతుంది, కస్టమర్‌కు ఎంత మిగులుతుంది? - కొత్త ధర తెలుసుకోండి

Tata Punch GST price cut 2025: కొత్త GST రేటు అమలు తర్వాత టాటా పంచ్ మరింత చౌకగా మారుతుంది. గతంలో 28% GST ఉండేది, ఇకపై 18% GST అప్లై అవుతుంది.

Tata Punch New Price After GST Price Cut: మన తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్‌కు ఆదరణ ఎక్కువే. మన దేశంలో అత్యంత అందుబాటు రేటులో ఉన్న కాంపాక్ట్ SUV ఇది. తక్కువ ధరకే SUV లాంటి లుక్స్ & ఫీచర్లను ఇది అందిస్తుంది కాబట్టి దీనిని "పాకెట్ SUV" అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, తాజా GST తగ్గింపుతో ఈ చిన్న SUV తెలుగు ప్రజలకు మరింత తక్కువ రేటుకు దొరుకుతుంది. 

GST తగ్గింపు తర్వాత టాటా పంచ్ రేటు ఎంత తగ్గుతుంది?

ప్రస్తుతం, టాటా పంచ్‌పై 28% GST వర్తించేది. అంటే వాస్తవ ధరకు ఈ పన్ను కలిపిన తర్వాత, ప్రారంభ ధర రూ. 6 లక్షలకు చేరుకునేది. ఈ పన్ను తొలగిస్తే, పంచ్ ధర దాదాపు రూ. 4,68,750 మాత్రమే. కొత్త GST రేట్లు ఈ నెల 22వ తేదీ (22 సెప్టెంబర్‌ 2025) నుంచి వర్తిస్తాయి. ఇప్పుడు 28% GST కి బదులుగా 18% GST మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీని అర్థం కస్టమర్‌పై పన్ను భారం చాలా తగ్గుతుంది & ప్రారంభ మోడల్ ధర దాదాపు రూ. 5,53,125 కు దిగి వస్తుంది. ఈ విధంగా, దసరా & దీపావళి పండుగ సీజన్‌లో టాటా పంచ్ మునుపటి కంటే దాదాపు రూ. 50,000 చౌకగా లభిస్తుంది.

డిజైన్ ఎలా ఉంది?

టాటా పంచ్ అంటేనే బలమైన & SUV స్టైల్‌కు ప్రతిరూపం. టాటా హారియర్ & సఫారీ వంటి పెద్ద SUVల స్ఫూర్తితో బయటి భాగం ఉంటుంది. కారు ముందు భాగంలో  స్ల్పిట్‌ హెడ్‌ల్యాంప్‌లు, LED DRLs & ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు, బ్లాక్ క్లాడింగ్ & 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ దీనిని స్పోర్టీ లుక్‌లోకి మారుస్తాయి. కారు వెనుక వైపున, LED టెయిల్‌ల్యాంప్‌లు & రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ వాహనానికి ప్రీమియం ఫినిష్‌ ఇస్తాయి.

లోపలి భాగం ప్రీమియమేనా?

పంచ్ లోపలి భాగం డ్యూయల్-టోన్ బ్లాక్‌ & గ్రే కలర్‌ థీమ్‌లో డెకరేట్‌ చేశారు, ఇది దీనికి ఆధునికంగా & విశాలమైన అప్పీల్‌ ఇస్తుంది. ఆధునిక కాలపు అవసరాలను తీర్చే డాష్‌బోర్డ్‌పై 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. దీంతో పాటు, సెమీ-లెథరెట్ సీట్లు కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో అందించారు. సౌకర్యం & సౌలభ్యం కోసం ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ & వాయిస్-ఆపరేటెడ్ సన్‌రూఫ్ కూడా చేర్చారు.

 5-స్టార్ పంచ్

టాటా పంచ్ భద్రత పరంగా కూడా బలంగా ఉంది. గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ అడల్ట్‌ సేఫ్టీ & 4-స్టార్ చిల్డ్రన్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందింది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ABS & EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్, రియర్ వ్యూ కెమెరా & ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. అలాగే, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (iTPMS) వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంజిన్ & మైలేజ్

టాటా పంచ్ 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 87 bhp పవర్ & 115 Nm టార్క్ జనరేట్‌ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మాన్యువల్ & AMT గేర్‌బాక్స్ రెండింటితో కొనుగోలు చేయవచ్చు. దాని CNG వేరియంట్‌ 72 bhp పవర్ & 103 Nm టార్క్‌ను అందిస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, CNG వెర్షన్ మైలేజ్ కిలోగ్రాముకు 26.99 కిలోమీటర్లు.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget