మీ దగ్గర 1.82 లక్షలు ఉంటే చాలు, టాటా పంచ్ EV ని కొనేయొచ్చు! వడ్డీ రేట్లు, EMI పూర్తి లెక్కలు ఇవిగో!
హైదరాబాద్‌లో Tata Punch EV కొత్త ధరలు, ఆన్-రోడ్ ఆఫర్లు, బ్యాంక్ లోన్ EMI ఆప్షన్ల వివరాలు తెలుసుకోండి. తక్కువ డౌన్ పేమెంట్‌తో ఈ SUV మీ సొంతం చేసుకోండి!

2026 Tata Punch EV Price, Down Payment, Car Loan and EMI Details: తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ కార్లు వేగంగా పెరుగుతున్నాయి. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో, Tata Punch EV సరికొత్త డిజైన్, రేంజ్‌తో ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో, 2026 Tata Punch EV బేసిక్ వేరియంట్ Smart 30kWh ఎక్స్-షోరూమ్ ధర రూ.9.69 లక్షలు కాగా, టాప్ వేరియంట్ Empowered Plus S 40kWh ఎక్స్-షోరూమ్ ధర రూ.12.59 లక్షలు. ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపి హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర రూ.10.30 లక్షల నుంచి రూ. 13.64 లక్షల వరకు ఉంటుంది.
వేరియంట్ వారీగా టాటా పంచ్ ధరలు
| వేరియంట్ పేరు | ఎక్స్-షోరూమ్ ధర | హైదరాబాద్ ఆన్-రోడ్ ధర (సుమారు) | బ్యాటరీ సామర్థ్యం |
| Smart 30kWh | రూ. 9,69,000 | రూ. 10,30,134 | 30 kWh |
| Smart Plus 30kWh | రూ. 10,29,000 | రూ. 11,02,470 | 30 kWh |
| Smart Plus 40kWh | రూ. 10,89,000 | రూ. 11,75,774 | 40 kWh |
| Adventure 40kWh | రూ. 11,59,000 | రూ. 12,54,207 | 40 kWh |
| Empowered 40kWh | రూ. 12,29,000 | రూ. 13,32,740 | 40 kWh |
| Empowered Plus S 40kWh | రూ. 12,59,000 | రూ. 13,64,113 | 40 kWh |
కనీస డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
2026 Tata Punch EVని కొనుగోలు చేయాలనుకుంటే, వివిధ బ్యాంక్‌లు & ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్/కార్‌లోన్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. కారు ఆన్-రోడ్ ధరలో 10% నుంచి 15% వరకు కనీస డౌన్‌పేమెంట్ చేస్తే చాలు. ఉదాహరణకు.. సుమారు రూ.1.82 లక్షలు (డౌన్‌పేమెంట్) ఉన్నా చాలు, పంచ్ EV బేస్ మోడల్ Smart 30kWh ని కొనేయవచ్చు.
బ్యాంక్‌లు & ఫైనాన్స్ కంపెనీల తాజా వడ్డీ రేట్లు
ప్రస్తుతం, దాదాపుగా అన్ని జాతీయ బ్యాంక్‌లు & NBFCలు ఎలక్ట్రిక్ కార్ లోన్లపై ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తున్నాయి. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లు 8.5% నుంచి 10.5% మధ్యలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: 2026 Tata Punch EV: 468km రేంజ్ అని కంపెనీ చెప్పింది.. కానీ రియల్ వరల్డ్‌లో ఎంతదూరం వెళ్లిందంటే?
మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు EMI లెక్కలు
మీరు తీసుకునే లోన్ వ్యవధి (Tenure) ని బట్టి నెలవారీ EMI మారుతుంది. ఉదాహరణకు, మీరు.. 2026 Tata Punch EV బేసిక్ వేరియంట్ Smart 30kWh కొనాలనుకుంటే, కనీస డౌన్‌పేమెంట్ రూ.1.82 లక్షలు కట్టగా, మిగిలిన రూ.8.48 లక్షలను లోన్‌గా తీసుకోవాలి. ఈ రుణం మొత్తానికి 10.50% వడ్డీని బ్యాంక్ వసూలు చేస్తుందని అనుకుంటే, అంచనా EMI వివరాలు ఇవిగో:
మూడేళ్ల వ్యవధి (36 నెలలు): నెలకు సుమారు రూ.27,5000 చెల్లించాల్సి ఉంటుంది.
ఐదేళ్ల వ్యవధి (60 నెలలు): నెలకు సుమారు రూ.18,242 EMI పడుతుంది.
ఏడేళ్ల వ్యవధి (84 నెలలు): నెలకు సుమారు రూ.14,200 EMI చెల్లించవచ్చు.
మీకు తక్కువ EMI కావాలంటే ఏడేళ్ల టెన్యూర్‌ను ఎంచుకోవచ్చు. అయితే, టెన్యూర్ పెరిగేకొద్దీ చెల్లించాల్సిన మొత్తం వడ్డీ కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి: రూ.1.10 లక్షల ధరతో సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 243km తిరిగిరావచ్చు!
ముఖ్యమైన గమనిక: కార్ లోన్ తీసుకునే ముందు కనీసం మూడు, నాలుగు బ్యాంక్‌లు & ఫైనాన్స్ సంస్థల వడ్డీ రేట్లను పోల్చి చూడటం మంచిది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపులు, పండుగ ఆఫర్ల గురించి డీలర్‌ను అడిగి తెలుసుకోండి. EV ఛార్జింగ్ సెటప్‌పై సబ్సిడీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















