అన్వేషించండి

Diwali Discount: మీ ఫేవరేట్‌ Tata Nexon మీద ₹2 లక్షల వరకు డిస్కౌంట్‌, ఈ దీపావళికి మీకు వాహన యోగం!

2025 Diwali Discount On Tata Nexon: టాటా మోటార్స్ తన నెక్సాన్ SUV పై ₹2 లక్షల వరకు దీపావళి డిస్కౌంట్ అందిస్తోంది. నెక్సాన్‌ నిండా మోడ్రన్‌ ఫీచర్లే. దీనికి చాలా రైవల్స్‌ కూడా ఉన్నాయి.

Tata Nexon GST Benefit 2025: దీపావళి సమీపిస్తుండటంతో, దేశవ్యాప్తంగా కార్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి చాలా ఆఫర్లు & డిస్కౌంట్లు ప్రకటించాయి. టాటా మోటార్స్ కూడా, తన మోస్ట్‌ పాపులర్‌ SUV టాటా నెక్సాన్‌పై ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం, కంపెనీ రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో... రూ. 1.55 లక్షల పన్ను ప్రయోజనం (GST 2.0) & రూ. 45,000 వరకు అదనపు ఆఫర్‌లు ఉన్నాయి. టాటా నెక్సాన్‌, 2025 సెప్టెంబర్‌లో ఈ బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన SUV. టాటా మోటార్స్ నెలవారీ అమ్మకాల రికార్డును ఇది డ్రైవ్‌ చేసింది.

టాటా నెక్సాన్ ఫీచర్లు & వేరియంట్లు 
టాటా నెక్సాన్, దాని విభాగంలో అత్యంత వెర్సటైల్‌ SUV, మల్టీ ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో లభిస్తుంది. 'Smart', 'Creative' & 'Fearless' వంటి కొత్త లేబుళ్లతో వేరియంట్‌లను ప్రవేశపెట్టారు. ప్రతి వేరియంట్ లక్షణాలు & సాంకేతికత పరంగా భిన్నంగా ఉంటుంది. ఈ వేరియంట్లను పెట్రోల్-5MT & CNG-6MT ఇంజిన్ ఎంపికలతో కొనవచ్చు. ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX, హిల్-హోల్డ్ అసిస్ట్, LED DRLs, 16-అంగుళాల స్టీల్ వీల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & మల్టీ-డ్రైవ్ మోడ్స్‌ (ఎకో, సిటీ, స్పోర్ట్స్) వంటి కీలక ఫీచర్లు దీనిలో ఉన్నాయి.

Tata Nexon Smart+ & Smart+ S
స్మార్ట్+ వేరియంట్ 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, రిమోట్ సెంట్రల్ లాకింగ్ & స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌ ఉన్నాయి. 
స్మార్ట్+ S వేరియంట్‌లో.. స్మార్ట్+ ఫీచర్లతో పాటు ఆటో హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు & సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tata Nexon Creative & Creative+
క్రియేటివ్ వేరియంట్‌లో 360-డిగ్రీల కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటో క్లైమేట్ కంట్రోల్ & 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. 
క్రియేటివ్+ వేరియంట్‌లో... క్రియేటివ్ వేరియంట్‌ ఫీచర్లతో పాటు సన్‌రూఫ్ & ఆటోమేటిక్ వైపర్‌లు కూడా ఉన్నాయి, దీంతో ఈ వేరియంట్‌ మరింత విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది.

Tata Nexon Creative+ PS & Fearless+ PS
ఈ రెండు వేరియంట్లు నెక్సాన్ లైనప్‌లో అగ్రశ్రేణి మోడల్‌లు. 
పనోరమిక్ సన్‌రూఫ్, ముందు & వెనుక పార్కింగ్ సెన్సార్లు, వైర్‌లెస్ ఛార్జర్, JBL సౌండ్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్ & కనెక్టెడ్‌ కార్ టెక్నాలజీ వంటి హై-టెక్ ఫీచర్‌లను ఈ వేరియంట్లు  అందిస్తున్నాయి. 
ఫియర్‌లెస్+ PS వేరియంట్‌ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, వెల్కమ్ టెయిల్‌లైట్స్ యానిమేషన్ & లెథరెట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లను కూడా అందిస్తుంది.

డిస్కౌంట్ ఎంత & ఎక్కడ ప్రయోజనం పొందవచ్చు?
టాటా నెక్సాన్‌పై కస్టమర్లు ₹1.55 లక్షల వరకు GST 2.0 పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు. దీనికి అదనంగా, నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు & కార్పొరేట్ పథకాలు సహా ₹45,000 వరకు విలువైన అదనపు ఆఫర్‌లను కూడా చేర్చారు. దీని అర్థం కస్టమర్లు మొత్తం ₹2 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లు కారు వేరియంట్ & నగరాన్ని బట్టి మారవచ్చు. పుల్‌ బెనిఫిట్స్‌ పొందేందుకు, కస్టమర్లు తమ సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ను సంప్రదించాలని కంపెనీ సిఫార్సు చేస్తోంది.

టాటా నెక్సాన్‌కు పోటీగా నిలిచే కార్లు
టాటా నెక్సాన్‌ ఒక కాంపాక్ట్ SUV కాబట్టి దీనికి పోటీ ఎక్కువ. కాంపాక్ట్ SUV విభాగంలోని అనేక ప్రసిద్ధ మోడళ్లు - మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV3XO, నిస్సాన్ మాగ్నైట్ & మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఈ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ SUVలన్నీ డిజైన్, ఫీచర్లు & ఇంజిన్ పనితీరు పరంగా ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వెహికల్స్‌ మీద కూడా GST తగ్గుతుంది. మారుతి బ్రెజ్జాపై సేవింగ్‌ ₹43,000 నుంచి ₹1.12 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూపై ప్రయోజనాలు ₹1.15 లక్షల నుంచి ₹1.33 లక్షల వరకు ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

8 స్పీడ్‌ AT నుంచి సీట్‌ మసాజర్‌ వరకు.. కొత్త స్కోడా స్లావియాలో వచ్చిన ఇంప్రూవ్‌మెంట్స్‌ ఇవే
పాత స్లావియాకు గుడ్‌బై చెప్పొచ్చు! కొత్త స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే అప్‌డేట్స్‌
మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేస్తోంది.. ధర పెరిగినా ఫీచర్లలో మాత్రం అదిరిపోయే అప్‌డేట్స్!
సెప్టెంబర్ 5న కొత్త మారుతి బలెనో.. భారీ స్క్రీన్‌ నుంచి న్యూ లుక్‌ వరకు కీలక మార్పులు!
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
RE క్లాసిక్ 350కి ఆర్మీ టచ్.. కొత్త గోర్ఖా ఎడిషన్ కొనేముందు తెలుసుకోవాల్సిన 7 సంగతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి అట్రాక్టివ్‌ లుక్.. గోర్ఖా ఎడిషన్‌లో ఉన్న 7 ప్రత్యేకతలు ఇవే

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget