Upcoming Cars in India: సూపర్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేయనున్న మహీంద్రా, టాటా - 2024లోనే ఎంట్రీ!
Mahindra New Car: టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయి.
Tata Curvv EV and Mahindra XUV.e9: 2024 రెండో త్రైమాసికం ప్రారంభమైంది. ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో ఇప్పటికే అనేక కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. రానున్న కాలంలో మరిన్ని అద్భుతమైన కార్లు మనదేశంలో లాంచ్ కానున్నాయి. ముఖ్యంగా టాటా మోటార్స్, మహీంద్రా నుంచి కూపే ఎస్‌యూవీలు ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో లాంచ్ కానున్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా కర్వ్ (Tata Curvv EV)
టాటా కర్వ్ ఈ సంవత్సరం దేశంలో మోస్ట్ అవైటెడ్ లాంచ్‌ల్లో ఒకటి. ఇది ఐసీఈ, ఈవీ రెండు వెర్షన్లలో లాంచ్ కానుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన 2024 భారత్ మొబిలిటీ షోలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న టాటా కర్వ్‌ను ఆవిష్కరించారు. ఈ కూపే ఎస్‌యూవీ దాని టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. దీని కారణంగా అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
టాటా కర్వ్ ఈవీలో... టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ వంటి బ్యాటరీ ప్యాక్ అందిస్తారని భావిస్తున్నారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 450 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను ఇది అందించనుంది. పెట్రోల్ వెర్షన్ 1.2 లీటర్ టర్బో ఇంజన్‌తో మల్టీపుల్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందవచ్చని అంచనా. టాటా కర్వ్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూయిజర్ టేజర్‌లతో పోటీపడనుంది. అయితే ఇది ఈ సెగ్మెంట్లో అత్యుత్తమ ఫీచర్లను కలిగి ఉంటుంది.
A concept that's way ahead of the curve! #CurvvEV#TATAMotors #TATAEV #EV #TATA #TATACurvv #GoEV #Curvv pic.twitter.com/Lmd2gFWnBr
— TATA.ev (@Tataev) June 24, 2023
మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9 (Mahindra XUV.e9)
మహీంద్ర తను లాంచ్ చేయనున్న అనేక ఎస్‌యూవీలను కాన్సెప్ట్ రూపంలో 2022 ఆగస్టు 15వ తేదీన వెల్లడించింది. వాటిలో ఒకటి ఎక్స్‌యూవీ.ఈ9 కూపే ఎస్‌యూవీ. దేశ రహదారులపై టెస్టింగ్ రన్ సమయంలో ఇది చాలాసార్లు కవర్లతో కనిపించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ.ఈ9కు సంబంధించిన కొన్ని కీలకమైన డిజైన్ ఎలిమెంట్స్‌లో డ్యూయల్ పాడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ట్విన్ వర్టికల్ షేప్‌లో ఉన్న ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 5 స్పోక్ ఏరో డిజైన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.
ఇంగ్లో ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ ఆల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 80 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 450 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఇవ్వగలదు. ఇది పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, టచ్ ఆధారిత ఏసీ కంట్రోల్ వంటి అనేక ప్రీమియం ఫీచర్‌లను కూడా కలిగి ఉంటుంది.
We revealed the BE.RALL-E concept at the #GrandHomecoming in Hyderabad, last year. Today, we proudly showcase it to the public at the Bharat Mobility Global Expo 2024.#TakeTheLeap #InfinitePossibilities #BharatMobilityExpo2024 pic.twitter.com/Aq2q3l3aCe
— Mahindra Electric SUVs (@mahindraesuvs) February 2, 2024
Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!