Tata Price Hike: టాటా కార్లు కొనాలనుకుంటున్నారా - అయితే మీకు బ్యాడ్ న్యూస్ - స్వల్పంగా ధరల పెంపు!
మనదేశంలో టాటా కార్ల ధరలు స్వల్పంగా పెరిగాయి.
Price Hike on Cars: టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో అన్ని మోడల్స్, వాటి వేరియంట్ల ధరలపై 0.6 శాతం స్వల్ప పెరుగుదలను ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు జూలై 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పెరుగుదలకు కారణం వాహనాల ధరలలో ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం. ఈ ధరల పెరుగుదల కారణంగా కంపెనీ ఐసీఈ ఇంజిన్ ఎస్‌యూవీలు దాదాపు రూ. 20,000 వరకు పెరిగాయి. టాటా నెక్సాన్, హ్యారియర్‌తో పాటు సఫారీ వంటి వాహనాలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
ఈ పెరుగుదల తర్వాత టాటా నెక్సాన్ ధర ఇప్పుడు రూ. 8 లక్షల నుంచి రూ. 14.60 లక్షల మధ్యలో ఉంది. మరోవైపు హారియర్ ధర ఇప్పుడు రూ. 15.20 లక్షల నుంచి రూ. 24.27 లక్షల మధ్యలో ఉంది. సఫారీ ధర గురించి చెప్పాలంటే దాని ధర రూ. 15.85 లక్షల నుంచి రూ. 25.22 లక్షల మధ్యకు చేరుకుంది. ఈ వాహనాల ధరలన్నీ ఎక్స్ షోరూమ్‌వే.
టాటా మోటార్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం జూలై 16వ తేదీ వరకు వరకు బుక్ చేసుకున్న వాహనాలు, జూలై 31వ తేదీ వరకు డెలివరీ అయ్యే కార్లపై పెరిగిన ధరలు వర్తించవు. ఇంజిన్ గురించి చెప్పాలంటే నెక్సాన్ 120 పీఎస్ పవర్ జనరేట్ చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 115 పీఎస్ పవర్ ఉత్పత్తి చేసే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో రానుంది.
హారియర్, సఫారీ విషయానికి వస్తే రెండూ 170 పీఎస్ గరిష్ట శక్తిని, 350 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎఫ్‌సీఏ సోర్స్డ్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వచ్చాయి. ఇది కాకుండా టాటా మోటార్స్ ఇటీవలే ఆల్ట్రోజ్ ఎక్స్ఎం, ఎక్స్ఎం (ఎస్) రెండు కొత్త వేరియంట్‌లను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 6.90 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నెక్సాన్ కారు 2020లో మార్కెట్లో లాంచ్ అయింది. టాటా నెక్సాన్ తక్కువ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా మారింది. కొత్త కస్టమర్లకు ఇది ఫేవరెట్ ఆప్షన్‌గా మారింది. అలాగే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా మారింది. కేవలం మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే టాటా నెక్సాన్ 50,000 యూనిట్ల అమ్మకాలు సాధించింది. మనదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఈవీగా నిలిచింది. మొత్తమ్మీద నెక్సాన్, దాని వేరియంట్‌లు దేశీయ మార్కెట్‌లో 15 శాతం అమ్మకాలను సొంతం చేసుకున్నాయి.
టాటా ప్రస్తుతం నెక్సాన్‌కు సంబంధించి విభిన్న మోడళ్లను విక్రయిస్తుంది. ఇందులో ఈవీ ప్రైమ్, ఈవీ మ్యాక్స్ అలాగే దాని డార్క్ ఎడిషన్ ఉన్నాయి. మరోవైపు నెక్సాన్ ఈవీ ప్రైమ్ ధర గురించి చెప్పాలంటే దీనిని ప్రారంభ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 18.79 లక్షలుగా నిర్ణయించారు. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం కేవలం మూడు సంవత్సరాలలో 50,000 ఎలక్ట్రిక్ నెక్సాన్‌ల విక్రయం జరిగింది. అంటే ఈ-మొబిలిటీ రంగంలో మార్పు కోసం భారతదేశం ఎంత సిద్ధంగా ఉందో తెలుస్తోంది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial