Tata Curvv EV Safety Rating: సేఫ్టీ రేటింగ్స్‌లో టాటా బెస్ట్ - ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఇవే!
Best Tata Cars in Safety: టాటా కార్లు మార్కెట్లో మంచి సేఫ్టీ రేటింగ్‌ను పొందుతాయి. దీంతో తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న సేఫ్ కార్లు కొనాలనుకునేవారికి టాటా కార్లు మంచి ఆప్షన్లుగా మారుతున్నాయి.
Tata Cars Safety Rating: మనం ఎప్పుడు కారు కొన్నా ఈ కారు మన కుటుంబానికి సురక్షితమా కాదా అనే ప్రశ్న మనలో మెదులుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో మనం కొనుగోలు చేసే కారుకు ఎలాంటి సేఫ్టీ రేటింగ్ వచ్చిందనేది ముఖ్యం. మార్కెట్‌లో ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ కార్లు చాలా ఉన్నాయి. కానీ ఈ కార్లు సేఫ్టీ రేటింగ్ పరంగా చాలా వెనకబడి ఉన్నాయి.
ఇటీవలే భారత్ NCAP ద్వారా మూడు టాటా కార్లను క్రాష్ టెస్ట్ చేశారు. వీటిలో అన్నీ సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ జాబితాలో టాటా కర్వ్, కర్వ్ ఈవీ, నెక్సాన్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కార్లు పెద్దలు, పిల్లలు అందరికీ పూర్తిగా సురక్షితం.
టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)
టాటా కర్వ్ ఈవీ అనేది టాటా ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో సరికొత్త మోడల్. దీనికి మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో 5 స్టార్ ఎన్‌సీఏపీ రేటింగ్‌ను పొందింది. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ మొదటి ఎస్‌యూవీ కూపే పెద్దల భద్రత కోసం 32.00 పాయింట్లకు 30.81 పాయింట్లను పొందింది. ఎలక్ట్రిక్ కర్వ్ పిల్లల భద్రత కోసం 49.00కి 44.83 పాయింట్లను పొందింది.
టాటా కర్వ్ ఐసీఈ (Tata Curvv ICE)
టాటా కర్వ్ ఎలక్ట్రిక్, అలాగే దాని ఐసీఈ మోడల్ కూడా మార్కెట్లో లాంచ్ అయింది. ఇది ఎన్‌సీఏపీలో 5 స్టార్ రేటింగ్‌ను కూడా సాధించింది. పెద్దల భద్రత కోసం ఈ కారు 32.00కి 29.50 పాయింట్లను పొందగా... పిల్లల భద్రత కోసం 49.00కి 43.66 పాయింట్లను పొందింది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)
ఇప్పుడు టాటా నెక్సాన్ ఈవీ గురించి మాట్లాడుకోవాలి. టాటా నెక్సాన్ ఈవీని కూడా భారత్ ఎన్‌సీఏపీ ద్వారా క్రాష్ టెస్ట్ చేశారు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన ఈ ఎలక్ట్రిక్ కారు పెద్దల భద్రత కోసం 32.00కి 29.86 పాయింట్లను పొందగా, పిల్లల భద్రత కోసం 49.00కి 44.95 పాయింట్లను పొందింది.
టాటా నెక్సాన్ ఐసీఈ (Tata Nexon ICE)
టాటా నెక్సాన్ ఐసీఈని కూడా క్రాష్ టెస్ట్ చేశారు. ఇది అన్ని సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. దీని కారణంగా ఇది క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా సాధించింది. పెద్దల భద్రత కోసం ఇది 32.00కి 29.41 పాయింట్లను పొందగా, పిల్లల భద్రత కోసం 49.00కి 43.83 పాయింట్లను పొందింది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
POV: You drove home India’s safest car, at its lowest price ever. 🚙
— TATA.ev (@Tataev) October 6, 2024
That’s right! Get a price drop of ₹1.2L* on Punch.ev and enjoy festivities beyond everyday. ✨
Offer lasts till 31st October, 2024. So, hurry up!
New festive price:
Punch.ev - ₹9.99 Lakh*
Book now -… pic.twitter.com/ivIG5ZUeoh