Tata Altroz vs Tiago : ఆల్ట్రోజ్ వర్సెస్ టియాగో; మధ్యతరగతికి ఏది బెస్ట్? పూర్తి గైడ్ ఇదే !
Tata Altroz vs Tiago : టాటా కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్, టియాగో మోడల్స్ కూడా అత్యంత ప్రజాదరణ పొందినవే. అయితే రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. వాటి గురించి తెలిస్తే ఏది ఎంపిక చేసుకోవాలో తెలుస్తుంది.

Tata Altroz vs Tiago : భారతీయ ఆటోమొబైల్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిన టాటా మోటార్స్, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తన హ్యాట్రిక్ విజయాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కారు కొనాలనుకుంటే మొదట చూస్తున్న పేర్లు టాటా ఆల్ట్రోజ్, టాటా టియాగో. అయితే ఈ రెండింటిలో ఏది మీ ఇంటికి సరిపోతుంది. ధర, భద్రత మైలేజ్, సౌకర్యాల పరంగా కారు పై చేయి సాధిస్తుందో చూద్దాం.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు కంపాక్ట్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి మహా నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా, సులభంగా నడపగలిగే టియాగో ఒక వైపు, హైవే ప్రయాణాల్లో తిరుగులేని భద్రతనిచ్చే ఆల్ట్రోజ్ మరోవైపు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. టాటా మోటార్స్ ఈ రెండు మోడల్స్‌ను వేర్వేరు లక్ష్యాలతో రూపొందించారు.
ధరల విశ్లేషణ- బడ్జెట్ ఎవరికి అనుకూలం
ధర విషయంలో ఈ రెండు కార్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. మీరు మొదటిసారి కారు కొంటున్న మధ్యతరగతి కుటుంబం అయితే టియాగో మంచి ఎంపిక కావచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ ధరలు రూ. 4.57 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియెంట్ రూ. 7.82 లక్షల వరకు ఉన్నాయి.
మరోవైపు కొంచెం ఎక్కువ ఖర్చు చేసినా ఫర్వాలేదు. లగ్జరీ, ప్రీమియ ఫీచర్లు కావాలనుకునే వారికి ఆల్ట్రోజ్ అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 6.30 లక్షల నుంచి మొదలై 10.51 లక్షల వరకు విస్తరించాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఆన్‌రోడ్ ధరలు స్థానిక పన్నులు, ఇన్సూరెన్స్ కారణంగా సుమారు 12 లక్షల వరకు చేరవచ్చు.
భద్రతలో ఆల్ట్రోజ్ రారాజు
నేటి కాలంలో కారు కొనేటప్పుడు భద్రత అనేది ప్రాధాన్యతగా మారింది. ఈ విషయంలో ఆల్ట్రోజ్ తన సత్తా చాటుతోంది. భరత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో ఈ కారు అడల్ట్, చైల్డ్ ప్రొటెక్షన్‌లో -స్టార్ రేటింగ్ సాధించి, భారత దేశంలోనే అత్యంత సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, 360- డిగ్రీ వ్యూ కెమెరా, ఈఎస్‌సీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
దీనికి భిన్నంగా టియాగో కేవలం 2 ఎయిర్ బ్యాగులతో ప్రాథమిక భద్రతా ఫీచర్లు మాత్రమే కలిగి ఉంది. అయితే ఇందులో కూడా ఏబీఎస్ ఈఎస్‌సీ,హిల్ అసిస్ట్ వంటి సౌకర్యాలు ఉండటం సానుకూల అంశం.
టెక్నాలజీ- ఫీచర్లు
సాంకేతికత పరంగా చూస్తే, ఆల్ట్రోజ్ ఒక స్మార్ట్ కారుగా కనిపిస్తుంది. ఇందులో 10.24 ఇంచ్ భారీ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వాయిస్ అసిస్టెడ్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సంగీత ప్రియుల కోసం ఇందులో నాలుగు స్పీకర్లు, నాలుగు ట్వీటర్లు ఇచ్చారు.
టియాగోలో ఫీచర్లు కొంత పరిమితంగా ఉన్నప్పటికీ, సిటీ డ్రైవింగ్‌కు అవసరమైన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, వాయిస్ కమాండ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
మైలేజ్, రేంజ్-టియాగో సీఎన్జీ మ్యాజిక్
పెరుగుతున్న పెట్రోల్ ధరల వేళ మైలేజ్ అనేది అత్యంత కీలకమైన అంశం. ఇక్కడ టియాగో పైచేయి సాధించింది. ముఖ్యంగా టియాగో సీఎన్జీ వేరియంట్ కిలోకు 28.06 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని అందిస్తూ, తెలుగు రాష్ట్రాల్లోని ఇంధన ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.
ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌లలో లభిస్తున్నప్పటికీ మైలేజ్ విషయంలో టియాగో అంతటి సమర్థను చూపలేదు. హైవే ప్రయాణాలకు ఆల్ట్రోజ్ డీజిల్ వేరియంట్ మెరుగైన రేంజ్‌ను ఇవ్వగలదు.
డ్రైవింగ్ కంఫర్ట్- స్పేస్
కుటుంబంతో కలిసి సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఆల్టోజ్ కంఫర్ట్ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తుంది. దీని పొడవు (399మి.మీ), వీల్ బేస్(2501మి.మీ) టియాగో కంటే పెద్దవి కావడంతో లోపల విశాలమైన స్థలం లభిస్తుంది. అంతేకాకుండా 34 లీటర్ల బూట్ స్పేస్ లగేజీని సర్దుకోవడానికి ఎంతో అనుకూలం.
టియాగో కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల సిటీ ట్రాఫిక్‌లో సులంభంగా నడపవచ్చు. కానీ లాంగ్ ట్రిప్స్‌లో వెనుక సీటులో కూర్చునే వారికి స్థలం తక్కువగా అనిపించవచ్చు. టియాగోలో బూట్ స్పేస్ కేవలం 242 లీటర్లు మాత్రమే ఉంటుంది.
రెండు కార్లలోనూ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నప్పటికీ, పవర్ డెలివరీలో స్వల్ప తేడాలు ఉన్నాయి. ఆల్ట్రోజ్ 86.79బీహెచ్‌పీ పవర్‌ని ఇస్తే, టియాగో 8.82 బీహెచ్‌పీని అందిస్తుంది. ఇక్కడ ప్రధాన వ్యత్యాసం ట్రాన్స్‌మిషన్‌లో ఉంది. ఆల్ట్రోజ్ 6-స్పీడ్ డీసీఏ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఇది గేర్ షిప్టింగ్ సమయంలో సున్నితమైన అనుభూతిని ఇస్తుంది. టియాగోలో 5- స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ఉంది. ఇది బడ్జెట్ పరంగా మంచిదైనప్పటికీ ఆల్ట్రోజ్ అంతటి స్మూత్ డ్రైవింగ్‌ను అందించదు.
ఏది ప్లస్ ఏది మైనస్
ఆల్ట్రోజ్ ప్లస్‌పాయింట్స్: అత్యుత్తమ 5స్టార్ సేఫ్టీ, విశాలమైన స్పేస్, సన్‌రూఫ్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లు.
మైనస్ పాయింట్స్: ధర ఎక్కువ, మైలేజ్ విషయంలో స్పష్టత లేదు.
టియాగో ప్లస్ పాయింట్స్: తక్కువ ధర, సీఎన్జీ మైలేజ్ అద్భుతం, సిటీ డ్రైవింగ్‌కు సులభం.
మైనస్‌పాయింట్స్:భద్రతా ఫీచర్లు తక్కువ, చిన్న బూట్ స్పేస్, బేసిక్‌ఇంటీరియర్స్



















