అన్వేషించండి

హోండా అమేజ్ గట్టి పోటీగా మార్కెట్‌లోకి వచ్చిన కొత్త టాటా ఏరిస్‌.. టాప్ వేరియంట్లలో ఏ కారులో ఫీచర్లు ఎక్కువ?

టాటా ఏరిస్ & హోండా అమేజ్ టాప్ వేరియంట్ల ధరలు, ఇంజిన్, ఫీచర్లు, భద్రత, స్థలం వివరాలను పోల్చి చూసి, ఏది విలువైన కారో అర్ధం చేసుకుందాం.

Tata Aeris vs Honda Amaze: కాంపాక్ట్ సెడాన్ విభాగంలో టాటా మోటార్స్ తీసుకొచ్చిన కొత్త మోడల్‌.. ఏరిస్‌. టిగోర్ ఆధారంగా ఈ కారును రూపొందించింది. అయితే.. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో ఏరిస్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. మరోవైపు.. హోండా అమేజ్ ఇప్పటికే మూడో తరం మోడల్‌గా మార్కెట్‌లో కొనసాగుతోంది. ఈ రెండు కార్లలో టాప్ వేరియంట్లు.. ఏరిస్ అకాంప్లిష్డ్ & అమేజ్ ZX. ఈ రెండు వేరియంట్లను పోల్చి, ఏది బెటర్‌గా ఉందో తెలుసుకుందాం.

కొలతల్లో ఏ కారు పెద్దది?

ఏరిస్ & అమేజ్ రెండింటి పొడవు 3,995mm. అయితే, వెడల్పులో అమేజ్ ముందుంది. అమేజ్ వెడల్పు 1,733mm కాగా, ఏరిస్ 1,684mmగా ఉంది. ఏరిస్ ఎత్తు 1,532mm. అమేజ్ ఎత్తు 1,500mm.

వీల్‌బేస్ విషయంలో అమేజ్ 2,470mmతో ముందుంది. ఏరిస్ వీల్‌బేస్ 2,450mm. గ్రౌండ్ క్లియరెన్స్‌లోనూ అమేజ్‌దే స్వల్ప ఆధిక్యం. ఏరిస్‌లో 170mm, అమేజ్‌లో 172mm క్లియరెన్స్ ఉంది.

బూట్ స్పేస్ మాత్రం ఏరిస్‌లో ఎక్కువ. ఇది 419 లీటర్లు. అమేజ్‌లో 416 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.

ఇంజిన్‌లో కీలక తేడాలు

ఏరిస్‌లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మూడు సిలిండర్ల యూనిట్. పెట్రోల్ వెర్షన్‌లో 86hp పవర్ & 113Nm టార్క్ అందిస్తుంది. CNG వెర్షన్‌లో 76hp పవర్ & 97Nm టార్క్ వస్తుంది.

అమేజ్‌లోనూ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది నాలుగు సిలిండర్ల యూనిట్. 90hp పవర్ & 110Nm టార్క్ అందిస్తుంది.

గేర్‌బాక్స్ విషయంలోనూ తేడా ఉంది. ఏరిస్‌లో 5 స్పీడ్ మాన్యువల్ & 5 స్పీడ్ AMT ఎంపికలు ఉన్నాయి. అమేజ్‌లో 5 స్పీడ్ మాన్యువల్ & CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.

ఏరిస్ ప్రత్యేకత CNG ఆటోమేటిక్ ఎంపిక. టాప్ వేరియంట్‌లో ఫ్యాక్టరీ ఫిటెడ్ CNGతో AMTను ఎంచుకోవచ్చు. అమేజ్‌లో CNG ఎంపిక ఉన్నప్పటికీ అది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఖరీదైన కార్లకే కాదు.. తక్కువ ధర కార్లలోనూ ADAS సేఫ్టీ ఫీచర్లు! సుజుకి కొత్త ప్లాన్ ఇదే

ఫీచర్లలో ఏరిస్ దూకుడు

రెండు కార్లలో LED లైట్లు, LED టెయిల్ లైట్లు, DRLs, ఫాగ్ ల్యాంప్స్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ ORVMలు & షార్క్ ఫిన్ యాంటెన్నా ఉన్నాయి. ఏరిస్‌లో డ్యూయల్ టోన్ కలర్‌ ఆప్షన్‌ ఉంది. అమేజ్‌లో మోనోటోన్ కలర్స్‌ మాత్రమే ఉన్నాయి.

క్యాబిన్‌లో ఏరిస్‌కు కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. అమేజ్‌లో 8 అంగుళాల స్క్రీన్ ఉంది. రెండు కార్లలోనూ వైర్‌లెస్ Android Auto & Apple CarPlay లభిస్తాయి.

ఏరిస్‌లో ముందు సీట్ల వెంటిలేషన్, లెదరెట్ సీట్లు & కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఉన్నాయి. అమేజ్‌లో ఇవి లేవు. రెండు కార్లలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్ & వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఉన్నాయి.

భద్రతలో అమేజ్‌కు ప్రత్యేకత

రెండు కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ESC, ట్రాక్షన్ కంట్రోల్, TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్ & వెనుక పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఏరిస్‌లో 360 డిగ్రీ కెమెరా & డ్యాష్‌క్యామ్ రికార్డింగ్ ఉన్నాయి. అమేజ్‌లో వెనుక కెమెరా ఉంటుంది. అయితే అమేజ్‌లో Level 1 ADAS లభిస్తుంది. ఏరిస్‌లో ADAS లేదు.

BNCAP పరీక్షలో అమేజ్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఏరిస్ ఇంకా BNCAPలో పరీక్షించబడలేదు. ఏరిస్ ఆధారమైన టిగోర్ GNCAPలో 4 స్టార్ రేటింగ్ సాధించిన విషయం గమనించాలి.

ఇది కూడా చదవండి: కొత్త కారు కొనడానికి మీ బడ్జెట్‌ రూ.6 లక్షల లోపే ఉందా? అయినా పర్లేదు, ఎన్నో ఆప్షన్లు

ధరలో భారీ తేడా

ఏరిస్ అకాంప్లిష్డ్ (టాప్‌ వేరియంట్‌) పెట్రోల్ మాన్యువల్ ధర రూ.8.20 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.8.75 లక్షలు. CNG మాన్యువల్ ధర రూ.9.20 లక్షలు కాగా, CNG ఆటోమేటిక్ ధర రూ.9.75 లక్షలు.

అమేజ్ ZX (టాప్‌ వేరియంట్‌) పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.39 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.10 లక్షలు.

ఒకే రకమైన పవర్‌ట్రెయిన్‌ను పోల్చి చూసినప్పుడు.. అమేజ్ ధర కంటే ఏరిస్ ధర రూ.1.25 లక్షల వరకు తక్కువగా ఉంది. అంతేకాదు, ఏరిస్‌లో ఎక్కువ ఫీచర్లు & మరిన్ని పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు ఉన్నాయి. అమేజ్‌లోని CVT గేర్‌బాక్స్ AMT కంటే మరింత సెన్సిటివ్‌ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. అయితే ధర, ఫీచర్లు, ఎంపికలను కలిపి చూస్తే ఈ రెండు కార్ల మధ్య గణనీయమైన తేడా కనిపిస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో లభించే Best CNG Cars ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget