అన్వేషించండి

Car Maintenance Tips: కార్లలో స్పేర్ వీల్ vs రిపేర్ కిట్: మన రోడ్లపై ఏది సేఫ్?

Car Maintenance Tips:మోడర్న్ కార్లలో స్పేర్ వీల్ స్థానంలో రిపేర్ కిట్స్ వస్తున్నాయి. అయితే ఇండియ‌న్ రోడ్లపై ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయనేది ఇప్పుడు చూద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్యూబ్‌లెస్ టైర్లకు స్పేర్ వీల్ అవసరం లేదన్న నిబంధన మార్పు.
  • టైర్ రిపేర్ కిట్స్ చిన్నపాటి పంక్చర్లకు తాత్కాలిక పరిష్కారం.
  • భారత రోడ్ల పరిస్థితులకు స్పేర్ వీల్ అత్యంత సురక్షితమైన మార్గం.
  • అత్యవసర సమయాల్లో స్పేర్ వీల్ ద్వారా త్వరితగతిన ప్రయాణం కొనసాగించవచ్చు.

Car Maintenance Tips:కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం, 3.5 టన్నుల లోపు బరువున్న వాహనాలకు ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటే స్పేర్ వీల్ (Spare Wheel) అవసరం లేదని 2020లో సవరణ చేశారు. దీనివల్ల కార్ల తయారీ కంపెనీలు బూట్ స్పేస్ పెంచడానికి స్పేర్ వీల్ తీసేసి, దాని బదులు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), టైర్ ప్యాచ్ కిట్‌లను ఇస్తున్నాయి. చాలా బ్రాండ్లు ఈ కొత్త పద్ధతిని పాటిస్తుంటే, మరికొన్ని మాత్రం ఇప్పటికీ ఐదో టైర్‌ను అందిస్తున్నాయి. అయితే మన దేశంలోని రోడ్లను బట్టి చూస్తే కేవలం రిపేర్ కిట్ నమ్ముకోవడం ఎంతవరకు సమంజసమ‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

రిపేర్ కిట్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు

టైర్ రిపేర్ కిట్ వాడటం వల్ల డిక్కీలో స్థలం ఆదా అవుతుంది. తయారీ ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ కిట్‌లో సాధారణంగా ఒక ఎయిర్ కంప్రెసర్, సీలెంట్ బాటిల్ ఉంటాయి. టైర్ నాజిల్ ద్వారా సీలెంట్ లోపలికి పంపి రంధ్రాలను మూసివేయవచ్చు. చిన్న చిన్న పంక్చర్లకు ఇది త్వరగా అయిపోయే తాత్కాలిక పరిష్కారం. కానీ, టైర్ సైడ్ వాల్ దెబ్బతిన్నా, టైర్ పూర్తిగా పగిలిపోయినా ఈ కిట్ అస్సలు పనిచేయదు. పదునైన లోహపు ముక్కలు గుచ్చుకున్నప్పుడు సీలెంట్ ఆ గాలి లీకేజీని ఆపలేదు. అలాగే సీలెంట్ బాటిల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అత్యవసర సమయంలో అది ఖాళీగా ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

స్పేర్ వీల్ ఎందుకు ఉత్తమం?

మన రోడ్లపై గుంతలు, పదునైన వస్తువులు ఎక్కడ ఉంటాయో చెప్పలేం. టైర్ పూర్తిగా పాడైపోయినప్పుడు స్పేర్ వీల్ ఉండటమే అన్నిటికంటే సురక్షితమైన మార్గం. పంక్చర్ అయిన టైర్ తీసి, కొత్త వీల్ వేసుకోవడానికి కొన్ని నిమిషాల సమయం సరిపోతుంది. దీనివల్ల ప్రయాణం ఆగిపోదు. ప్రస్తుత కాలంలో వస్తున్న 'స్పేస్ సేవర్' టైర్లతో 80 కి.మీ వేగంతో హైవేలపై ప్రయాణించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. టైర్ వాల్వ్ దెబ్బతిన్నప్పుడు కూడా స్పేర్ వీల్ మాత్రమే ఆదుకుంటుంది.

ఇండియ‌న్ రోడ్ల రియాలిటీ..

మనం అంతర్జాతీయ ప్రమాణాల దిశగా రోడ్లను అభివృద్ధి చేస్తున్నా, నాణ్యత విషయంలో ఇంకా సమస్యలు ఉన్నాయి. కొత్తగా వేసిన రోడ్లపై కూడా వారం తిరగకముందే గుంతలు పడటం, మరమ్మతు పనులు చేస్తూ ఇనుప చువ్వలు, నట్లు రోడ్డుపై వదిలేయడం వంటివి తరచూ చూస్తుంటాం. ఉదాహరణకు 2025లో ముంబై-నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వేపై మరమ్మతుల తర్వాత అల్యూమినియం నాజిల్స్ రోడ్డుపైనే వదిలేయడం వల్ల చాలా వాహనాల టైర్లు దెబ్బతిన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రిపేర్ కిట్ కంటే స్పేర్ వీల్  ఉండటమే రైట్ ఛాయిస్.

నిర్జన ప్రదేశాలలో లేదా అర్ధరాత్రి వేళ టైర్లో సమస్య వస్తే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ (RSA) కోసం గంటల తరబడి వేచి చూడటం కంటే, స్పేర్ వీల్ మార్చుకుని ముందుకు వెళ్లడం తెలివైన పని. వాహనదారులు ఎప్పటికప్పుడు టైర్ రొటేషన్ చేస్తూ, స్పేర్ వీల్‌లో కూడా గాలి ఉందో లేదో సరిచూసుకోవాలి.

Frequently Asked Questions

వాహనాలకు స్పేర్ వీల్ అవసరం లేదని ఎప్పుడు సవరణ చేశారు?

కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం, 3.5 టన్నుల లోపు బరువున్న వాహనాలకు ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటే స్పేర్ వీల్ అవసరం లేదని 2020లో సవరణ చేశారు.

స్పేర్ వీల్ తీసివేయడం వల్ల కార్ల తయారీ కంపెనీలు ఏమి అందిస్తున్నాయి?

స్పేర్ వీల్ తీసివేయడం వల్ల కార్ల తయారీ కంపెనీలు బూట్ స్పేస్ పెంచడానికి, దాని బదులు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), టైర్ ప్యాచ్ కిట్‌లను అందిస్తున్నాయి.

టైర్ రిపేర్ కిట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

టైర్ రిపేర్ కిట్ వాడటం వల్ల డిక్కీలో స్థలం ఆదా అవుతుంది మరియు తయారీ ఖర్చు తగ్గుతుంది. ఇది చిన్న చిన్న పంక్చర్లకు తాత్కాలిక పరిష్కారం.

భారతదేశ రోడ్లపై స్పేర్ వీల్ ఎందుకు ఉత్తమమైన ఎంపిక?

భారతదేశ రోడ్లపై గుంతలు, పదునైన వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, టైర్ పూర్తిగా పాడైపోయినప్పుడు స్పేర్ వీల్ ఉండటమే అన్నిటికంటే సురక్షితమైన మార్గం.

రిపేర్ కిట్ ఎప్పుడు పనిచేయదు?

టైర్ సైడ్ వాల్ దెబ్బతిన్నా, టైర్ పూర్తిగా పగిలిపోయినా, లేదా పదునైన లోహపు ముక్కలు గుచ్చుకున్నప్పుడు రిపేర్ కిట్ అస్సలు పనిచేయదు.

టాప్ హెడ్ లైన్స్

Yamaha R15 కంటే పవర్‌ఫుల్‌.. ధర రూ.2 లక్షలు! ఆగస్టు 27న వస్తున్న R2పై భారీ అంచనాలు
Yamaha R2లో 220cc ఇంజిన్‌! - ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో ఇంకా ఎలాంటి అద్భుతాలు ఉండొచ్చు?
టాటా సియెర్రా vs కియా సెల్టోస్‌ మధ్య స్పీడ్‌ టెస్ట్‌.. ఏ కారు గెలిచింది?
Tata Sierra vs Kia Seltos - డీజిల్‌ ఆటోమేటిక్‌లో ఏ కారుకు దూకుడు ఎక్కువ?
BaaS కింద ఎలక్ట్రిక్‌ కారును కొంటే కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుంది? భారత్‌లో BaaS EVల పూర్తి లిస్ట్ ఇదే!
బ్యాటరీ కొనే పనే లేదు.. కారు ధర ఏకంగా రూ.8.35 లక్షలు తగ్గుతుంది! BaaSతో ఈ EVలన్నీ మీ సొంతం
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget