అన్వేషించండి

స్కోడా కైలాక్, కుషాక్, స్లావియాపై ఫెస్టివ్‌ డిస్కౌంట్లు.. ఏ కారు కొన్నా రూ.వేలల్లో ఆదా చేయొచ్చు!

స్కోడా కైలాక్‌ & కుషాక్‌పై రూ.90,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. స్లావియా ఫేస్‌లిఫ్ట్ ఆఫర్లు, కార్ల ధరలు, డిస్కౌంట్ల వివరాలు తెలుసుకోండి.

Skoda Dasara Discounts October 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే స్కోడా కార్లపై అందుబాటులో ఉన్న ఆఫర్లను ఓసారి పరిశీలించండి. ఈ నెల (అక్టోబర్ 2026)లో, కొన్ని మోడళ్లపై భారీ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో డీలర్ డిస్కౌంట్లు, పాత కారు ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు, లాయల్టీ బెనిఫిట్స్ కలిసి ఉంటాయి. ముఖ్యంగా స్కోడా కైలాక్‌పై రూ.90,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. కుషాక్‌పై రూ.80,000 వరకు, ఇటీవల ఫేస్‌లిఫ్ట్ రూపంలో వచ్చిన స్లావియాపై రూ.30,000 వరకు బెనిఫిట్స్ అందుతాయి.

Skoda Kylaq పై రూ.90 వేల వరకు ఆఫర్లు
 
స్కోడా కంపెనీ అందించే కార్లలో కైలాక్ అత్యంత సరసమైన మోడల్. ఈ కాంపాక్ట్ SUVపై అక్టోబర్ నెలలో రూ.90,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్లలో భాగంగా రూ.40,000 వరకు డీలర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. పాత కారును ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.30,000 వరకు బోనస్ లభించవచ్చు. దీనికి అదనంగా కార్పొరేట్ లేదా లాయల్టీ బెనిఫిట్ రూపంలో రూ.20,000 వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

కైలాక్‌లో 1.0-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందిస్తున్నారు. ఇదే ఇంజిన్ స్కోడా కుషాక్, స్లావియా మోడళ్లలోనూ ఉంటుంది. ఈ SUV ధరలు రూ.7.59 లక్షల నుంచి రూ.13.09 లక్షల వరకు ఉన్నాయి.

మార్కెట్‌లో మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, టాటా నెక్సాన్, కియా సోనెట్ వంటి మోడళ్లకు కైలాక్ పోటీ ఇస్తోంది. తక్కువ ధరలో టర్బో పెట్రోల్ SUV కొనాలనుకునే వారికి ఈ ఆఫర్లు ఉపయోగపడవచ్చు.

ఇది కూడా చదవండి: బడ్జెట్‌ కార్లలో ఏది నంబర్ వన్? అమ్మకాల్లో ముందున్న టాప్ 10 SUVల లిస్ట్‌

Skoda Kushaq పై రూ.80 వేల వరకు బెనిఫిట్స్

స్కోడా కుషాక్ మిడ్‌సైజ్ SUVపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్‌పై రూ.80,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. దీనిలో రూ.30,000 వరకు డీలర్ డిస్కౌంట్, రూ.30,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కలిసి ఉన్నాయి. అలాగే కార్పొరేట్ లేదా లాయల్టీ బెనిఫిట్ రూపంలో మరో రూ.20,000 వరకు ప్రయోజనం లభించవచ్చు.

కుషాక్‌లో 1.0-లీటర్, 1.5-లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ SUV ధరలు రూ.10.69 లక్షల నుంచి రూ.19.19 లక్షల వరకు ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా, కియా సెల్టోస్, రెనో డస్టర్, మారుతి విక్టోరిస్ వంటి మోడళ్లతో కుషాక్ పోటీపడుతోంది. మిడ్‌సైజ్ SUV కొనాలనుకునే వారికి ఈ నెలలో లభించే బెనిఫిట్స్ కొంత ఖర్చు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.

ఇది కూడా చదవండి: గడువు ముగిసిన RC రెన్యువల్ చేయకపోతే భారీ జరిమానా.. పారివాహన్‌ పోర్టల్‌లో ఇలా అప్లై చేయండి!

Skoda Slavia పై రూ.30 వేల వరకు ఆఫర్లు

ఇటీవల పరిచయం చేసిన స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్‌పై కూడా కంపెనీ ఆఫర్లు అందిస్తోంది. ఈ సెడాన్‌పై రూ.30,000 వరకు బెనిఫిట్స్ లభించవచ్చు. ఇందులో రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 వరకు కార్పొరేట్ లేదా లాయల్టీ బెనిఫిట్ కలిసి ఉన్నాయి. స్లావియా ధరలు రూ.10 లక్షల నుంచి రూ.18.84 లక్షల వరకు ఉన్నాయి.

ఈ సెడాన్‌లో కుషాక్‌లో ఉన్న ఇంజిన్ ఆప్షన్లనే అందిస్తున్నారు. మార్కెట్‌లో హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ వర్చస్ వంటి కార్లకు స్లావియా పోటీగా నిలుస్తోంది.

 కారు కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

స్కోడా కైలాక్, కుషాక్, స్లావియా మోడళ్లపై ప్రకటించిన గరిష్ఠ బెనిఫిట్స్ అందరికీ ఒకేలా వర్తిస్తాయని చెప్పలేం. ఎక్స్ఛేంజ్ బోనస్ పొందాలంటే పాత కారు అర్హత నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. కార్పొరేట్, లాయల్టీ బెనిఫిట్స్‌కు ప్రత్యేక అర్హతలు వర్తించవచ్చు.

ఈ ఆఫర్లు 2026 అక్టోబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. నగరాన్ని బట్టి డిస్కౌంట్లలో మార్పులు ఉండవచ్చు. డీలర్ వద్ద ఉన్న స్టాక్‌ను బట్టి కూడా ఆఫర్లు మారే అవకాశం ఉంది. కాబట్టి కారు బుక్ చేసే ముందు స్థానిక షోరూమ్‌లో వివరాలు తెలుసుకోవాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌ ఇకపై కార్లలోకీ వస్తుంది! 2027 నుంచి వెహికల్‌ సేఫ్టీ రూల్స్‌ మరింత కఠినం
కార్లలోనూ విమానాల తరహా బ్లాక్‌బాక్స్‌.. ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది!
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
స్పోర్టీ లుక్‌తో వచ్చిన ఏప్రిలియా SXR GT 175 మ్యాక్సీ స్కూటర్.. ఇంజిన్‌, ఫీచర్లు, సౌకర్యం ఎలా ఉన్నాయి?
Aprilia SXR GT 175 ఫుల్‌ రివ్యూ.. ఈ బండిని కొనొచ్చా? ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి?
39hp పవర్.. ట్విన్ సిలిండర్ ఇంజిన్.. కేటీఎం డ్యూక్‌కు పోటీ.. Kawasaki Z300 గురించి ఇంకా మీకేం తెలుసు?
యూత్‌ఫుల్‌ బైక్‌ కవాసాకి Z300 గురించి 5 కీలక విషయాలు.. కొనే ముందే మీకివి తెలియాలి!
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rachamallu Siva Prasada Reddy : ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
ఏకగ్రీవాలతో ప్రజలకు అన్యాయం - ఓటుకు నాలుగువేలు ఇవ్వాలంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - ఓటర్లూ అదే ఫీలవుతారా?
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?
YS Jagan Vs Sharmila: షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
షర్మిల కూతురు పెళ్లి అక్కడ చేస్తే, మాజీ సీఎం జగన్ ప్రాణాలకు ముప్పు! షాకింగ్ విషయాలు
కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారికి అలర్ట్.. ఇకపై 75 శాతం మార్కులు తప్పనిసరి! కేంద్రం ప్రతిపాదన
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. ఇకపై 60 శాతం కాదు, 75 శాతం మార్కులు సాధించాల్సిందే!
Baththa Movie OTT : ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విజయ్ సేతుపతి కొత్త మూవీ - టాయిలెట్‌లో గ్యాంగ్ స్టర్‌... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AP Local Elections: ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
ఏపీలో స్థానిక పోరు- తీవ్ర ఉద్రిక్తతల మధ్య నామినేషన్లు.. సుప్రీం ఆదేశాలతో ఎస్ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ ముగ్గురు గోట్స్! దేబ్జానీ, నీతూలకు బిగ్‌బాస్ ప్రసంశలు! ఆట మార్చేసిన బాస్!
Embed widget